For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఈ వారం మరింత పెరగొచ్చా? పెరిగినా రూ.45,000 దిగువనే పసిడి

|

ముంబై: ఇటీవల బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. స్వల్ప పెరుగుదల, క్షీణతతో రూ.45,000కు దిగువనే కొనసాగుతున్నాయి. నేడు (మార్చి 17 బుధవారం) గోల్డ్ ఫ్యూచర్ ధరలు కాస్త పెరిగినప్పటికీ రూ.45వేల మార్కు దాటలేదు. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.98.00 (-0.22%) క్షీణించి రూ.44,802 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.105.00 (-0.23%) తగ్గి రూ.45,192 వద్ద క్లోజ్ అయింది. వెండి కూడా రూ.నిన్న రూ.67,000 దిగువన ముగిసింది. మే ఫ్యూచర్స్ రూ.739.00 (-1.09%) తగ్గి రూ.66,930 వద్ద, జూలై ఫ్యూచర్ సిల్వర్ రూ.67,950 వద్ద ముగిసింది.

బంగారం ధర ఎలా ఉండొచ్చు

బంగారం ధర ఎలా ఉండొచ్చు

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నాయి. ఓ సమయంలో 1700 డాలర్ల దిగువకు పడిపోయిన ఫ్యూచర్ ఇప్పుడు 1750 డాలర్ల దిశగా కనిపిస్తోంది. ఈ వారంలోనే పసిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అయితే అది స్వల్పంగానే అని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పసిడి 1735 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఇది 1744 డాలర్లను క్రాస్ చేస్తే 1787 డాలర్ల దిశగా దూసుకెళ్లవచ్చునని అంచనా వేస్తున్నారు. షార్ట్ టర్మ్ స్థాయి 1815.20 డాలర్ల నుండి 1673.30 డాలర్లు.

రూ.45వేల దిగువనే బంగారం

రూ.45వేల దిగువనే బంగారం

గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, రూ.45వేల దిగువనే ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.152.00 (0.34%) పెరిగి రూ.44965.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,890.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,965.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,890.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,300 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.149.00 (0.33%) పెరిగి రూ.45340.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,273.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,340.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,273.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర ఎలా ఉందంటే

వెండి ధర ఎలా ఉందంటే

వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.53.00 (0.08%) పెరిగి రూ.66972.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,930.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,052.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,896.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.67950.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 1750 డాలర్ల దిశగా వెళ్తోంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.45

(+0.26%) డాలర్లు పెరిగి 1,735.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,727.60 - 1,735.05 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ ధర 0.041 (-0.16%) డాలర్లు తగ్గి 25.962 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.817 - 26.030 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

బంగారం ధరలు ఈ వారం మరింత పెరగొచ్చా? పెరిగినా రూ.45,000 దిగువనే పసిడి | Gold Price Analysis: $1744.30 Potential Trigger Point for Acceleration into $1787.30

The short-term direction of the gold market is likely to be determined by trader reaction to the 50% level at $1744.30.
Story first published: Wednesday, March 17, 2021, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X