For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం బంగారం ధరలు, స్టాక్ మార్కెట్లు ఎలా ఉండవచ్చు?

|

భారత స్టాక్ మార్కెట్లు గతవారం భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం సెన్సెక్స్ 1246 పాయింట్లు లాభపడగా, అంతకుముందు వారం కూడా 1293 డాలర్లు లాభపడింది. బెంచ్ మార్క్ సెన్సెక్స్ క్రితం వారంలో 61,000 మార్కును క్రాస్ చేసింది. గతవారం సెన్సెక్స్ 61,305 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,338 పాయింట్ల వద్ద ముగిసింది. చివరి సెషన్‌లో సెన్సెక్స్ 569 పాయింట్లు లేదా 0.94 శాతం మేర లాభపడింది. నిఫ్టీ 176.70 పాయింట్లు పెరిగింది.

సూచీలు ఈ వారం కూడా లాభాల్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కరోనా కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ అంశం, అంతర్జాతీయ మార్కెట్ సానుకూలతల నేపథ్యంలో ఈ వారం సూచీలు కాస్త ముందుకు సాగే అవకాశముందని అంటున్నారు.

అందుకే లాభాలు

అందుకే లాభాలు

గత శుక్రవారం యూఎస్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. డౌజోన్స్ జూన్ నెల తర్వాత మొదటిసారి ఓ వారంలో భారీగా ఎగిసిపడింది. గోల్డ్ మన్ శాక్స్ గ్రూప్ షేర్లు 3.8 శాతం మేర లాభపడ్డాయి. ఈ బ్యాంకు క్వార్టర్లీ ప్రాఫిట్ మంచి వృద్ధిని కనబరిచింది. దీంతో ఈ స్టాక్స్ లాభపడ్డాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 382.2 పాయింట్లు లేదా 1.09 శాతం లాభపడి 35,294.76 వద్ద, ఎస్ అండ్ పీ 500 కూడా 33.11 పాయింట్లు లేదా 0.75 శాతం లాభపడి 4,471.37 పాయింట్ల వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 73.91 పాయింట్లు లేదా 0.5 శాతం ఎగిసి 14,897.34 పాయింట్ల వద్ద ముగిసింది.

ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భారత మార్కెట్లకు ఊతమిచ్చే అవకాశముంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, వేగవంత వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆర్థిక రికవరీతో గతవారం దేశీయ మార్కెట్లు తాజా గరిష్టాలను తాకాయని, ఈ వారం కూడా అలాగే కొనసాగవచ్చునని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పండుగ సీజన్ నేపథ్యంలో డిమాండ్ పుంజుకుంటుందని, విమానయాన రంగానికి నిబంధనల సడలింపులు కలిసి వచ్చాయంటున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ 2021లో 9.5 శాతం, 2022లో 8.5 శాతం వృద్ధి చెందొచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 11.9 శాతం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతానికి, హోల్ సేల్ ద్రవ్యోల్బణం 10.7 శాతానికి తగ్గాయి. ఎగుమతులు 22.6 శాతం పెరిగి 33.8 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వాణిజ్య లోటు 22.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే ప్రభుత్వం పీఎం గతిశక్తి యోజన ద్వారా రూ.111 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంటును బలోపేతం చేసింది. ముడి చమురు ధరలు మాత్రం అప్రమత్తతకు కారణం కానున్నాయి.

మద్దతు, నిరోదకస్థాయి

మద్దతు, నిరోదకస్థాయి

సెన్సెక్స్ తక్షణ మద్దతు 60,730, తక్షణ నిరోధకస్థాయి 61,800. సెన్సెక్స్ 60,330 దిగువకు చేరితో మరింత క్షీణించి 60,000 దికువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో 62,500 క్రాస్ చేస్తే, 63,000 దిశగా పరుగులు పెట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే గతవారం భారీగా ర్యాలీ చేసిన నేపథ్యంలో స్థిరీకరణను కొట్టి పారేయలేమని అంటున్నారు.

బంగారం ధరలు

బంగారం ధరలు

గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ ఈవారం క్షీణిస్తే రూ.46,685 వద్ద సపోర్ట్ ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే రూ.46,000 స్థాయికి పడిపోవచ్చునని అంటున్నారు. రూ.46,420 వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని రూ.47,660 టార్గెట్‌తో రూ.46,680 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,225 దిగువకు వస్తే రూ.61,700కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ.65,375ను అధిగమిస్తే మాత్రం రూ.66,150కి పెరగవచ్చునని అంటున్నారు.

English summary

ఈ వారం బంగారం ధరలు, స్టాక్ మార్కెట్లు ఎలా ఉండవచ్చు? | Gold and Share market forecast for this week

The Indian stock market is expected to open in the green as trends on SGX Nifty indicate a positive opening for the index in India against October 14 close of 18,355.
Story first published: Monday, October 18, 2021, 9:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X