For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: నిన్న భారీగా తగ్గి, నేడు స్థిరంగా బంగారం ధరలు

|

నిన్న భారీగా పడిపోయిన బంగారం ధరలు నేడు (జనవరి 6, 2022) స్థిరంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత పసిడి ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.48,000 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1795 డాలర్ల దిగువనే ఉన్నాయి. ఇక వెండి ధరలు నేడి మరింత క్షీణించాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8700 వరకు తక్కువగా ఉంది. నవంబర్ నెలలో సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత పసిడి ధరలు పక్షం రోజుల పాటు అప్రమత్తంగా కదలాడాయి. ఈ కొత్త వేరియంట్ ప్రభావం కాస్త కనిపించడంతో ఆ తర్వాత ధరలు రూ.50,000 దిశగా పరుగెత్తాయి. అయితే 2022 కొత్త సంవత్సరంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

నిన్న భారీగా తగ్గిన ధరలు

నిన్న భారీగా తగ్గిన ధరలు

బంగారం ధరలు క్రితం సెషన్(గురువారం, జనవరి 6) భారీగా తగ్గాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.606 క్షీణించి రూ.47,415 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600 తగ్గి రూ.47,550 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు వచ్చింది. ఇక వెండి ధర అయితే నిన్న దాదాపు రూ.2000 తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1788 క్షీణించి రూ.60,450 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1800 తగ్గి రూ.61,078 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ 22 డాలర్ల స్థాయికి వచ్చింది.

బంగారం ధరలు నేడు...

బంగారం ధరలు నేడు...

ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.6 పెరిగి రూ.47,457 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.26 పెరిగి రూ.47,602 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 3 డాలర్ల మేర పెరిగి 1792 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు కూడా కాస్త తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.126 క్షీణించి రూ.60,300 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.76 తగ్గి రూ.61,050 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో 0.033 డాలర్లు తగ్గి 22.157 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఏ స్థాయిలో కొనవచ్చు

ఏ స్థాయిలో కొనవచ్చు

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. అలాగే

ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అని ఇన్వెస్టర్లు అభిప్రాయపడితే, పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారాన్ని రూ.47,080 స్టాప్ లాస్‌తో, రూ.47,800 టార్గెట్ ధరతో రూ.47,300 వద్ద కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. అలాగే వెండి రూ.59,300 స్టాప్ లాస్‌తో రూ.61,400 టార్గెట్ ధరతో రూ.60,000 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

English summary

Gold Price Today: నిన్న భారీగా తగ్గి, నేడు స్థిరంగా బంగారం ధరలు | Gold Price Today: Yellow metal prices to remain range bound amid Omicron surge

Experts suggesting buying gold around Rs 47300 with a stop loss of Rs 47080 for target of Rs 47700 and silver around Rs 60000 with a stop loss of Rs 59300 for target of Rs 61300.
Story first published: Friday, January 7, 2022, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X