For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

|

బంగారం, వెండి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. రెండు రోజుల్లో రూ.400 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి నిన్న ఎంత పెరిగిందే, నేడు దాదాపు అంతే తగ్గింది. బంగారం ధరలు నిన్న స్వల్పంగా రూ.311 తగ్గగా, వెండి రూ.338 పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.311 తగ్గి రూ.47,640 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.193 తగ్గి రూ.48,176 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.338.00 (0.47%) పెరిగి రూ.71882.00 వద్ద, రూ.339.00 (0.47%) పెరిగి రూ.72991.00 వద్ద క్లోజ్ అయింది.

వడ్డీ రేట్లను సవరించిన IDFC ఫస్ట్ బ్యాంకు, మే 1 నుండి అమల్లోకి: వడ్డీ రేటు వివరాలువడ్డీ రేట్లను సవరించిన IDFC ఫస్ట్ బ్యాంకు, మే 1 నుండి అమల్లోకి: వడ్డీ రేటు వివరాలు

బంగారం, వెండి బుల్లిష్

బంగారం, వెండి బుల్లిష్

బంగారం, వెండి ధరలు మరింత కాలం బుల్లిష్‌గానే ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, సెకండ్ వేవ్ ఆందోళన, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టేవారికి, అలాగే సమీప భవిష్యత్తులో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1800 డాలర్లకు పైగా ఉండే వరకు 'బై ఆన్ డిప్స్'ను కొనసాగించవచ్చునని సూచిస్తున్నారు.

మళ్లీ తగ్గిన బంగారం ధర

మళ్లీ తగ్గిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.98.00 (-0.21%) తగ్గి రూ.47535.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,497.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,569.00 గరిష్టాన్ని, రూ.47,465.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.79.00 (-0.16%) తగ్గి రూ.48088.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,015.00 వద్ద ప్రారంభమై, రూ.48,090.00 గరిష్టాన్ని, రూ.47,965.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,500 దిగువకు వెండి

రూ.71,500 దిగువకు వెండి

నిన్న రూ.72,000 సమీపానికి చేరుకున్న సిల్వర్ ఫ్యూచర్స్ నేడు కాస్త తగ్గి రూ.71,500 దిగువకు వచ్చింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.439.00 (-0.61%) తగ్గి రూ.71490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,805.00 వద్ద ప్రారంభమై, రూ.71,805.00 గరిష్టాన్ని, రూ.71,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.326.00 (-0.45%) తగ్గి రూ.72608.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,517.00 ప్రారంభమైన ధర, రూ.72,629.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,427.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 1830 డాలర్ల వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.85 (0.32%) డాలర్లు తగ్గి 1,830.40 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,826.15 - 1,838.50 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.170 (0.61%) డాలర్లు తగ్గి 27.497 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.402 - 27.760 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి సమయమా? | Gold price dips, Experts say good opportunity for buyers

Gold price at Multi Commodity Exchange (MCX) dipped ₹311 after closing at ₹47,640 per 10 gm mark on Tuesday. However, silver price continued to scale and closed ₹338 higher from its Monday close. Silver on Tuesday had a closing price of ₹71,882 per kg.
Story first published: Wednesday, May 12, 2021, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X