For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 శాతం కరెక్షన్.. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

|

ముంబై: స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిసిపడుతున్నాయి. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. కరోనా కారణంగా మార్చి చివరి వారంలో 26,000 పాయింట్ల దిగువకు పతనమైన సెన్సెక్స్ ఇప్పుడు 46,000 పాయింట్లను దాటింది. తొమ్మిది నెలల క్రితం లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోగా, ఇప్పుడు అంతకు రెట్టింపు ఆదాయాలు నమోదవుతున్నాయి. గత నెల రోజుల్లోనే సెన్సెక్స్ 42వేలను దాటి 46వేల పైకి చేరుకుంది. ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరగడం, కరోనా కేసులు తగ్గడంతో FIIలు జోరందుకున్నాయి. దీంతో మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి.

LPG Cylinder Prices: చమురు కంపెనీల షాక్, గ్యాస్ సిలిండర్ ధర పెంపుLPG Cylinder Prices: చమురు కంపెనీల షాక్, గ్యాస్ సిలిండర్ ధర పెంపు

కరెక్షన్ ఉండొచ్చు

కరెక్షన్ ఉండొచ్చు

కొద్ది రోజుల్లోనే మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటంతో మార్కెట్లు కరెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దాదాపు 10 శాతం మేర మార్కెట్లు కరెక్షన్‌కు గురయ్యే అంశాన్ని కొట్టి పారేయలేమని చెబుతున్నారు. కేవలం నవంబర్ నెలలోనే సెన్సెక్స్ 11 శాతానికి పైగా ఎగిసింది. విదేశాల్లో కరోనా కేసులు పెరగడం, మన వద్ద తగ్గడం, ఆర్థిక కార్యకలాపాల పెరగడం వంటివి ఇందుకు దోహదపడ్డాయని, కాబట్టి మున్ముందు కరెక్షన్ లేదా దిద్దుబాటు తప్పకపోవచ్చునని చెబుతున్నారు.

పెట్టుబడులు పెట్టవచ్చు

పెట్టుబడులు పెట్టవచ్చు

ఒక్క నవంబర్ నెలలోనే మార్కెట్లు 11 శాతం పెరిగినందున దీనిని అలాగే కొనసాగించే అవకాశాలు తక్కువ అని, అందుకే కరెక్షన్ ఉండవచ్చునని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అంటున్నారు. ఒకవేళ మార్కెట్లు మరో 5 శాతం కనుక పెరిగితే 10 శాతం దిద్దుబాటు ఉండవచ్చునని చెబుతున్నారు. కరెక్షన్ ఉంటుందనే భావనతో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం మంచిదని చెబుతున్నారు.

ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?

ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చునని, అయితే ఆచితూచి ముందుకు సాగాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రంగాలు, స్టాక్స్ వారీగా ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిదేనని చెబుతున్నారు. ఇటీవల ఐఆర్‌సీటీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి స్టాక్స్ పైపైకి ఎగిరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

English summary

10 శాతం కరెక్షన్.. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? | A 10 percent correction can't be ruled out, but it is better to stay invested

you could get a 10% correction in the market but that type of correction is par for the course in bull markets at any given point of time.
Story first published: Thursday, December 10, 2020, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X