For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి తక్కువ కాలంలోనే క్రిప్టోకరెన్సీ వీరిని కుబేరులను చేసింది

|

2020 మార్చి 11వ తేదీన ఒకేరోజు 40 శాతం క్షీణించి 5000 డాలర్ల వద్ద ఉన్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆ తర్వాత కరోనా కాలంలో భారీగా ఎగిసింది. ఏడాది క్రితం 5వేల డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ ఇప్పుడు 55వేల డాలర్లకు పైగా ఉంది. ఓమార్చి 13, 2021న ఇది ఏకంగా 61,711.87 డాలర్ల వద్ద కూడా ట్రేడ్ అయింది. కరోనా నేపథ్యంలో బంగారంతో పాటు బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలకు కూడా డిమాండ్ పెరిగింది. క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ పెరగడంతో ఈ కాలంలో దీనిని కొనుగోలు చేసిన కొంతమంది కుబేరులు కూడా అయ్యారు.

12 మంది క్రిప్టో బిలియనీర్లు

12 మంది క్రిప్టో బిలియనీర్లు

12 మంది క్రిప్టోకరెన్సీ బిలియనీర్లు ఫోర్బ్స్ 35వ యాన్యువల్ వరల్డ్ బిలియనీర్ జాబితాలోకి చేరారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య నాలుగు మాత్రమే. ప్రపంచ కుబేరులు 2755కు పెరిగారు. ఏడాది క్రితం కంటే ఇది చాలా ఎక్కువ. వీరి సంపద 13.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2020లో వీరి సంపద 8 ట్రిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. ప్రపంచ కుబేరుల్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో నిలిచారు. గత ఏడాది 31వ స్థానంలో ఉన్న టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ మార్క్ జుకర్‌బర్గ్ టాప్ 5లో నిలిచారు.

టాప్ 5లో వీరే..

టాప్ 5లో వీరే..

రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి వారెన్ బఫెట్ టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ 84.5 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు. చైనాకు చెందిన జాక్ మా సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగి 48.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 26వ స్థానంలో నిలిచారు. మార్చి 5 నాటి షేర్ల ధరలు, ఎక్స్ఛేంజీ రేట్ల ఆధారంగా బిలియనీర్ల సంపదను లెక్కగట్టింది ఫోర్బ్స్. ఈ ఏడాది కొత్తగా 493 మంది జాబితాలో చేరారు.

క్రిప్టో బిలియనీర్లు

క్రిప్టో బిలియనీర్లు

ఇక, క్రిప్టో బిలియనీర్ల విషయానికి వస్తే పోర్బ్స్ మూడు గ్రూప్‌లుగా ఇన్వెస్టర్స్, బిల్డర్స్, ఇష్యూయర్స్‌ను పేర్కొంది. ఇన్వెస్టర్లలో వింకెల్వాస్ ట్విన్స్ (టైలర్ అండ్ కామెరోన్ వింకెల్వాస్), మైక్రోస్ట్రాటెజీ కో-ఫౌండర్, సీఈవో మైఖేల్ సేలర్ ఉన్నారు. వీరు బిట్ కాయిన్‌లో ప్రారంభంలోనే పెట్టుబడులు పెట్టారు. 2012 నుండి వీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి నెట్ వర్త్ ఇప్పుడు 3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇతరుల విషయానికి వస్తే బ్లోక్ చైర్మన్ మాథ్యూ రోజక్ (1.5 బిలియన్ డాలర్లు), సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ డ్రాపెర్, (18.7 బిలియన్ డాలర్లు) తదితరులు ఉన్నారు.

English summary

అతి తక్కువ కాలంలోనే క్రిప్టోకరెన్సీ వీరిని కుబేరులను చేసింది | Bitcoin boom minted nine new cryptocurrency billionaires in one year

From the 40% plunge in a day to below $5,000 on 11 March 2020, Bitcoin has come a long way to hit its all-time high of $61,711.87 on 13 March this year. The breakneck rally over the past year has rewarded cryptocurrency believers and minted nine new crypto billionaires.
Story first published: Wednesday, April 7, 2021, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X