మహిళలకు ESFB బంపరాఫర్, సేవింగ్ అకౌంట్స్‌పై 7% వడ్డీ
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు(ESFB) మహిళల కోసం ఈవా పేరుతో ప్రత్యేక పొదుపు ఖాతాను ప్రవేశపెట్టింది. దీనిపై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఉచిత హెల్త్ చెకప్, టెలి కన్సల్టెన్సీ ద్వారా గైనకాలజిస్టులు, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించే అవకాశాలు కల్పించింది. మహిళలు తీసుకునే బంగారం రుణాలపై రాయితీ, లాకర్ సదుపాయంపై 25 శాతం నుండి 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
ఈవా సేవింగ్ అకౌంట్ అందరు మహిళలు ఓపెన్ చేయవచ్చు. శాలరీ వచ్చే మహిళలు, హోమ్ మేకర్స్, బిజినెస్ వుమెన్, సీనియర్ సిటిజన్లు, నాన్-రెసిడెంట్ ఉమెన్ ఎవరైనా అకౌంట్ తీసుకోవచ్చు. నాన్-మెయింటెన్స్ ఫీజు ఉండదు. కాగా, ఈ కంపెనీ ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మందానను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

వివిధ బ్యాంకులు మహిళలు, వృద్ధులకు డిపాజిట్లు, లోన్ల పైన వివిధ రకాల అదనపు ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఉదాహరణకు సేవింగ్ డిపాజిట్లపై సాధారణంగా వడ్డీ రేటు 7 శాతంగా ఉంటే మహిళలకు, వృద్ధులకు 10 నుండి 15 బేసిస్ పాయింట్లు తగ్గింపు ఇస్తుంటాయి.