For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం కూడా మార్కెట్ ఊగిసలాటలోనే, బంగారం ధరలు తగ్గుతాయా?

|

స్టాక్ మార్కెట్లు గతవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బులియన్ మార్కెట్ కూడా సానుకూలంగానే ముగిసింది. బంగారం ధరలు గతవారం పెరిగినప్పటికీ ఫ్యూచర్ మార్కెట్లో రూ.48,000కు దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్ 1800 డాలర్లకు దిగువనే ఉంది. గతవారం బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ తీవ్ర ఊగిసలాటలో కొనసాగింది. ఈ వారం కూడా అలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తే మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఒమిక్రాన్, డాలర్ ప్రభావం, యూఎస్ టెన్ ఇయర్ యీల్డ్స్ వంటి అంశాలు పసిడి పైన ప్రభావం చూపుతాయి.

అమ్మకాల ఒత్తిడి

అమ్మకాల ఒత్తిడి

FII అమ్మకాల ఒత్తిడి, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు గతవారం మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేశాయి. ఐటీ రంగ సూచీ మాత్రమే కాస్త లాభపడి, మార్కెట్ పతనాన్ని అడ్డుకుంది. అయితే మిగతా రంగాల స్టాక్స్‌లో మాత్రం లాభాల స్వీకరణ కనిపించింది. గత మూడు రోజుల్లో FIIలు రూ.7,031.72 కోట్ల మేర విక్రయాలు జరిపారు. దీంతో రెండు రోజులపాటు సూచీలు లాభపడినా గరిష్ఠస్థాయిల్లో నిలబడలేదు.

స్వల్పకాల 5, 8 చలన సగటులకు ఎగువన ఒకరోజుకు మించి నిఫ్టీ నిలదొక్కుకోలేదు. అలాగే 20, 50 రోజుల చలనసగటు డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయి. ఇది మార్కెట్ బలహీనతకు నిదర్శనం. రిలేటివ్ స్ట్రేన్త్ ఇండికేటర్ బేరిష్ జోన్‌లో కొనసాగుతోంది. ఇది కనీసం 45 స్థాయిని అధిగమిస్తే మార్కెట్ ర్యాలీ వచ్చటే అవకాశాలు తక్కువ అంటున్నారు.

ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు

ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు

అయితే జూలై-సెప్టెంబర్ కాలంలో జీడీపీ 8.4 శాతం వృద్ధి, నవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లు దాటడం మార్కెట్‌కు సానుకూల అంశం. తయారీ పీఎంఐ 57.6, సేవల పీఎంఐ 58.1కి పెరిగింది. ఒమిక్రాన్ కేసులు దేశీయంగా నమోదు కావడం మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతోంది. పలు దేశాల్లో లాక్ డౌన్, ప్రయాణ ఆంక్షలు విధించడంతో ప్రపంచ మార్కెట్ ఢీలా పడ్డాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన ఉంటుంది. పార్లమెంటు శీతాకాలసమావేశాల్లో కీలక బిల్లుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

సెన్సెక్స్ తక్షణ మద్దతుస్థాయి 57,500, 56,900. నిరోధకస్థాయి 58,200, 58,760. సెన్సెక్స్ స్వల్పకాలంలో మరింత స్థిరీకరణకు లోనుకావొచ్చు.నిఫ్టీకి 17000 పాయింట్ల వద్ద గట్టి నిరోధకం ఎదురు కావొచ్చు.

బంగారం ఎలా ఉండవచ్చు

బంగారం ఎలా ఉండవచ్చు

గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ ఈ వారం రూ.48,500 వద్ద నిరోధకం చూడవచ్చునని, ఈ స్థాయిని అధిగమిస్తే రూ.49,000ను కూడా క్రాస్ చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. రూ.48,500 దిగువనే ఉంటే దిద్దుబాటుకు గురి కావొచ్చునని చెబుతున్నారు. రూ.47,400 స్థాయి దిగువకు వస్తే రూ.46,800 దిగువకు పడిపోవచ్చునని చెబుతున్నారు.

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,630 పైన కదలాడితే రూ.63,300 పైకి చేరుకొని, రూ.65,000ను కూడా దాటే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

English summary

ఈ వారం కూడా మార్కెట్ ఊగిసలాటలోనే, బంగారం ధరలు తగ్గుతాయా? | Gold and Stock Market forecast for December 6 week

The Nifty50 and BSE Sensex rose over 1 per cent previous week despite closing lower in two out of the four sessions.
Story first published: Monday, December 6, 2021, 9:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X