For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Credit Cards: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు, ఈ కార్డ్స్ తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్

|

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.110 దాటింది. లీటర్ డీజిల్ రూ.103 క్రాస్ చేసింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ రూ.100కు పైనే ఉంది. డీజిల్ కూడా రూ.100 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొద్ది రోజుల్లోనే 80 డాలర్ల పైకి చేరుకున్నాయి. కరోనా సమయంలో డిమాండ్ లేమి కారణంగా ధరలు భారీగా క్షీణించాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీతో చమురు డిమాండ్ పుంజుకుంటోంది. అదే సమయంలో చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతను మరికొద్దిరోజులు కొనసాగించాలని నిర్ణయించాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర మూడేళ్ల గరిష్టం 85 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 82 డాలర్లను తాకింది. అక్కడ ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ రూ.100 దాటాయి. ఇలాంటి సమయంలో ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ వినియోగం ద్వారా కొంత మొత్తంలో సేవింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.

ఫ్యూయల్ కార్డ్ ప్రయోజనకరం

ఫ్యూయల్ కార్డ్ ప్రయోజనకరం

ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో అనేక క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ కొత్త కస్టమర్లకు రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. వీటి ద్వారా కస్టమర్లను అధిక బ్యాంకింగ్ చేసేలా చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుతున్న సమయంలో ఇంధన కొనుగోళ్లపై మరిన్ని క్రెడిట్ కార్డు ఆఫర్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. బీపీసీఎల్, హెచ్‌పీ వంటి ఇంధన కంపెనీలతో కలిసి కార్డు కంపెనీలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి. ఈ వారమే ఎస్బీఐ కార్డు.... భారత్ పెట్రోలియంతో కలిసి రూపే కాంటాక్ట్‌లెస్ కార్డును ప్రారంభించింది. ఎస్బీఐ-బీపీసీఎల్ ద్వారా ఈ కో-బ్రాండెడ్ కార్డు వచ్చింది. ఈ రూపే కార్డు ద్వారా ఇంధనంపై చేసే ప్రతి రూ.100 ఖర్చు పైన 13X రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇది భారత్ పెట్రోలియం పంప్స్ వద్ద వర్తిస్తుంది. అంతేకాదు, ప్రతి రూ.4000 ట్రాన్సాక్షన్ పైన 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది.

మీరు పెట్రోల్ బంక్స్ వద్ద క్రెడిట్ కార్డ్స్ ఏజెంట్స్‌ను చూస్తూ ఉంటారు. వారు పెద్ద పెద్ద హామీలు ఉంటాయని చెబుతుంటారు. అయితే ఏ కార్డు తీసుకోవడానికి ముందు అయినా మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

ఫ్యూయల్ కార్డ్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాహనాలను ఎక్కువగా ఉపయోగించే వారు దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కొంతమొత్తం డబ్బును ఆదా చేయవచ్చు. ఈ కార్డు హోల్డర్లు ఎంత ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేస్తే అంత ఎక్కువ రివార్డ్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ పొందుతారు. అయితే క్రెడిట్ కార్డ్ సంస్థలు చమురు కంపెనీలతో కలిసి పనిచేస్తాయి. బహుమతులు లేదా రీఫండ్స్‌కు సంబంధించి అన్-లాక్ చేయడానికి షరతులు కూడా విధిస్తాయి. మీ రోజువారీ లేదా నెలవారీ ఇంధన వ్యయం ఎక్కువగా ఉంటే ఇంధన కార్డ్స్ బహుమతులు ఉంటాయి.

వీటిని పరిగణలోకి తీసుకోవాలి

వీటిని పరిగణలోకి తీసుకోవాలి

ఫ్యూయల్ కార్డును కొనుగోలు చేసేముందు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. జాయినింగ్ ధర, కార్డు యొక్క కాస్ట్, యాన్యువల్ ఫీజు వంటి వాటిని చూసుకోవాలి. సాధారణంగా క్రెడిట్ కార్డు కంపెనీలు వార్షిక వ్యయ పరిమితులను నిర్ణయిస్తాయి. ఆ బార్ దాటితే వార్షిక రుసుము రద్దు చేస్తారు కూడా. అయితే ఆ మార్కును (ఖర్చులో) చేరడంలో విఫలమైతే మీరు ఈ ఛార్జీని చెల్లించవలసి ఉంటుంది. మీరు చేయాలనుకున్న మొత్తం పొదుపుపై ప్రభావం చూపుతుంది.

పెట్రోల్ బంక్స్ జాబితా

పెట్రోల్ బంక్స్ జాబితా

మీరు కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డును వినియోగిస్తే కనుక ఎంపిక చేసిన పెట్రోల్ స్టేషన్‌లలోనే రివార్డ్ పాయింట్స్ పొందుతారు. కాబట్టి ఫ్యూయల్ కార్డు కోసం దరఖాస్తు చేసేముందు పెట్రోల్ పంప్స్‌కు సంబంధించిన జాబితాను చదవాలి. మీరు ఎక్కడ ఎక్కువగా వినియోగిస్తారో ఆ పెట్రోల్ బంక్ ఉందో లేదో తెలుసుకోవాలి.

మీ ఖర్చు అలవాట్లకు సరిపోయే ఇంధన కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ పైన రివార్డ్ పాయింట్స్‌ను నిర్దిష్ట ఔట్ లెట్స్‌లో ఇంధన ఖర్చులకు వ్యతిరేకంగా రీడీమ్ చేయవచ్చు. అయితే రివార్డ్ పాయింట్స్‌ను గిఫ్ట్ వోచర్‌గా కూడా రీడీమ్ చేయవచ్చు.

అలాగే, వివిధ కోబ్రాండ్ కార్డ్స్ ఛార్జీలను సరిపోల్చుకోవాలి. ఏది బెస్ట్ అయితే దానిని ఎంచుకోవాలి.

English summary

Fuel Credit Cards: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు, ఈ కార్డ్స్ తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ | Fuel Credit Cards can help save big with discounts as Petrol at record high

Fuel prices are skyrocketing and a number of credit card companies are trying to bank on this opportunity by offering reward points, discounts, and cash backs to potential new customers.
Story first published: Monday, October 18, 2021, 19:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X