For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold or Crypto: బంగారం కంటే బిట్‌కాయిన్ అదరగొట్టింది, కానీ.. తేడాలివే

|

ఏడాదిన్నర క్రితం వచ్చి, అన్ని దేశాలను తీవ్రంగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుండి యావత్ ప్రపంచం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ప్రధానంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉండాలనే ఉద్దేశ్యంతో సేవింగ్స్, పెట్టుబడుల వైపు దృష్టిని మరల్చారు. ముందు నుండే తెలివిగా ఆలోచించి డబ్బు విషయంలో సరైన నిర్ణయం తీసుకున్న వారు లాక్ డౌన్ వంటి కఠిన సమయంలో ఇబ్బంది లేకుండా ఉన్నారు. కరోనా సమయంలో ప్రజలు సురక్షిత అసెట్స్ వైపు చూశారు. సాధారణంగా రియాల్టీ పైన పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి.

కరోనా సమయంలో చేతిలో పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో రియాల్టీ ఊపు తగ్గింది. ఇటీవల క్రమంగా పుంజుకుంటోంది. అయితే బంగారం, బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులకు చాలామంది మొగ్గు చూపారు. ఈ కాలంలో బంగారం, వివిధ రకాల క్రిప్టోలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఈ ఏడాది కాలంలో బంగారంపై భారీ రిటర్న్స్ వచ్చాయి. కానీ బంగారం కంటే క్రిప్టో మంచి రిటర్న్స్ అందించింది.

క్రిప్టో కొత్త హాట్ కేక్

క్రిప్టో కొత్త హాట్ కేక్

సాధారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తారు. అంతేకాదు, ఏడాదిన్నర కాలంలో బంగారం మంచి రిటర్న్స్ అందించింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో బంగారం ఏకంగా ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తోంది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేల వరకు తక్కువగా ఉంది. మొత్తానికి కరోనా నుండి బంగారం మంచి రిటర్న్స్ అందించింది.

అయితే క్రిప్టో కరెన్సీ అంతకుమించిన రిటర్న్స్ అందించింది. బంగారం వలె క్రిప్టో కూడా కరోనా కాలంలో ఆల్ టైమ్ గరిష్టం (65,000 డాలర్లు), ఆ తర్వాత కనిష్టం (30వేల డాలర్ల దిగువకు) చూసింది. ఇటీవల మళ్లీ పరుగు పెడుతోంది. మొత్తంగా కరోనా ముందుతో పోలిస్తే బంగారం కంటే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు మంచి రిటర్న్స్ ఇచ్చాయి.

బంగారం.. కరెన్సీలా కాదు..

బంగారం.. కరెన్సీలా కాదు..

- బంగారం పెట్టుబడి సాధనంగా ఉపయోగపడటంతో పాటు జ్యువెల్లరీ సాధనం కూడా. చాలా విలువైన వస్తువు. అయితే అది సమృద్ధిగా ఉండదు.

- డిమాండ్‌తో సంబంధం లేకుండా సరఫరా అసమానంగా లేదా తక్కువగా ఉంటుంది.

- బంగారం అన్ని ఉత్పత్తుల్లా తయారు చేసేది కాదు. ఒక కంపెనీ కొత్త షేర్లను జారీ చేయవచ్చు. ఫెడరల్ బ్యాంకు డాలర్లను లేదా కరెన్సీని ముద్రించవచ్చు. కానీ బంగారం విషయంలో అలా చేయలేము. ఇది భూమి నుండి తవ్వి మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది.

క్రిప్టో కరెన్సీ

క్రిప్టో కరెన్సీ

- డిజిటల్ కరెన్సీయే క్రిప్టో కరెన్సీ.

- బిట్ కాయిన్ అనేది బ్లాక్ చైన్ ఆధారిత క్రిప్టో కరెన్సీ. అయితే బంగారంతో కొన్ని లక్షణాలను పంచుకుంటుంది.

