For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా వడ్డీ రేటు ఎఫెక్ట్, వారం కనిష్టానికి బంగారం ధరలు: ఏ స్థాయిలో కొనుగోలు?

|

బంగారం ధరలు గత కొంతకాలంగా దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. నేటి (జనవరి 19) సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.5 క్షీణించి రూ.47,921 వద్ద ఉంది. పసిడి ధరలు కొద్ది రోజులుగా రూ.48,000కు దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం రూ.48,000కు పైన ఉంది. ఇది రూ.48,021 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 2 డాలర్లు క్షీణించి 1810 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.114 పెరిగి రూ.63,133 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.126 పెరిగి రూ.63,748 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచతర్స్ 0.019 డాలర్లు ఎగిసి 23.473 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నిన్న భారీగా పెరిగిన వెండి

నిన్న భారీగా పెరిగిన వెండి

బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.31 పెరిగి రూ.47,948 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.11 లాభపడి రూ.48,030 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం గతవారం ఓ సమయంలో 1830 డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే గత రెండు మూడు సెషన్లుగా క్షీణిస్తోంది.

దీంతో ప్రస్తుతం 1810 డాలర్ల వద్ద ఉంది. అదే సమయంలో వెండి ధరలు మాత్రం నిన్న భారీగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.1222 పెరిగి రూ.63,120 వద్ద ముగిసింది. నిన్న ఉదయం రూ.62,000 దిగువన ఉన్న పసిడి ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.63,000 క్రాస్ చేసింది.

అందుకే ధరల తగ్గుదల

అందుకే ధరల తగ్గుదల

బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం వారం రోజుల కనిష్టానికి పడిపోయాయి. 2022లో వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ భారీగా పెరిగాయి. ట్రెజరీ యీల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఇది పసిడి ధరలపై ప్రభావం చూపింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1810 డాలర్ల వద్ద ఉండగా, స్పాట్ గోల్డ్ ధర నిన్న 1813 డాలర్ల వద్ద కనిపించింది.

మద్దతు ధర

మద్దతు ధర

ఈ వారం బంగారం ధరలు దాదాపు స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర 1800 డాలర్లు, ఈ స్థాయి దిగువకు చేరుకుంటే 1782 డాలర్లకు పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో రూ.48,000 నిరోధకం కనిపిస్తోందని చెబుతున్నారు. రూ.48,500 టార్గెట్ ధరతో రూ.48,000 వద్ద కొనుగోలు చేయవచ్చునని, అలాగే రూ.47,500 టార్గెట్ ధరతో రూ.47,700 వద్ద విక్రయించవచ్చునని చెబుతున్నారు.

English summary

అమెరికా వడ్డీ రేటు ఎఫెక్ట్, వారం కనిష్టానికి బంగారం ధరలు: ఏ స్థాయిలో కొనుగోలు? | Gold flat near one week low as US rate hike looms

Gold prices were flat on Wednesday (Jan 19), steadying near a one-week low hit in the previous session, as US Treasury yields strengthened to two-year highs on expectations of quicker interest rate hikes by the US Federal Reserve (Fed).
Story first published: Wednesday, January 19, 2022, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X