For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు? మార్కెట్ నిపుణుల సూచన

|

క్రితం వారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.49,000కు చేరువగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.48,000 స్థాయికి పడిపోయింది. ఎంసీఎక్స్‌లో చివరి సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.32 క్షీణించి రూ.48,120 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.101 క్షీణించి రూ.48,123 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లకు పైనే ముగిసింది. ఇది 1810 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

రూ.48,000కు పైన బంగారం

రూ.48,000కు పైన బంగారం

ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో గత నెల చివరలో అప్రమత్తంగా వ్యవహరించారు ఇన్వెస్టర్లు. అయితే ఆ తర్వాత ధరలు భారీగా తగ్గాయి. ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరిస్తుండటంతో మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. ఇధి రూ.49,000 క్రాస్ చేసి, 50వేల దిశగా పరుగు పెడుతుందా అనేలా కనిపించింది. అయితే గతవారం మళ్లీ స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ రూ.48,000కు పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను 1810 డాలర్ల వద్ద ఉంది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 5 శాతం క్షీణించింది.

ధరలు ఎందుకు తగ్గాయంటే

ధరలు ఎందుకు తగ్గాయంటే

బంగారం ధరలు స్వల్పంగానే తగ్గాయి. ఈ తగ్గుదలకు వివిధ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ వ్యాల్యూతో భారత కరెన్సీ రూపాయి మారకం కాస్త పెరిగింది. అంటే యూఎస్ డాలర్ కాస్త క్షీణించింది. రూపాయి వ్యాల్యూ పెరగడం వల్ల బంగారం ధర దేశీయ మార్కెట్లో స్వల్పంగా క్షీణించింది.

అంతర్జాతీయంగా డాలర్ వ్యాల్యూ క్షీణించిన కారణంగా బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం డాలర్ వ్యాల్యూతో రూపాయి వృద్ధి సాధించినందు వల్ల మాత్రమే బంగారం ధర తగ్గిందని, కానీ ఎంసీఎక్స్‌లో బుల్లిష్‌గానే ఉందని అంటున్నారు. రూపాయి వృద్ధి కారణంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ వలె పెరుగుదలను నమోదు చేయలేదు.

సమీప భవిష్యత్తులో ఎలా అంటే..

సమీప భవిష్యత్తులో ఎలా అంటే..

బంగారం ధరలు సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో 1760 డాలర్ల నుండి 1835 డాలర్ల మధ్య కొనసాగవచ్చునని, అలాగే దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.48,000 నుండి రూ.48,700 మధ్య ట్రేడ్ కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

విక్రయించాలని చూసే గోల్డ్ ఇన్వెస్టర్లకు బులియన్ మార్కెట్ నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. ప్రస్తుతం సమీప భవిష్యత్తు కోసం డిప్‌లో కొనుగోలు చేయవచ్చునని, అయితే స్వల్ప పెరుగుదలలో విక్రయించవద్దని సూచిస్తున్నారు. బంగారం సమీప భవిష్యత్తులో 1835 డాలర్ల వద్ద తీవ్ర నిరోధకస్థాయిని ఎదుర్కోవచ్చునని, ఈ స్థాయిని దాటితే 1880 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు.

English summary

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు? మార్కెట్ నిపుణుల సూచన | Gold price dips this week, Experts unveil this strategy for bullion investors

Multi Commodity Exchange or MCX gold rate on Friday dipped ₹32 per 10 gm and closed at ₹48,120 levels, logging ₹483 slide in a week. This fall in February future contract of yellow metal price has taken place despite rising cases of Omicron, escalating crude oil price, jump in global inflation concerns, etc.
Story first published: Sunday, December 26, 2021, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X