For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? వీటిని చూడండి..

|

గత ఏడాది కరోనా అనంతరం భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆ తర్వాత క్షీణించినప్పటికీ, క్రమంగా కోలుకుంటోంది. ఓ సమయంలో 64,000 డాలర్లను క్రాస్ చేసిన ఈ క్రిప్టో ఆ తర్వాత 50వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఇప్పుడు 57,000 డాలర్లను క్రాస్ చేసింది. బిట్ కాయిన్ తాజాగా 7 శాతానికి పైగా ఎగిసింది. అయినప్పటికీ ఏప్రిల్ 14వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం 64,895.22 డాలర్లతో పోలిస్తే దాదాపు 12 శాతం తక్కువగా ఉంది. ఇక సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎథేరియం దాదాపు 6 శాతం ఎగిసి 3,430 డాలర్లకు చేరుకుంది. క్రితం సెషన్‌తో పోలిస్తే 191.58 డాలర్లు పెరిగింది. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ క్షీణించినప్పటికీ, మళ్లీ కోలుకుంటోంది.

గత కొద్దికాలంగా క్రిప్టోకరెన్సీలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఇది నిలకడలేనిదనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా అంతకంతకూ ఎగిసిపడుతున్న క్రిప్టోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.

5 Cheap And Potential Cryptocurrencies To Invest In 2021

బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. అయితే కొన్ని క్రిప్టోలు ప్రస్తుతం సామాన్యులు పెట్టుబడి పెట్టే స్థాయిలో ఉన్నాయి. అందులో కార్డానో (1.50 డాలర్లు), డోజీకాయిన్ (0.60 డాలర్లు) యూనిస్వాప్ (42 డాలర్లు) ఉన్నాయి. చైన్‌లింక్ (47.58 డాలర్లు) వద్ద ఉన్నాయి. మరింత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎథేరియం 3,458 డాలర్ల వద్ద ఉంది.

English summary

క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? వీటిని చూడండి.. | 5 Cheap And Potential Cryptocurrencies To Invest In 2021

The top cryptocurrencies are attracting investors looking to diversify their portfolios. Now many growing companies are excepting cryptocurrencies as legitimate means of payment, now is a good time to invest in cryptocurrencies based on your budget. Here's a guide to help you figure out which coins are the best to invest in now.
Story first published: Thursday, May 6, 2021, 22:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X