For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారానికి ప్రత్యామ్నాయం: ఏడాదిలో బిట్ కాయిన్ ఎంత జంప్ చేసిందంటే?

|

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ చాలామంది గ్లోబల్ ఇన్వెస్టర్లకు మరో బంగారంగా మారింది. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ భారీగా జంప్ చేసింది. బిట్ కాయిన్ ఎగిసిపడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో దీని సరఫరా పరిమితం కావడం కూడా గమనార్హం. అలాగే, బిట్ కాయిన్ నియంత్రణకు ఏమీ లేనందున వికేంద్రీకరించబడింది.

గురువారం నాటి ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ 40వేల డాలర్లను తాకగా, శుక్రవారం 41,970 డాలర్లను క్రాస్ చేసింది. ఐదు ట్రేడింగ్‌లలో 10 వేల డాలర్లకు పైగా ఎగిసి 40 శాతం వరకు లాభపడింది. ఇక గత ఏడాది మార్చి రెండో వారం కనిష్టంతో పోలిస్తే 700 శాతం లాభపడింది. సంస్థాగత, కార్పోరేట్ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల నుండి డిమాండ్ పెరగడం దోహదపడింది.

ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్

పసిడికి ప్రత్యామ్నాయ పెట్టుబడిగా

పసిడికి ప్రత్యామ్నాయ పెట్టుబడిగా

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే బిట్ కాయిన్... బంగారాన్ని మరిపిస్తోంది. దీర్ఘకాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 1.46 లక్షల డాలర్లకు చేరుకునే సామర్థ్యం కలిగి ఉందని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. భారీగా ఎగుస్తున్న బిట్ కాయిన్ అనిశ్చితికి గురై సమీప భవిష్యత్తులో పడిపోయినప్పటికీ, దీర్ఘకాలంలో పసిడికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని, పెట్టుబడి మార్గంగా చాలామంది భావిస్తున్నారు.

బిట్ కాయిన్ పతనం... జంప్

బిట్ కాయిన్ పతనం... జంప్

చ‌లామ‌ణిలో ఉన్న మొత్తం బిట్ కాయిన్ నాణాల ధ‌ర మొత్తం 575 బిలియ‌న్ డాల‌ర్ల‌ కంటే పైకి చేరుకుంది. ఇది ముందు ముందు 2.7 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ప్రయివేట్ ప‌సిడి పెట్టుబ‌డుల‌కు 4.6 రెట్లు పెరుగుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిన బిట్ కాయిన్ గతవారం ప్రారంభంలో 20 శాతం వరకు పతనమైంది. గత ఏడాది కాలంలో ఇదే దారుణ పతనం. అయితే మళ్లీ పుంజుకొని, 40వేల డాలర్లను దాటింది.

మరోసారి సర్దుబాటు

మరోసారి సర్దుబాటు

వేగంగా దూసుకుపోతోన్న బిట్ కాయిన్ ఏడాది కాలంలో ఇప్పటికే గతవారం ఓసారి సర్దుబాటుకు గురయింది. మరోసారి కూడా సర్దుబాటుకు గురి కావొచ్చునని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది మార్చికి ముందు బిట్ కాయిన్ వ్యాల్యూ 5000 డాలర్లుగా ఉన్నప్పటికీ, కరోనా కారణంగా ఏడాదిలో 41వేల డాలర్లు దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి సర్దుబాటుకు గురి కావొచ్చునని భావిస్తున్నారు.

English summary

బంగారానికి ప్రత్యామ్నాయం: ఏడాదిలో బిట్ కాయిన్ ఎంత జంప్ చేసిందంటే? | Bitcoin emerging as the new Gold for investors

Bitcoin is the new gold for many investors. Bitcoin is doing well because its supply is limited.
Story first published: Sunday, January 10, 2021, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X