For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Currency Vs Gold: ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?

|

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీని బంగారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా క్రిప్టోపై ఇన్వెస్ట్ చేసినవారు మార్కెట్ ఊగిసలాట కారణంగా నష్టపోయి ఉండవచ్చు. కానీ మొత్తానికి క్రిప్టో మాత్రం పరుగు పెడుతోంది. కరోనాకు ముందు 5వేల డాలర్ల దిగువన ఉన్న క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఇటీవలే ఆల్ టైమ్ గరిష్టం 69,000 సమీపానికి వచ్చింది. కొద్ది నెలల క్రితం వరకు 2000 దిగువన కనిపించిన రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా 4,000 డాలర్లు దాటి 5,000 డాలర్ల దిశగా కనిపిస్తోంది. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కరోనా కాలంలో భారీగా లాభపడింది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత పతనమైనప్పటికీ, మళ్లీ కోలుకుంది. బంగారాన్ని ఇప్పటికీ సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. క్రిప్టో పైన వివిధ దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. బంగారం క్షీణతకు పలు కారణాలు ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తోంది. దీర్ఘకాలానికి, స్వల్పకాలానికి బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా లేక క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్న పెట్టుబడిదారుల్లో ఉంటుంది. అలాంటి వారి కోసం...

బంగారానికి ప్రత్యామ్నాయం

బంగారానికి ప్రత్యామ్నాయం

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ డిజిటల్ ఆస్తి. ప్రస్తుతం దీనిని బంగారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే అది మార్కెట్ ఆధారంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. బంగారాన్ని ఆభరణంగా వినియోగస్తే దాని వ్యాల్యూ కొంత తగ్గుతుంది. బంగారం మైనింగ్ 2050 నాటికి పూర్తిగా అయిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నుండి స్వతంత్రంగా ఉన్న పెట్టుబడి ఆస్తులు క్రిప్టో, బంగారం అని నిపుణుల మాట. డిజిటల్ అసెట్స్, బంగారం అస్థిరంగా ఉండవచ్చు. ఈ రెండు కూడా ద్రవ్య విలువను నిలుపుకోగలవు. డిమాండ్, సరఫరా ఆధారంగా ఈ రెండు ఆశ్తుల ధరలు పెరుగుతాయి.

రిటర్న్స్

రిటర్న్స్

పెట్టుబడిదారులు బిట్ కాయిన్‌ను డిజిటల్ బంగారంగా, ద్రవ్యోల్భణానికి వ్యతిరేక హెడ్జ్‌గా చూస్తారు. ప్రస్తుత ద్రవ్యోల్భణం రేటును అధిక పనితీరుతో మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చు. అయితే బంగారం కరోనాకు ముందు నెమ్మదిగా లాభపడినా, కరోనా తర్వాత స్వల్పకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చినా, ఆ తర్వాత మాత్రం నెమ్మదించింది.

బిట్ కాయిన్ వర్సెస్ బంగారం

బిట్ కాయిన్ వర్సెస్ బంగారం

- బిట్ కాయిన్ చాలా అరుదైన ఉత్పత్తి. ఇష్టానుసారంగా సృష్టించలేరు. ఇవి కేవలం 21 మిలియన్లు మాత్రమే ఉన్నాయి. ఇతరులు ఎవరు కూడా మరిన్ని సృష్టించలేరు. ఏ ప్రభుత్వం దీనిని తయారు చేయలేదు. అలాగే బంగారాన్ని కూడా మరింత సృష్టించడం సాధ్యం కాదు. బంగారాన్ని వెతకడానికి మీకు ఎంత వెచ్చిస్తున్నారనే అంశంపై ఆధారపడి దీని ఉత్పత్తి ఉంటుంది.

- బంగారం, బిట్ కాయిన్ రెండూ మన్నకైనవే. ఇంటర్నేట్ ఉన్నంత కాలం బిట్ కాయిన్ వినియోగంలో ఉంటుంది. గుర్తించగలిగినంత కాలం బంగారం ఉంటుంది.

- బిట్ కాయిన్‌ను ఇండివిడ్యువల్ సాటోషిస్‌గా విభజించవచ్చు. 100,000,000 కలిస్తే ఒక బిట్ కాయిన్. కానీ బంగారాన్ని అంత ఈజీగా, కచ్చితత్వంతో విభజించలేం. చిన్న డినామినేషన్లలో చూడవచ్చు.

- బంగారం, బిట్ కాయిన్ నకిలీ కష్టం. బిట్ కాయిన్ గుర్తింపు సులభం. నకిలీ చాలా కష్టం. బంగారాన్ని కూడా గుర్తించవచ్చు. కానీ స్వచ్చత అయితే పరీక్షీంచవలసి ఉంటుంది.

English summary

Crypto Currency Vs Gold: ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? | Crypto Currency Vs Gold: Which is A Better Investment?

Bitcoin is a limited digital asset, as after the 21 million are mined (predicted to be in 2140), there will never be more Bitcoin released. This makes it similar to gold in terms of scarcity.
Story first published: Saturday, November 20, 2021, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X