For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ పెరుగుదల: రూ.53,000కు చేరుకుంటుందా, బంగారం కొనుగోలు చేయవచ్చా?

|

బంగారం ధరలు గతవారం భారీగా పెరిగాయి. గత నెలలో రూ.47,000 దిగువన ఉన్న పసిడి ధరలు ఇప్పుడు రూ.50,000ను సమీపించాయి. దేవ్ ఉథానీ గ్యారాస్, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో పసిడి ధర రూ.50,000 దాటింది. ఐదు నెలల తర్వాత బంగారం ధర ఈ మార్కును దాటింది. బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.49,500 వద్ద ఉండగా, శుక్రవారం నాటికి రూ.50,550కి చేరుకుంది. అయితే శనివారం రూ.50,830కి చేరుకుంది. అంతకుముందు పసిడి ధర జూన్ 11వ తేదీన రూ.50,000కు పైన పలికింది. నాటి నుండి రూ.50,000 దిగువనే ఉంది.

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల బంగారం ధర రూ.7000కు వరకు తక్కువగా ఉంది. దీపావళి, ధనతెరాస్ సమయంలో సాధారణంగా బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పండుగ తర్వాత ఈసారి మరింత పెరిగాయి. దీపావళి నుండి రూ.1000కి పైగా పెరిగింది. పసిడి ధరలు ఈ వారం కూడా కాస్త పైపైకి చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధర

బంగారం ధర

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,000 సమీపించింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.130.00 (0.26%) లాభపడి రూ.49346.00 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.96.00 (0.19%) ఎగిసి రూ.49508.00 వద్ద ట్రేడ్ అయింది. చివరి సెషన్‌లో ఓ సమయంలో రూ.48,875 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ, చివరకు ఆ సెషన్ గరిష్టం రూ.49,346 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1865 డాలర్లు క్రాస్ చేసింది. 3.95 (+0.21%) డాలర్లు లాభపడి 1,867.85 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో 1,863.90 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 2 శాతం మాత్రమే క్షీణించింది.

వెండి ధర

వెండి ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్ రూ.47,000 క్రాస్ చేసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.183.00 (0.27%) పెరిగి రూ.67148.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.155.00 (0.23%) ఎగిసి రూ.67972.00 వద్ద క్లోజ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో రూ.67400 వద్ద కూడా ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్లు దాటింది. క్రితం సెషన్‌లో 0.112 (+0.44%) డాలర్లు పెరిగి 25.413 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు

వివిధ నగరాల్లో బంగారం ధరలు

24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.52,420, ముంబైలో రూ.49,270గా ఉంది. కోల్‌కతాలో రూ.51,200గా, చెన్నైలో రూ.50,460గా ఉంది. హైదరాబాద్‌లో రూ.50,100 వద్ద ఉంది.

బంగారం ధరలు ఐదు నెలల గరిష్టం వద్ద, అలాగే, ఆల్ టైమ్ గరిష్టంతో 2.5 శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయి.

బంగారం ధరలు మరికొద్ది రోజులు ముందుకు సాగనున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణం ఆందోళనలు, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ వంటి అంశాలు పసిడితో పాటు వెండి ధరలకు మద్దతుస్తున్నట్లు చెబుతున్నారు. బంగారం ధరలు 51,000కు కూడా చేరుకోవచ్చునని, ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72,000కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎంసీఎక్స్‌లో రూ.51,000 దాటితే బహిరంగ మార్కెట్లో రూ.53,000కు అటు ఇటుగా ఉంటుంది.

English summary

భారీ పెరుగుదల: రూ.53,000కు చేరుకుంటుందా, బంగారం కొనుగోలు చేయవచ్చా? | Gold near 9 month high, price crosses Rs 50,000

The price 24 carat gold crossed Rs 50,000 mark in Madhya Pradesh ahead of Dev Uthani Gyaras and wedding season, as per readings of PaisaBazaar gold tracker on Saturday. This has happened after 5 months.
Story first published: Sunday, November 14, 2021, 12:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X