For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రూ.48,000 దిగువనే బంగారం ధరలు, ఈ డిప్‌లో కొనవచ్చా?

|

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన అనంతరం బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నాయి. పసిడి ధర పెరుగుతున్నట్లుగా కనిపించినప్పటికీ, అది స్వల్పంగా మాత్రమే. గోల్డ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్లో 1770 డాలర్ల నుండి 1800 డాలర్ల మధ్య, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.47,500 నుండి రూ.48,200 మధ్య కదలాడుతోంది. పసిడి ధరలు ఇప్పటికీ రూ.48,000 దిగువనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు కాస్త లాభపడింది. నేటి (శుక్రవారం, డిసెంబర్ 10) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,996 వద్ద ట్రేడ్ అయింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,130 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్ ధరలు క్రితం సెషన్‌లో అతి స్వల్పంగా క్షీణించాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి సెషన్‌లో రూ.85 క్షీణించి రూ.47,970 వద్ద ముగిసింది. నేడు స్వల్పంగా లాభపడ్డాయి.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 తక్కువ

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 తక్కువ

గోల్డ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్లో 1.5 డాలర్లు లాభపడి 1778 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 1776.70 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 22 డాలర్ల దిగువకు వచ్చింది. నేటి సెషన్లో 0.060 డాలర్లు క్షీణించి 21.953 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 22.013 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63.00 (-0.10%) తగ్గి రూ.60735.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.61405.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.8200 తక్కువగా ఉంది.

ఈ స్థాయిలో కొనుగోలు

ఈ స్థాయిలో కొనుగోలు

అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్ బంగారం మద్దతు ధర రూ.1762-1750 డాలర్లు. నిరోధకస్థాయి 1788-1800 డాలర్లు. వెండి మద్దతు ధర 21.84-21.55 డాలర్లు. నిరోధకస్థాయి 22.35-22.66 డాలర్లు.

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47770-47600. నిరోధకస్థాయి రూ.48100-48280. వెండి మద్దతు ధర రూ.60500-60100. నిరోధకస్థాయి రూ.61220-61600.

బంగారాన్ని ప్రస్తుత డిప్ సమయంలో రూ.47,480 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.48,100 టార్గెట్ ధరతో రూ.47,700 సమీపంలో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారంపై ప్రభావం

బంగారంపై ప్రభావం

ఈ రోజు యూఎస్ ద్రవ్యోల్భణ డేటా విడుదల కానుంది. ఫెడ్ మానిటరీ పాలసీ అంచనాలు ఈ డేటా ద్వారా వెల్లడవుతాయి. ద్రవ్యోల్భణ డేటా నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చైనా ప్రాపర్టీ రంగ ఒత్తిడి వంటి అంశాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం బులియన్ మార్కెట్ పైన ఉంటుంది.

English summary

Gold Price Today: రూ.48,000 దిగువనే బంగారం ధరలు, ఈ డిప్‌లో కొనవచ్చా? | Gold Price Today: Yellow metal trades below 48,000, Silver trades flat

India Gold MCX February futures trade higher on Friday tracking positive trend seen in the international spot prices, but March Silver futures trades flat with a negative bias.
Story first published: Friday, December 10, 2021, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X