For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోవిడ్ 19 లోన్, రూ.5 లక్షల వరకు... వివిధ బ్యాంకులు అందిస్తున్న లోన్

|

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపై పడింది. లక్షలాది రూపాయలు ఆసుపత్రి కోసం ఖర్చు చేయవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోవిడ్ రిలీఫ్ మెజర్స్‌ను ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన వారికి బ్యాంకులు స్పెషల్ పర్సనల్ లోన్ స్కీం అందించే వెసులుబాటును కల్పించింది. రీపేమెంట్ నిబంధనలు కూడా కస్టమర్లకు అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలంలో ఏర్పడిన ఈ ఇబ్బందిని ఎదుర్కోవడానికి కోవిడ్-19 స్పెషల్ పర్సనల్ లోన్ స్కీంను ఎంచుకోవచ్చా... అంటే?

ఈ స్కీం నిబంధనలు

ఈ స్కీం నిబంధనలు

కరోనా సంబంధ చికిత్స కోసం ఈ ప్రత్యేక పర్సనల్ లోన్ అందుబాటులో ఉంటుంది. కోవిడ్ - 19 పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో రుణగ్రహీత ఈ నిధులు ట్రీట్మెంట్ ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాలి. ట్రీట్మెంట్ కోసం లోన్ తీసుకుంటే కస్టమర్ నుండి బ్యాంకులు కరోనా పాజిటివ్ నివేదికను కోరుతాయి. కోవిడ్ -19 ట్రీట్మెంట్ పర్సనల్ లోన్స్ నిబంధనలు బ్యాంకును బట్టి మారే అవకాశముంది.

కోవిడ్ 19 పర్సనల్ లోన్

కోవిడ్ 19 పర్సనల్ లోన్

కోవిడ్ పర్సనల్ లోన్ పైన వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల వరకు ఇస్తుంది. వడ్డీ రేటు 6.85 శాతం.

పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.3 లక్షల వరకు ఇస్తుంది. వడ్డీ రేటు 8.5 శాతం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల వరకు ఇస్తుంది. వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల వరకు ఇస్తుంది. వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది.'

బ్యాంకులు.. లోన్

బ్యాంకులు.. లోన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కవచ్ పర్సనల్ లోన్ స్కీం, పంజాబ్ నేషనల్ బ్యాంకు PNB సహయోగ్ రిన్ కోవిడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కోవిడ్ పర్సనల్ లోన్ అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు లోన్ అందిస్తోంది.

English summary

కోవిడ్ 19 లోన్, రూ.5 లక్షల వరకు... వివిధ బ్యాంకులు అందిస్తున్న లోన్ | Banks offer COVID 19 loans on easy terms

The second wave of the COVID-19 pandemic has affected millions of families across India. The hospital bills for the treatment have run up to lakhs of rupees for families. During this period, the RBI announced COVID relief measures.
Story first published: Friday, July 9, 2021, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X