For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయపు పన్ను ఆదా కోసం బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ఇది

|

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయ పెట్టుబడుల కోసం మీకు మరో మూడు నెలల సమయం కూడా లేదు. మీరు మార్చి 31వ తేదీ లోపు మీ పన్ను-పొదుపు పెట్టుబడులను ఖరారు చేయాలి. ఈ పన్నులను ఆదా చేయడానికి మీరు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)ని పరిగణలోకి తీసుకోవచ్చు. పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ELSS)కు ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. ELSSలో మీరు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ELSSsలు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్‌లు రిస్క్‌తో కూడుకున్నవి. ప్రత్యేకించి మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి.

ఇదీ ఈఎల్ఎస్ఎస్..

ఇదీ ఈఎల్ఎస్ఎస్..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ హామీ రాబడిని అందిస్తాయి. కానీ ఈఎల్ఎస్ఎస్‌లు గ్యారెంటీ రిటర్న్స్ ఇవ్వవు.

మరి ELSSsలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

ఒకటి... గ్యారెంటీ రిటర్న్స్ లేకపోయినప్పటికీ అధిక రాబడిని అందించే విధంగా కూడా ఉంటాయి. ఇవి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు ELSS కేటగిరీ గత పదేళ్లలో సగటున 16 శాతం రిటర్న్స్ అందించింది. అలా అని కచ్చితంగా అందించాలని లేదు. ఇవి రిస్క్‌తో కూడుకున్నవి.

రెండు.. ELSSలు అతి తక్కువ లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. 80సీ పన్ను మినహాయింపు బాస్కెట్‌లో ఎక్కువగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ దీర్ఘకాలిక పెట్టుబడులు. ఉదాహరణకు పీపీఎఫ్ పదిహేనేళ్లు. పాక్షిక ఉపసంహరణకు కనీసం ఆరేళ్లు వేచి చూడాలి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అయిదేళ్లు. ELSS అయితే మూడేళ్లు. కానీ ఈ మూడేళ్లలో కచ్చితంగా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయని భావించవద్దు.

మూడోది... ELSS చాలామంది ఇన్వెస్టర్లకు గొప్ప మెట్టు. అవి తరుచు ELSSతో ప్రారంభమవుతాయి. మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ కారణంగా మార్కెట్ అస్థిరత సమయంలో ఉద్వేగాన్ని ఎదుర్కొనేలా సాయపడుతుంది.

కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చూడండి...

కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చూడండి...

యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్

కెనరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ ఫండ్

మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్

ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ ఫండ్

డీఎస్పీ ట్యాక్స్ సేవర్ ఫండ్

వీటిని పరిగణలోకి తీసుకోవాలి

వీటిని పరిగణలోకి తీసుకోవాలి

స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల మేనేజర్లు దీర్ఘకాలిక దృష్టితో రంగాలను, షేర్లను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్లు పన్ను మినహాయింపు కోసం తక్కువ వ్యవధితో ఉన్న పథకాలు కావాలంటే ఇది మంచి మార్గం. మూడేళ్ల తర్వాత పెట్టుబడులు కొనసాగించవచ్చు లేదా వెనక్కి తీసుకోవచ్చు.

English summary

ఆదాయపు పన్ను ఆదా కోసం బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ఇది | Best tax saving mutual funds or ELSS to invest in 2022

You hardly have three months to finalise your tax-saving investments for this financial year. You need to finalise your tax-saving investments by March 31. If you are still shopping, you should check out an Equity Linked Saving Scheme ELSS) to save taxes this year.
Story first published: Sunday, January 23, 2022, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X