For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారానికి బిట్ కాయిన్ చెక్: 50% పసిడి మార్కెట్‌ను ఆక్రమిస్తుందా?

|

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ మార్కెట్ వాటాను భారీగా పెంచుకుంటుందని, ఇప్పటికే బంగారానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ మున్ముందు బంగారం మార్కెట్ నుండి వాటాను తీసుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్ భవిష్యత్తులో 1,00,000 డాలర్లకు చేరుకోవచ్చునని పేర్కొంది. బిట్ కాయిన్ ఫ్లోట్ అడ్జెస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 700 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. స్టోర్ ఆఫ్ మార్కెట్ వ్యాల్యూలో.. దీనిని బంగారంతో పోలిస్తే 20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండవచ్చునని పేర్కొంది. పెట్టుబడికి అందుబాటులో ఉన్న బంగారం వ్యాల్యూ 2.6 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

50 శాతానికి చేరుకుంటే

50 శాతానికి చేరుకుంటే

స్టోర్ ఆఫ్ వ్యాల్యూ మార్కెట్‌లో బిట్ కాయిన్ వచ్చే అయిదేళ్ల కాలంలో యాభై శాతానికి పెరిగితే, అప్పుడు ఈ క్రిప్టో ధర లక్ష డాలర్లకు చేరుకోవచ్చునని, అప్పుడు ఏడాదికి 17 శాతం నుండి 18 శాతం రాబడి ఉంటుందని గ్లోబల్ ఎఫ్ఎక్స్ అండ్ ఈఎం స్ట్రాటెజీ కో-హెడ్ జాక్ పాండిల్ అన్నారు.

ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో బిట్ కాయిన్ 46,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఏడాది బిట్ కాయిన్ 60 శాతం ఎగిసిపడింది. మార్కెట్ వ్యాల్యూ పరంగా అతిపెద్ద డిజిటల్ అసెట్. 2021 నవంబర్ నెలలో ఇది దాదాపు 69,000 మార్కుకు చేరువైంది. 2016 నుండి చూస్తే బిట్ కాయిన్ 4700 శాతం లాభపడింది.

డిజిటల్ గోల్డ్.. బిట్ కాయిన్

డిజిటల్ గోల్డ్.. బిట్ కాయిన్

బిట్ కాయిన్ నెట్ వర్క్ వాస్తవ వనరుల వినియోగం సంస్థాగత స్వీకరణకు అడ్డంకి అయినప్పటికీ, ఇది ఈ క్రిప్టో డిమాండ్‌కు అడ్డు కాబోదని పేర్కొంటున్నారు. బిట్ కాయిన్‌ను చాలా కాలంగా డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటున్నారు.

డిజిటల్ కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత నవంబర్ నెలలో 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పుడు బిట్ కాయిన్ 69,000 డాలర్ల సమీపంలో ఉంది. అయితే ఇప్పుడు 50,000 దిగువనే ఉంది.

నేడు క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

నేడు క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ నేడు 2 శాతం లేదా 9347 డాలర్లు లాభపడి 46,749 వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్‌తో పాటు ఎథేరియం, బియాన్స్ కాయిన్ ఇతర క్రిప్టోలు కూడా పరుగు తీశాయి. ఉదయం పదింట ఆరు క్రిప్టోలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. డిజిటల్ టోకెన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.23 ట్రిలియన్ డాలర్లుగా నిలిచింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 17 శాతానికి పైగా పెరిగి 103.41 బిలియన్ డాలర్లుగా ఉంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్, సోలానా, కార్డానో, ఎక్స్‌పీఆర్ లాభపడ్డాయి. ఎథేరియం రెండు శాతానికి పైగా ఎగిసింది. టెథేర్, యూఎస్డీ కాయిన్ స్థిరగా ఉండగా, టెర్రా,2 శాతం, పోల్కాడాట్ 1 శాతానికి పైగా నష్టపోయింది.

English summary

బంగారానికి బిట్ కాయిన్ చెక్: 50% పసిడి మార్కెట్‌ను ఆక్రమిస్తుందా? | Bitcoin may hit $100,000 by snatching market share from gold, says Goldman

Bitcoin may hit $100,000 by snatching market share from gold, says Goldman
Story first published: Wednesday, January 5, 2022, 22:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X