For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి నెల రూ.1000: ఈ నాలుగింటిలో పెట్టుబడి పెడితే... ఇక్కడ రిస్క్ తక్కువ

|

మార్కెట్లు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కొత్త రికార్డులకు చేరుకున్నప్పుడు పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తారు. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపుతారు.

మార్కెట్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నప్పుడు లాభాలను బుక్ చేసుకొని, సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మార్నింగ్ స్టార్ నుండి 5 స్టార్ రేటింగ్ కలిగిన నాలుగు సిప్స్ ఇక్కడ తెలుసుకోండి. ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ పైన రీసెర్చ్ చేసే సంస్థ. వ్యాల్యుబుల్ డేటా అందిస్తుంది.

యాక్సిస్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్

యాక్సిస్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఓ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత ఇన్స్‌ట్రుమెంట్స్ పోర్ట్‌పోలియోలో పెట్టుబడులు పెడుతుంది. యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కు మార్నింగ్ స్టార్ 5స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్‌లో రూ.8600 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో 86 శాతం ఈక్విటీలలో పెట్టుబడులుగా ఉన్నాయి. ఫండ్‌లోని స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఉన్నాయి. పెట్టుబడిదారులు రూ.500 సిప్ మొత్తంతో కనీస పెట్టుబడి రూ.1000తో ప్రారంభించవచ్చు.

కెనరా రోబికో ఇమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్

కెనరా రోబికో ఇమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్

యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మార్కెట్క్యాపిటలైజేషన్ అంతటా ఇన్వెస్ట్ చేస్తుండగా, కెనరా రోబికో ఇమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ మాత్రం లార్జ్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలిక రిటర్న్స్ కోసం చూస్తున్న వారు కెనరా రోబికో ఇమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఫండ్ ఒక ఏడాదిలో 60 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత ఒక సంవత్సరంగా సగటున 17 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇది పూర్తి ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్ కావడంతో రిస్క్ ఎక్కువే. అందుకే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ప్రతి నెల రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు.

ICICI ప్రుడెన్షియల్ సేవింగ్స్ ఫండ్

ICICI ప్రుడెన్షియల్ సేవింగ్స్ ఫండ్

మార్నింగ్ స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన మరో ఫండ్ ICICI ప్రుడెన్షియల్ సేవింగ్స్ ఫండ్. పైన పేర్కొన్న రెండింటికి భిన్నంగా ఇది రుణ, మనీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది ఇతర ప్యూర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే రాబడి, రిస్క్ తక్కువగా ఉంటుంది.

కొటక్ లో డ్యురేషన్ ఫండ్

కొటక్ లో డ్యురేషన్ ఫండ్

రిస్క్ ఇష్టపడని వారి కోసం కొటక్ లో డ్యురేషన్ ఫండ్ మంచి సాధనం. ఈ ఫండ్ వారి మూలధనాన్ని కాపాడుతుంది. బ్యాంకు అకౌంట్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కాస్త మెరుగైన రాబడిని ఇస్తాయి. కొటక్ లో డ్యురేషన్ ఫండ్ గత ఏడాది 4.52 శాతం రిటర్న్స్ అందించింది. మూడేళ్లలో 7.22 శాతం రిటర్న్స్ వచ్చాయి. అయిదేళ్లలో 7.35 శాతం వచ్చాయి.

English summary

ప్రతి నెల రూ.1000: ఈ నాలుగింటిలో పెట్టుబడి పెడితే... ఇక్కడ రిస్క్ తక్కువ | 4 SIPs To Invest With 5 Star Rating From Morningstar

With markets at record highs the best way to invest would be through the SIP route. Staggered investment is the ideal way to invest at times when the markets are at a new record.
Story first published: Monday, July 12, 2021, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X