For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకుంటున్నారా? మరి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ తెలుసుకోండి

|

చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లోని వారికి ఉండే ప్రధాన కల సొంతిల్లు. కనీస మొత్తం చేతిలో ఉంటే హోమ్ లోన్ తీసుకోవడం ఎంతోమంది చేసే పని. ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువ ఉంది, ఎక్కడ ఎంత కాలపరిమితి ఉంది, ఏ బ్యాంకులో ఈఎంఐ ఎలా ఉంది... వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హోమ్ లోన్ తీసుకుంటారు. వీటితో పాటు పన్నుప్రయోజనలు కూడా చూస్తారు. మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. హోమ్ లోన్‌కు సంబంధించిన వివిధ పన్నుప్రయోజనాలు తెలుసుకుందాం.

హోమ్ లోన్ తీసుకునే వారికి వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. సెక్షన్ 80సీ, సెక్షన్ 24, సెక్షన్ 80ఈఈఏ వంటి పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సెక్షన్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. రూ.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

సెక్షన్ 80సీ

సెక్షన్ 80సీ

మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంటుంది. ఈ పన్ను ప్రయోజనం రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. ఈ పన్ను ప్రయోజనాన్ని హోమ్ లోన్ స్టాంప్ డ్యూటీతో పాటు హోమ్ లోన్ ప్రిన్సిపల్ కేటగిరీ కింద క్లెయిమ్ చేయవచ్చు. పన్ను ప్రయోజనానికి సంబంధించిన ఈ క్లెయిమ్‌కు కొన్ని షరతులు ఉన్నాయి. ఎందుకంటే హోమ్ లోన్ పొందిన వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకున్న తేదీ నుండి అయిదేళ్ల పాటు కలిగి ఉండాలి.

సెక్షన్ 24

సెక్షన్ 24

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం హోమ్ కొనుగోలుదారులకు పన్ను మినహాయింపు రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఈ మినహాయింపు హోమ్ లోన్ వడ్డీ కేటగిరీ కింద ఉంటుంది. ఏదేమైనా అలాంటి మినహాయింపుపై ఒక కండిషన్ ఉంది. అది కుటుంబ సభ్యుడు లేదా పన్ను చెల్లింపుదారుడు కూడా రుణం తీసుకున్న ఆస్తిలో తప్పనిసరిగా నివసిస్తుండాలి.

సెక్షన్ 80ఈఈఏ

సెక్షన్ 80ఈఈఏ

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80ఈఈఓ కింద కూడా హోమ్ లోన్ పైన రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. అయితే ఇక్కడ ఓ షరతు ఉంది. ఆస్తి స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ, నివాసంలో ఉండటం, రూ.45 లక్షల వరకు ఉండటం. అలాగే, ఆమోదం కోసం గడువు ఏప్రిల్ 1, 2019 నుండి మార్చి 31, 2022.

ఇక్కడ మరిన్ని షరతులు గుర్తుంచుకోవాలి.

అప్పుగా తీసుకున్న రుణం తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ సమకూర్చాలి.

సెక్షన్ 80ఈఈ కింద మాత్రం క్లెయిమ్ చేసుకోరాదు.

రుణం మంజూరు అయ్యే వరకు అసెసీ పేరిట ఎలాంటి నివాస ఆస్తి ఉండకూడదు.

స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ రూ.45 లక్షల వరకే ఉండాలి.

హోమ్ లోన్ తీసుకుంటే ఇవి గుర్తుంచుకోండి

హోమ్ లోన్ తీసుకుంటే ఇవి గుర్తుంచుకోండి

హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంకు, వడ్డీ రేటు, కాలపరిమితి సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. హోమ్ లోన్ తీసుకుంటే పది శాతం నుండి పదిహేను శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలి. ప్రాపర్టీ వ్యాల్యూ రూ.50 లక్షలుగా ఉంటే చేతిలో కార్పస్ అందులో పదిహేను శాతం అంతకంటే ఎక్కువే ఉండాలి. కరోనా కారణంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంటి కొనుగోలుకు ఇది మంచి సమయమని చెబుతున్నారు.

English summary

హోమ్ లోన్ తీసుకుంటున్నారా? మరి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ తెలుసుకోండి | Be aware of these tax benefits before Buying a new house on loan

The queries of home buyers are common and all are related to the tax benefits associated with a home loan.
Story first published: Sunday, September 12, 2021, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X