For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.49,000కు దిగివచ్చిన బంగారం ధర: మరింత తగ్గే అవకాశముందా?

|

బంగారం ధరలు శాంతించాయి. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. నేడు తగ్గినప్పటికి అది అతి స్వల్పమే. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు(సోమవారం, నవంబర్ 15) 164.00 (-0.33%) క్షీణించి రూ.49150.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.156.00 (-0.32%) నష్టపోయి రూ.49352.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,170.00 వద్ద ప్రారంభమైన డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,216.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,111.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-7.55 (0.40%) నష్టపోయి 1,860.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి సెషన్‌లో 1,858.90 - 1,871.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కామెక్స్‌లో 52 వారాల కనిష్టం, గరిష్టం 1677.90 - 1971.50 డాలర్లుగా ఉంది. క్రితం సెషన్‌లో 1,868.50 డాలర్ల వద్ద ముగిసిన, గోల్డ్ ఫ్యూచర్స్, ఏడాదిలో 2.24 శాతం మేర క్షీణించింది.

సిల్వర్ ఫ్యూచర్ ధర

సిల్వర్ ఫ్యూచర్ ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.600కు పైగా క్షీణించాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.610.00 (-0.91%) క్షీణించి రూ.66534.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.543.00 (-0.80%) క్షీణించి రూ.67431.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్ ధర తగ్గినప్పటికీ, 25 డాలర్లకు పైనే ఉంది. నేటి సెషన్‌లో 0.238 (0.94%) డాలర్లు ఎగిసి 25.108 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 25.346 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 24.995 - 25.462 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్టం, గరిష్టం 21.410 - 29.930 డాలర్లు.

అందుకే పసిడి జంప్

అందుకే పసిడి జంప్

డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 16 నెలల గరిష్టానికి సమీపంలో ఉంది. బయ్యర్స్ ఇతర కరెన్సీలను అట్టిపెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది బులియన్ మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది. అమెరికా ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉండటంతో బంగారం, వెండి ధరలు గతవారం భారీగా ఎగిశాయి. అమెరికా ద్రవ్యోల్భణం 31 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇది పసిడి ధర పరుగుకు దోహదపడింది. బంగారం ఐదు నెలల గరిష్టానికి, వెండి మూడు నెలల గరిష్టానికి చేరుకుంది.

టార్గెట్ ధర

టార్గెట్ ధర

అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో ఈ వారం పసిడి ధరలు క్షీణించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం రూ.49,000 దిగువకు, వెండి రూ.66,500 దిగువకు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బంగారం బై-జోన్ రూ.49,000, టార్గెట్ ధర రూ.49,500. సెల్-జోన్ రూ.48,800, టార్గెట్ ధర రూ.48,500.

English summary

రూ.49,000కు దిగివచ్చిన బంగారం ధర: మరింత తగ్గే అవకాశముందా? | Gold price today at Rs 49,150, silver at Rs 66,534

The price of ten gram of 24-carat gold on Monday increased by Rs 10 to Rs 49,290 from Sunday's trading price. A kg of silver is selling at Rs 67,200--unchanged from Sunday's price.
Story first published: Monday, November 15, 2021, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X