For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ జనవరి నుండి అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన 5 లార్జ్ క్యాప్ ఫండ్స్

|

ఈ ఏడాది జనవరి నుండి మార్కెట్లు రాణించాయి. ఇటీవల సెన్సెక్స్ ఏకంగా 53,000 పాయింట్లను క్రాస్ చేసింది. సంవత్సరానికి లేదా జనవరి 1, 2021 నుండి ఉత్తమ రాబడిని ఇచ్చిన ఐదు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇక్కడ తెలుసుకోండి. అయితే ఈ అన్ని ఫండ్స్‌కు వివిధ రేటింగ్ ఏజెన్సీలు బెస్ట్ రేటింగ్ ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి గత కొంతకాలంగా మంచి రాబడి ఇచ్చిన ఫండ్స్ గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. కానీ పెట్టుబడులు పెట్టమని సూచించడం లేదు. రిస్క్, ఫండ్ సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలా లేదా వద్దా అని చూసుకోవాలి.

ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్

ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్

ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్ ఈ ఏడాది ప్రారంభం నుండి 23.40 శాతం రిటర్న్స్ ఇచ్చినట్లు మార్నింగ్ స్టార్ ఏజెన్సీ చెబుతోంది. జనవరి 1, 2021 నుండి ఉత్తమ రిటర్న్స్ అందించిన ఫండ్‌గా దీనిని చెబుతున్నారు. లార్జ్ క్యాప్ కేటగిరీలో అత్యుత్తమ రిటర్న్స్ అందించిన వాటిలో ఇది ముందు ఉంది.

ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్ నుండి మూడేళ్ల ప్రాతిపదికన 13.44 శాతం రాబడి, 5 ఏళ్ల ప్రాతిపదికన 11.12 శాతం రిటర్న్స్ లభించాయి. ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్‌లో ప్రతి నెల రూ.1000తో సిప్ ద్వారా ప్రారంభించవచ్చు. అయితే ఇక్కడ ఏ ఫండ్‌ను సిఫార్స్ చేయడం లేదు.

టాటా లార్జ్ క్యాప్ ఫండ్

టాటా లార్జ్ క్యాప్ ఫండ్

లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో టాటా లార్జ్ క్యాప్ ఫండ్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్‌లో ఉంది. 2021లో ఇది 20.87 శాతం రిటర్న్స్ అందించింది. ఆసక్తికర అంశం ఏమంటే నెలకు రూ.150తో ఇందులో సిప్ సాధ్యం. టాటా లార్జ్ క్యాప్ ఫండ్ అతిపెద్ద ఫండ్ కాదు. నిర్వహణ ఆస్తులు రూ.1000 కోట్ల లోపు ఉన్నాయి. ఈ ఫండ్ మూడేళ్ల రిటర్న్స్ 12.6 శాతం, అయిదేళ్ల రిటర్న్స్ 11.91 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. టాటా లార్జ్ క్యాప్ ఫండ్... ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేసింది.

మహీంద్రా మానులైఫ్ లార్జ్ క్యాప్ ప్రగతి యోజన

మహీంద్రా మానులైఫ్ లార్జ్ క్యాప్ ప్రగతి యోజన

మహీంద్రా మానులైఫ్ లార్జ్ క్యాప్ ప్రగతి యోజన ఫండ్ జనవరి 1, 2021 నుండి 19.38 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్‌ను 2019లో లాంచ్ చేశారు. ఇటీవలే ప్రారంభమైనందున లాంగ్ టర్మ్ రిటర్న్స్ గురించి అప్పుడే చెప్పలేం. ఈ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ రూ.123 కోట్లు మాత్రమే. నెలకు రూ.1000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా సిప్ ప్రారంభించవచ్చు.

నిప్పోన్ ఇండియా లార్జ్ ఫండ్

నిప్పోన్ ఇండియా లార్జ్ ఫండ్

ఈ 2021లో అత్యంత రిటర్న్స్ ఇచ్చిన నాలుగో కంపెనీ నిప్పోన్ ఇండియా లార్జ్ ఫండ్. ఇది 18.86 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఆసక్తికరంగా ఇందులో కూడా రూ.100తో సిప్‌ను ప్రారంభించవచ్చు. మూడేళ్ల రిటర్న్స్ 13.5 శాతం ఇచ్చింది. వ్యాల్యూ రీసెర్చ్ నుండి దీనికి టూస్టార్ రేటింగ్ ఉంది.

IDBI ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్

IDBI ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్

IDBI ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్ మరో లార్జ్ క్యాప్ ఫండ్. ఇది ఈ సంవత్సరం 18.21 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొనబడిన అంశాలు వార్షిక ప్రాతిపదికన లేదా ఈ ఏడాది ఆయా ఫండ్స్ ఇచ్చిన రిటర్న్స్ మాత్రమే. కాబట్టి ప్రొఫెషనల్స్‌ను సంప్రదించి, అన్నీ ఆలోచించి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.

English summary

ఈ జనవరి నుండి అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ | 5 Large Cap Funds With Best Returns Since Jan 1. Should You Invest?

Since Jan 2021, the markets have done pretty well, with the Sensex breaching the 53,000 points mark again. Here are 5 large cap funds that have given the best returns year to date or since Jan 1, 2021. We have not taken the same funds with a different payout or the same fund with a regular and direct plan.
Story first published: Tuesday, July 13, 2021, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X