For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: ఆ తర్వాత బంగారం ధర తగ్గింది, ఇప్పుడు కొనవచ్చా?

|

బంగారం ధరలు సోమవారం (ఆగస్ట్ 30) క్షీణించాయి. గత వారం రోజులుగా ఈ పసుపు లోహం ఒత్తిడిలో ఉంది. ఈ ఏడాది చివరలో అమెరికా కేంద్ర బ్యాంకు తన అసెట్ పర్చేజ్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ సంకేతాలు ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నెలవారీ బాండ్స్ కొనుగోలులో కోతలను ప్రారంభించవచ్చునని సంకేతాలిచ్చారు.

అయితే సరైన గడువు తేదీ ప్రకటించకపోవడంతో సెప్టెంబర్ నెలలో జరిగే పరపతి విధాన సమావేశంలో స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి చూడవచ్చు. ఈ ప్రభావం పసిడి ధరల పైన కనిపిస్తోంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 0.30 శాతం వరకు క్షీణించాయి. వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు నాలుగు వారాల గరిష్టానికి చేరుకున్నప్పటికీ, అంతలోనే క్షీణించాయి.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ధరలు ఎలా ఉన్నాయంటే?

అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (సోమవారం) ప్రారంభ సెషన్‌లో రూ.141.00 (-0.30%) క్షీణించి రూ.47397.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.161.00 (-0.34%) తగ్గి రూ.161.00 (-0.34%) వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం ధరలు రూ.8,800 వరకు తక్కువగా ఉన్నాయి.

సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.215.00 (-0.34%) తగ్గి రూ.63370.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.245.00 (-0.38%) క్షీణించి రూ.63818.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రూ.2.60 (-0.14%) డాలర్లు తగ్గి 1,816.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల 1800 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం ఈ మార్కును దాటింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్లు క్రాస్ చేసింది. నేడు స్వల్పంగా క్షీణించినప్పటికీ ఆ మార్కు పైనే ఉంది. 0.087 (-0.36%) డాలర్లు క్షీణించి 24.023 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?

బంగారం ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో అక్టోబర్ ఫ్యూచర్ కీలకస్థాయి రూ.47,500 క్రాస్ చేస్తే రూ.47,800 దిశగా సాగవచ్చునని, రూ.48,000 వద్ద కూడా నిరోధకస్థాయి ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.47,800, రూ.48,000 నిరోధకస్థాయి దాటితే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,300 స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

మరోవైపు రూ.47,500 దిగువనే బంగారం ధరలు కొనసాగితే రూ.47,250 వద్ద మద్దతు ధర, నిరోధకస్థాయిలు రూ.47,000, రూ.46,750కి చేరుకోవచ్చునని చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఎలాంటి సమస్య లేదు. అయితే సమీప భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేవారు ఆచితూచి వ్యవహరించాలి.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో మధ్యాహ్నం సమయంలో ధరలు కాస్త పెరిగినప్పటికీ, అంతలోనే క్షీణించాయి. జెరోమ్ పోవెల్ వ్యాఖ్యలు ధరల పైన ప్రభావం చూపుతున్నాయి. వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో 3.16 శాతం తగ్గి 1814.59 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ 24.076 వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold Price Today: ఆ తర్వాత బంగారం ధర తగ్గింది, ఇప్పుడు కొనవచ్చా? | Gold Price Today Rs.8,800 Down from All time High, Should you buy?

Gold price in India saw a huge drop on Monday. The yellow metal remained under pressure since last week. The price fall on Monday after US Federal Reserve Chairman Jerome Powell indicated that the US central bank plans to cut its asset purchases later this year.
Story first published: Monday, August 30, 2021, 13:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X