For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1,500 డిస్కౌంట్, ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఫ్రీ: 'గోల్డ్' లాంటి స్కీంలు, ఇవి మీకు తెలుసా?

|

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2019లో ఏకంగా 20 శాతం వరకు పెరిగాయి. రూ.33 వేలుగా ఉన్న బంగారం చివరి అర్ధ సంవత్సరంలో ఓ సమయంలో రూ.40,000 రికార్డ్ హైకి చేరుకొని, రూ.38 వేల నుంచి రూ.39 వేల మధ్య ముగిసింది. అయితే ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధర మళ్లీ పెరిగింది. ఇప్పుడు ఆల్ టైమ్ హై రూ.42 వేల మార్క్ కూడా చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్వర్గధామంగా భావించే పసిడిపై వైపు చూస్తున్నారు.

రూ.2,000 పెరిగిన బంగారం ధర! ఆ తర్వాత ట్రంప్ మాటతో...రూ.2,000 పెరిగిన బంగారం ధర! ఆ తర్వాత ట్రంప్ మాటతో...

గత ఏడాది 26 శాతం రిటర్నస్

గత ఏడాది 26 శాతం రిటర్నస్

గత ఏడాది బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 26 శాతం రిటర్న్స్ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర పెరగడమే తప్ప భారీగా తగ్గడం మాత్రం ఉండదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ఓ మంచి మార్గంగా చెప్పవచ్చు. వివిధ జ్యువెల్లర్స్ ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేందుకు 5 బెస్ట్ గోల్డ్ స్కీమ్స్....

తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్.. రూ.1,500 తగ్గింపు

తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్.. రూ.1,500 తగ్గింపు

తనిష్క్ జ్యువెల్లర్స్ గోల్డెన్ హార్వెస్ట్ స్కీంలో నెలకు రూ.2,000 చిన్న మొత్తం చెల్లించడం ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది 10 నెలల స్కీం. పది నెలల తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ వ్యాల్యూ పైన 75 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌లో మీకు రూ.1,500 వరకు డిస్కౌంట్ ఉంటుంది. ప్రతి నెల పెట్టుబడిని మీరు బంగారం కొనుగోలుకు ఉపయోగించవచ్చు. 421 రోజుల తర్వాత ఖాతాను క్లోజ్ చేయాలి. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు దీనిని పరిశీలించవచ్చు.

లలితా జ్యువెల్లరీ పర్చేజ్ ప్లాన్... నెల ఇన్‌స్టాల్‌మెంట్ ఉచితం

లలితా జ్యువెల్లరీ పర్చేజ్ ప్లాన్... నెల ఇన్‌స్టాల్‌మెంట్ ఉచితం

లలితా జ్యువెల్లరీలో 11 నెలల జ్యువెల్లరీ పర్చేజ్ ప్లాన్ ఉంది. రూ.1,000, రూ.1,500, రూ.2,000, రూ.2,500 చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో ఉన్న అతి పెద్ద ప్రయోజనం ఏమంటే ఓ ఇన్‌స్టాల్‌మెంట్ లలితా జ్యువెల్లరీ నుంచి ఉచితంగా లభిస్తుంది. స్వల్ప లేదా మీడియం టర్మ్‌తో మంచి రిటర్న్స్ కోసం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.

బీమా గోల్డ్ ట్రీ... రూ.1,000 అదనం

బీమా గోల్డ్ ట్రీ... రూ.1,000 అదనం

బీమా గోల్డ్ ట్రీ స్కీం ద్వారా రూ.500 చొప్పున 18 నెలలు ఇన్వెస్ట్ చేయవచ్చు. అప్పుడు ఈ మొత్తం రూ.9,000 అవుతుంది. దీనికి కంపెనీ రూ.1,000 అదనంగా కలిపి రూ.10,000 రౌండ్ ఫిగర్ చేస్తుంది. అంటే ఇన్వెస్టర్‌కు రూ.1,000 ప్రయోజనం కలుగుతుంది. 11 నెలల స్కీం కూడా ఉంది. మీకు ఇష్టమైన పథకాన్ని ఎంచుకోవచ్చు. పేమెంట్స్ క్యాష్, చెక్స్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.

GRT గోల్డెన్ ఎలెవన్ ఫ్లెక్సీ ప్లాన్

GRT గోల్డెన్ ఎలెవన్ ఫ్లెక్సీ ప్లాన్

GRT గోల్డెన్ ఎలెవన్ ఫ్లెక్సీ ప్లాన్ నెలసరి సేవింగ్స్ ప్లాన్. ఇండివిడ్యువల్స్‌కు గోల్డ్ జ్యువెల్లరీస్ కొనుగోలు చేసేందుకు ఇది కూడా ఓ మంచి స్కీం. మీరు ఎన్‌రోల్ అయ్యేటప్పుడు మంత్లీ అడ్వాన్స్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. రూ.500 నుంచి వివిధ రకాల స్లాబ్స్ ఉన్నాయి. ఇండివిడ్యువల్స్‌కు పాస్ బుక్ ఇస్తారు. దీంతో వారి పేమెంట్ ట్రాక్ చేసుకోవచ్చు. ఈ స్కీం 11 నెలల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ తర్వాత మీరు మీకు ఇష్టమైన జ్యువెల్లరీ కొనుగోలు చేయవచ్చు. కొన్నింటికి మినహాయింపు ఉంది.

మలబార్ స్మార్ట్ బై

మలబార్ స్మార్ట్ బై

మలబార్ స్మార్ట్ బై స్కీం ద్వారా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు జ్యువెల్లరీ కొనుగోలుపై మనీ సేవ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్‌కు వస్తుంది. కస్టమర్లు తమ ఆభరణాలను ముందుగా సెలక్ట్ చేసుకోవాలి. దీనికి ముందస్తు చెల్లింపు అవసరం.

English summary

రూ.1,500 డిస్కౌంట్, ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఫ్రీ: 'గోల్డ్' లాంటి స్కీంలు, ఇవి మీకు తెలుసా? | 5 Best Gold Schemes To Invest For Rs 2,000 Per Month

Gold prices have soared in the last few months and have given investors a return of 26 per cent last year. It's time to look at gold as an investment option, and invest in some of the attractive gold schemes offered by jewellers. Here are 5 of the best gold schemes that investors could invest in.
Story first published: Thursday, January 9, 2020, 18:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X