For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమంది రిజిస్టర్

|

ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ఆఫర్ చేస్తోంది. ఇందులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ఒకటి. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సురెన్స్ ప్లాన్. 2019 మార్చి 31వ తేదీ నాటికి ఈ పథకం కింద 5.91 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అలాగే, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లో 15.47 కోట్ల మంది జాయిన్ అయినట్లు రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో వెల్లడించారు. ఈ రెండు పథకాలను మోడీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది.

గుడ్‌న్యూస్: డబ్బుల్లేకుండా వస్తువులు కొనొచ్చు,క్యాష్ బ్యాక్గుడ్‌న్యూస్: డబ్బుల్లేకుండా వస్తువులు కొనొచ్చు,క్యాష్ బ్యాక్

రూ.2 లక్షల వరకు ఇన్సురెన్స్ కవర్

రూ.2 లక్షల వరకు ఇన్సురెన్స్ కవర్

- PMJJBY రూ.2 లక్షల వరకు ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది.

- 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న భారతీయులు ఎవరైనా ఈ స్కీంలో చేరవచ్చు.

- జీవన్ జ్యోతి బీమా యోజన వల్ల స్కీంలో చేరిన వారికి జీవిత బీమా 55 ఏళ్ల వరకు వర్తిస్తుంది.

- బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఈ ఇన్సురెన్స్ పాలసీని తీసుకోవచ్చు.

- ఈ రెండు (PMJJBY, PMSBY) సామాజిక భద్రత స్కీంలను 2015లో ప్రారంభించారు.

ఏడాదికి రూ.330 చెల్లించాలి

ఏడాదికి రూ.330 చెల్లించాలి

- జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరిన వారికి రూ.2 లక్షల లైఫ్ కవర్ ఉంటుంది.

- జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ సదుపాయం ఉంది.

- ఏడాదికి రూ.330 చెల్లించాలి. ప్రతి సంవత్సరం ఈ మొత్తం చెల్లించాలి. దీంతో ప్రతి ఏడాది రూ.2 లక్షల కవరేజ్ ఉంటుంది.

- రూ.330 బ్యాంకు అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు డెబిట్ అవుతాయి.

- తక్కువ ప్రీమియం మొత్తంతో ఎక్కువ డబ్బులు వస్తాయి.

- 55 ఏళ్లు దాటాక పాలసీ కవరేజీ లభించదు.

బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయవద్దు

బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయవద్దు

- బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేస్తే PMJJBY కస్టమర్లకు అందుబాటులో ఉండదు.

- కాబట్టి బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేసుకునే సమయంలో ఇది గుర్తుంచుకోవాలి.

- అకౌంట్‌లో సరిపడేంత బ్యాలన్స్ లేకుంటే లేదా ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లించకపోతే అప్పుడు కూడా పాలసీ వర్తించదు.

- ఓ బ్యాంకు అకౌంట్ ద్వారా ఒక ఇన్సురెన్స్ పాలసీ మాత్రమే తీసుకోవచ్చు.

PMSBY స్కీం..

PMSBY స్కీం..

PMSBY స్కీంకు కూడా రూ.2 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సురెన్స్ వర్తిస్తుంది. శాశ్వత అంగవైకల్యానికి కూడా రూ.2 లక్షల ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది. పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష కవర్ ఉంది. 18-70 ఏళ్ల వరకు అర్హులు. బ్యాంకు అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలి. ఏడాదికి రూ.12 చెల్లించాలి. ఇందులో కూడా ఆటోమేటిక్‌గా బ్యాంకు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.

English summary

మోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమంది రిజిస్టర్ | 5.91 cr people registered under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

As many as 5.91 crore people have been enrolled under the Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and 15.47 crore people enlisted under the Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) since the launch of the two social security schemes in 2015, Union Finance Minister Nirmala Sitharaman said in the Lok Sabha.
Story first published: Thursday, December 12, 2019, 14:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X