- స్టాక్స్‌తో ఇటీవలి వరకు పెద్దగా సంబంధం లేనందున దీనిని ఇదివరకు డిజిటల్ గోల్డ్‌గా పిలిచారు.

- బంగారం వలె బిట్ కాయిన్ కూడా పరిమితంగానే ఉంటుంది.

- క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్, ఎథేరియం, ఎక్స్‌పీఆర్, టెథేర్ సహా ఎన్నో రకాల క్రిప్టోలు ఉన్నాయి.

బంగారంXక్రిప్టో

బంగారంXక్రిప్టో

- చట్టబద్ధత, పారదర్శకత, సెక్యూరిటీ పరంగా చూస్తే బిట్ కాయిన్ కంటే బంగారం ముందు నిలుస్తుంది.

- రెండు అటు ఇటుగా అరుదైనవే.

- లిక్విడిటీ విషయానికి వస్తే రెండూ అట్టిపెట్టుకోవచ్చు. అయితే మార్కెట్ పైన అవగాహన కలిగి ఉండాలి.

- బంగారంతో పోలిస్తే బిట్ కాయిన్ వ్యాల్యూ కాస్త ఎక్కువ అస్థిరంగా ఉంటుంది. సుదీర్ఘ చరిత్రను పరిశీలిస్తే క్రిప్టో కంటే బంగారం తక్కువ అస్థితరతను కలిగి ఉంది.

- బంగారాన్ని కేంద్ర బ్యాంకులు కూడా సమకూర్చుకుంటాయి. కేంద్ర బ్యాంకుల మారకంలో బంగారం కీలకం.

- కానీ క్రిప్టో కరెన్సీని పలు దేశాలు ఇప్పటికీ ఆమోదించడం లేదు. ఎన్నో దేశాలు క్రిప్టో పైన గందరగోళంగా ఉన్నాయి.

కరోనా సమయంలో రిటర్న్స్

కరోనా సమయంలో రిటర్న్స్

- క్రిప్టో కంటే బంగారం సురక్షిత, చట్టబద్ధత, పారదర్శకత కలిగిన సాధనం. అయితే కరోనా కాలంలో బంగారం కంటే క్రిప్టో ఎక్కువ రిటర్న్స్ అందించింది. అలాగే, బిట్ కాయిన్.. బంగారం కంటే 100X మెరుగుదలను (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) నమోదు చేసింది. ప్రపంచం కూడా డిజిటల్ కరెన్సీ వైపు చూస్తోంది.

- కొద్ది నెలల కాలంలోనే బిట్ కాయిన్ వంటి క్రిప్టో వందల రెట్లు ఎగిసింది.

- బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేన్ 2030 నాటికి బంగారం మార్కెట్ క్యాప్‌ను దాటవచ్చుననే అంచనాలు ఉన్నాయి.

- బంగారం, క్రిప్టో కరెన్సీ... రెండు కూడా సొంత యోగ్యతలు, అయోగ్యతలను కలిగి ఉన్నాయి. అయితే ఇవి పెట్టుబడిదారు విచక్షణపై ఆధారపడి ఉంటాయి.

- ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం రూ.48,000 దిగువనే ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.46,300 వద్ద ఉంది. ఇక క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ ప్రస్తుతం 45,400 డాలర్లను క్రాస్ చేసింది. నెల రోజుల కాలంలో బిట్ కాయిన్ 30,000 డాలర్ల దిగువ నుండి 45,000 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. బిట్ కాయిన్‌తో పాటు ఎథేరియం, టెథేర్, XPR, లైట్ కాయిన్ వంటివి జంప్ చేస్తున్నాయి.

English summary

Gold or Crypto: బంగారం కంటే బిట్‌కాయిన్ అదరగొట్టింది, కానీ.. తేడాలివే | Gold or Crypto: Which one gives better returns in Pandemic time

Investments in gold have given best returns in Pandemic time. But diminishing the shine of yellow metal, cryptocurrency has given even better returns than gold.
Story first published: Thursday, August 12, 2021, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X