For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: నిన్న పెరిగి నేడు తగ్గిన బంగారం ధర, ఆ స్థాయిలోనే ఉండే ఛాన్స్

|

ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్న మళ్లీ పెరిగాయి. అయితే నేడు స్వల్ప తగ్గుదల లేదా స్థిరంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు రూ.60,000 దిగువనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 1760 డాలర్లు క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం కాస్త పైకి చేరుకుంది. అయినప్పటికీ 23 డాలర్ల దిగువనే ఉంది. నేడు (సెప్టెంబర్ 21) దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.99.00 (-0.21%) క్షీణించి రూ.46179.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.107.00 (-0.23%) తగ్గి రూ.46320.00 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.19.00 (-0.03%) తగ్గి రూ.59590.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.20.00 (-0.03%) క్షీణించి రూ.60364.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 2.20 (-0.12%) డాలర్లు క్షీణించి 1,761.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.036 (+0.16%) డాలర్లు తగ్గి 22.240 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మద్దతుస్థాయి, నిరోధకస్థాయి

మద్దతుస్థాయి, నిరోధకస్థాయి

చైనాకు చెందిన ఎవర్‌గ్రాండ్ ఎస్టేట్ అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిన నేపథ్యంలో, బీజింగ్ మార్కెట్ నిన్న కుప్పకూలింది. ప్రధానంగా రియాల్టీ రంగం పతనమైంది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్, భారత మార్కెట్ పైన కనిపించింది. దీంతో నిన్న దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కాస్త పైకి చూశాయి. కానీ నేడు మాత్రం తిరిగి క్షీణించాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1760 స్థాయిలో ఉన్నాయి. చైనా రియల్ ఎస్టేట్ క్రైసిస్ నేపథ్యంలో 1750 డాలర్ల స్థాయి నుండి పది డాలర్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మద్దతు ధర రూ.1750 డాలర్లు, నిరోధకస్థాయి 1775 డాలర్లు. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.45,900, నిరోధకస్థాయి రూ.46,700గా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు

డాలర్, యెన్‌కు డిమాండ్

డాలర్, యెన్‌కు డిమాండ్

బలమైన అమెరికా డాలర్.. పసిడి పైన ప్రభావం చూపింది. అమెరికా సహా వివిధ దేశాలు ఆర్థిక ప్యాకేజీని తగ్గిస్తుందనే వార్తల ప్రభావం కూడా పసిడిపై ప్రభావం చూపుతోంది. హఠాత్తుగా చైనీస్ రియాల్టీ ఆందోళనలు అమెరికా డాలర్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. అమెరికా డాలర్, జపాన్ యెన్ వంటి వాటి వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. చైనా మార్కెట్ ఆందోళన కారణంగా నిన్న డాలర్ పుంజుకోవడంతో పాటు బంగారం కూడా కాస్త సానుకూలంగా కదలాడటం గమనార్హం. అయితే చైనా మార్కెట్ ప్రభావం ప్రపంచ మార్కెట్ పైన కనిపించింది. దీంతో నిన్న డౌజోన్స్ ఓ సమయంలో 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు కాస్త కోలుకున్నప్పటికీ ఒకటిన్నర శాతం క్షీణతతో ముగిసింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,500 నుండి రూ.45,800 మధ్య కదలాడవచ్చునని ట్రేడ్ బుల్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ అంచనా వేశారు.

వెండి మద్దతు ధర

వెండి మద్దతు ధర

గంగానగర్ కమోడిటీస్ ప్రకారం అక్టోబర్ గోల్డ్ మద్దతు ధర రూ.46000- 45800, నిరోధకస్థాయి రూ.46550-46800, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.59000- 58000, నిరోధకస్థాయి రూ.60150 - 60700.

English summary

Gold Price Today: నిన్న పెరిగి నేడు తగ్గిన బంగారం ధర, ఆ స్థాయిలోనే ఉండే ఛాన్స్ | Gold Price Today: gold future may trade range bound in 46500-45800 zone

Gold prices in India fell on Tuesday, mirroring global trends ahead of the US Federal Reserve meeting.
Story first published: Tuesday, September 21, 2021, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X