For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali picks: ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తే అదిరిపోయే రిటర్న్స్!

|

శుభప్రదంగా భావించే దీపావళి పండుగ మరో వారం రోజులు మాత్రమే ఉంది. చాలామంది ఈ పర్వదినం రోజున చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దసరా, దీపావళి పండుగ సమయాల్లో పనులు ప్రారంభిస్తారు. దీపావళి సమయంలో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సమయంలో కొనుగోలు చేయడానికి వివిధ సంస్థలు పలు స్టాక్స్‌ను రికమెండ్ చేస్తుంటాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ GEPL క్యాపిటల్ నాలుగు స్టాక్స్‌ను రికమెండ్ చేస్తోంది. దీపావళి సందర్భంగా టాప్ 4 పిక్స్ అంటూ టెక్స్‌టైల్, PSU బ్యాంకు, మెటల్, పవర్ ఇండస్ట్రీస్ రంగాలకు చెందిన వాటిని కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. టెక్స్‌టైల్ నుండి కేపీఆర్ మిల్, బ్యాంకింగ్ నుండి కెనరా బ్యాంకు, మెటల్ నుండి నేషనల్ అల్యూమినియం కంపెనీ(Nalco), విద్యుత్ రంగం నుండి ఎన్టీపీసీని సజెస్ట్ చేస్తోంది.

కెనరా బ్యాంకు

కెనరా బ్యాంకు

అధిక క్రెడిట్ ఖర్చుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా కెనరా బ్యాంకు ఆదాయాల ప్రొఫైల్ పైన ప్రభావం కనిపిస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి కూడా అలాగే ఉంది. అన్-డిమాండ్ వ్యాల్యుయేషన్, అసెట్ క్వాలిటీ మెరుగు కావడం, ఆరోగ్యకరమైన రికవరీ అంచనాలు.. కెనరా బ్యాంకుకు సానుకూలమని బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం కెనరా బ్యాంకు షేర్ ధర రూ.201 వద్ద ఉంది. జీఈపీఎల్ క్యాపిటల్ ఈ టార్గెట్ ధరను రూ.237గా పేర్కొంది.

KPR మిల్స్

KPR మిల్స్

వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని KPR మిల్స్ తన గార్మెంట్స్, సుగర్ ఆధారిత ఎథనాల్ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం కేపీఆర్ మిల్స్ షేర్ ధర రూ.460 వద్ద ఉంది. GEPL క్యాపిటల్ బ్రోకరేజీ సంస్థ ఈ కంపెనీ టార్గెట్ ధరను రూ.570కి పెంచింది.

నాల్కో

నాల్కో

నాల్గో షేర్ ధర ప్రస్తుతం రూ.106కు పైన ఉంది. గత వారం రోజుల్లో ఈ షేర్ క్షీణించినప్పటికీ, ఆరు నెలలు, ఏడాది ప్రాతిపదికన పెరిగింది. బొగ్గును అందించేందుకు, దీనికి మహానధి కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌తో ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్‌ను కలిగి ఉంది. దాని అవసరాలలో 85 శాతం అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలో అల్యుమినాను ఉత్పత్తి చేసే సంస్థల్లో నాల్కో కూడా నిలిచిందని జీఈపీఎల్ పేర్కొంది. ఈ షేర్ టార్గెట్ ధర రూ.165.

 NTPC లిమిటెడ్

NTPC లిమిటెడ్

ఎన్టీపీసీ లిమిటెడ్ పవర్ జనరేషన్ కంపెనీ. 2032 నాటికి 130 GW+ కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 60 GW రెన్యువబుల్ ఎనర్జీ. బ్రోకరేజీ సంస్థ ఎన్టీపీసీ టార్గెట్ ధర రూ.200.

English summary

Diwali picks: ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తే అదిరిపోయే రిటర్న్స్! | GEPL Capital recommended these stocks to buy on this Diwali

Brokerage firm GEPL Capital has recommended these stocks to buy as part of its Diwali top picks. The stock recommendations are textile, PSU bank, metals and power industries.
Story first published: Wednesday, October 27, 2021, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X