For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.599 రీచార్జ్‌తో ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్, రూ.4 లక్షల బీమా: వివరాలివే..

|

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రూ.599 ప్లాన్ తీసుకునే చందాదారులకు భారతీ యాక్సా లైఫ్ ఇన్సురెన్స్ నుంచి రూ.4 లక్షల విలువైన జీవిత బీమాను అందించనుంది. ఈ మేరకు భారతీ ఎయిర్ టెల్ సోమవారం నాడు ప్రకటన చేసింది. భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

ఎయిర్ ఏషియా బంపరాఫర్, డొమెస్టిక్ రూ.1,019కే టిక్కెట్ఎయిర్ ఏషియా బంపరాఫర్, డొమెస్టిక్ రూ.1,019కే టిక్కెట్

రూ.599తో ఈ ప్రయోజనాలు, రూ.4 లక్షల ఇన్సురెన్స్

రూ.599తో ఈ ప్రయోజనాలు, రూ.4 లక్షల ఇన్సురెన్స్

ఈ పథకం ద్వారా రూ.599తో రీచార్జ్ చేయిస్తే రోజుకు 2GB డేటా ఉచితం. అలాగే ఏ నెట్ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. దీనికి తోడు భారతి యాక్సా లైఫ్ ఇన్సురెన్స్ నుంచి రూ.4 లక్షల లైఫ్ ఇన్సురెన్స్ కవర్‌ను అందిస్తోంది.

డిజిటల్ రూపంలో ఇన్సురెన్స్.. సంయుక్త ప్రకటన

డిజిటల్ రూపంలో ఇన్సురెన్స్.. సంయుక్త ప్రకటన

ఈ పథకంలో రీచార్జ్ కాల పరిమితి 84 రోజులు. అదే విధంగా బీమా కాలపరిమితి కూడా మూడు నెలల పాటు ఉంటుంది. రీచార్జ్ చేసుకున్న ప్రతిసారి జీవిత బీమా కాలం కూడా పొడిగించబడుతుంది. 18-54 ఏళ్ల మధ్య వయస్సులోని వారికి ఈ పథకం వర్తిస్తుంది. దీనికి ఎలాంటి ధ్రవీకరణ పత్రాలు, ఆరోగ్య పరీక్షల సర్టిఫికెట్లు అవసరం లేదు. డిజిటల్ రూపంలో ఇన్సురెన్స్ పేపర్స్ వస్తాయి. మీరు అడిగితే మీ ఇంటికి ఇన్సురెన్స్ ఫిజికల్ కాపీని కూడా పంపిస్తారు. ఈ మేరకు భారతీ ఎయిర్ టెల్, భారతీ యాక్సా కలిసి సోమవారం ఈ ప్రకటన చేశాయి.

ఇన్సురెన్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఏం చేయాలి?

ఇన్సురెన్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఏం చేయాలి?

రూ.599 రీచార్జ్‌తో ఇన్సురెన్స్ ప్రయోజనాలు పొందేందుకు ఇలా చేయాలి.... కస్టమర్లు తొలి రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా, ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా లేదా ఎయిర్ టెల్ రిటైలర్ ద్వారా పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ కస్టమర్లకు ఇన్సురెన్స్ కవరేజ్ అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని, భారతీ యాక్సా లైఫ్ ఇన్సురెన్స్‌తో ఒప్పందం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ఢిల్లీ ఎన్సీఆర్ భారతీ ఎయిర్ టెల్ సీఈవో వాణి వెంకటేష్ అన్నారు.

త్వరలో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి..

త్వరలో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి..

కాగా, ప్రస్తుతం ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉంది. ఎయిర్ టెల్ ఈ ఏడాది మే నెలలో రూ.249 ప్లాన్‌తోను రూ.4 లక్షల ఇన్సురెన్స్ కవర్ ప్రకటించింది.ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సురెన్స్‌తో జత కలిసింది. రూ.249 ఆఫర్‌లో 2GB డేటా, 28 రోజులు.

English summary

రూ.599 రీచార్జ్‌తో ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్, రూ.4 లక్షల బీమా: వివరాలివే.. | airtel prepaid users to get rs 4 lakh life cover under rs 599 plan

Pre paid mobile customers of Bharti Airtel subscribing to Rs 599 plan will now get life insurance cover from Bharti Axa under a partnership deal between the two companies.
Story first published: Tuesday, November 5, 2019, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X