For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్ కావాల్సిందే: క్రెడిట్ కార్డు అంత ఈజీ కాదు, నిబంధనలు కఠినమే

|

న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు తీసుకోవడానికి కొంతమంది జంకుతుంటారు. చాలామంది తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులను అంత సులభంగా జారీ చేయడం లేదు బ్యాంకులు. కరోనా అనంతరం అత్యంత పకడ్బందీగా క్రెడిట్ కార్డ్సు ఇస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్న వారికి సులభంగా వస్తుంది. రుణాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి రిస్క్‌లు పెరుగుతున్న దృష్ట్యా బ్యాంకులు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. కొన్ని బ్యాంకులు అయితే క్రెడిట్ కార్డు జారీకి 780 క్రెడిట్ స్కోర్ కోరుతున్నాయి.

SBI గుడ్‌న్యూస్, హోంలోన్‌పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీSBI గుడ్‌న్యూస్, హోంలోన్‌పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ

క్రెడిట్ స్కోర్...

క్రెడిట్ స్కోర్...

గతంలో క్రెడిట్ కార్డు జారీ చేయడానికి సగటున 700 క్రెడిట్ స్కోర్ చూసేవి బ్యాంకులు. ఇప్పుడు చాలా బ్యాంకులు క్రెడిట్ స్కోర్ 780 ఉంటేగానీ క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదు. క్రిడెట్ కార్డులు, లోన్ లేదా ఇతర క్రెడిట్ ఉత్పత్తులను జారీ చేయడానికి బ్యాంకులు ఇప్పుడు ప్రధానంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తున్నాయి.

నష్టాలను అంచనా వేసేందుకు ఇది కీలకమైన అంశంగా మారింది. ఎక్కువ స్కోర్ ఉంటే తక్కువ రిస్కీ లోన్ దరఖాస్తుదారుగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారి అనంతరం బ్యాంకులు అసురక్షిత రుణాలకు సంబంధించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఇందుకు అనుగుణంగా నిబంధనలు మార్చుకుంటున్నాయి. అసురక్షిత రుణాలతో పాటు క్రెడిట్ కార్డులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఇవి చాలా కీలకం

ఇవి చాలా కీలకం

క్రెడిట్ కార్డు దరఖాస్తుదారు సిబిల్ స్కోర్ వంటి ప్రాథమిక పరీక్షలో నెగ్గిన తర్వాతనే క్రెడిట్ కార్డును మంజూరు చేసేలా నిబంధనలు కఠినతరం చేసినట్లు ప్రయివేటురంగ బ్యాంకు నిపుణులు చెబుతున్నారు. రిస్క్‌ను అంచనా వేయడానికి క్రెడిట్ స్కోర్ ప్రధాన అంశమని చెబుతున్నారు.

తాము తమ క్రెడిట్ స్కోర్ రిక్వైర్‌మెంట్‌ను పెంచామని, ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కస్టమర్లను మాత్రమే క్రెడిట్ కార్డుకు దాఖలు చేసుకోవాలని సూచిస్తున్నామని, అదే సమయంలో ఉద్యోగం చేస్తున్న పరిశ్రమపై కూడా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

పెరుగుతున్న ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్

పెరుగుతున్న ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్

కరోనా అనంతరం క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం నగదు ట్రాన్సాక్షన్స్ కంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. దీంతో వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డు వినియోగం పెరిగింది. అలాగే, షాపింగ్ మాల్స్, ఈ కామర్స్, బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ మీద వివిధ ఆఫర్లు ఇస్తున్నాయి.

దీంతో అవసరం లేకపోయినప్పటికీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఆ తర్వాత రుణాలు చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇది బ్యాంకులకు నష్టం కలిగిస్తోంది. దీంతో బ్యాంకులు క్రెడిట్ కార్డు జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి.

English summary

క్రెడిట్ స్కోర్ కావాల్సిందే: క్రెడిట్ కార్డు అంత ఈజీ కాదు, నిబంధనలు కఠినమే | Getting new credit cards becomes tougher as banks tighten norms

Banks have started demanding high credit scores as they begin to tighten risk assessments of potential credit card customers amid rising delinquencies in large chunks of unsecured loan portfolios.
Story first published: Wednesday, March 17, 2021, 14:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X