For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ టైంలో మరో శుభవార్త: రుణాలు తీసుకునేవారికి తీపి, వారికి చేదు

|

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును శుక్రవారం మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ ఏడాది కాలంలో ఇది అయిదో కట్. దీంతో ఏడాదిలో రెపో రేటు 6.50 నుంచి 5.15కు చేరుకుంది. ఆర్బీఐ తాజా రెపో రేటు తగ్గింపుతో ఇది పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి క్వార్టర్లో ఎకనామిక్ గ్రోత్ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆటో, ఎఫ్ఎంసీజీ సహా సేల్స్ పడిపోయాయి. ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వరుసగా ఐదోసారి రెపో రేటును తగ్గించింది.

జీడీపీ దెబ్బ: రెపో ప్రకటన తర్వాత భారీ నష్టాల్లో మార్కెట్లుజీడీపీ దెబ్బ: రెపో ప్రకటన తర్వాత భారీ నష్టాల్లో మార్కెట్లు

పండుగ సీజన్లో ఇది మరో శుభవార్త...

పండుగ సీజన్లో ఇది మరో శుభవార్త...

ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు ప్రభావం రుణాలపై పడుతుంది. హోమ్ లోన్, ఆటో లోన్ మరింత చౌక కానున్నాయి. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగ సీజన్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలకు తోడు ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో హోమ్ లోన్, వెహికిల్ లోన్ తీసుకునే వారికి ప్రయోజనం. రెపో రేటు తగ్గింపు ద్వారా రుణ భారం తగ్గించడం ద్వారా పండుగ సీజన్లో వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ లోన్‌లు బెంచ్ మార్కుకు అనుసంధానం చేయబడ్డాయి. ఇప్పటికే కార్పోరేట్ ట్యాక్స్ వంటి ఉద్దీపనలతో వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

రుణాలు చౌక అయ్యే అవకాశం

రుణాలు చౌక అయ్యే అవకాశం

ఫిబ్రవరి - ఆగస్ట్ 2019 మధ్య ఆర్బీఐ రెపో రేటును 110 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వాణిజ్య బ్యాంకులు వెయిటేజ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR) 29 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. ఇదే కాలంలో ఔట్ స్టాండింగ్ రుపీ లోన్స్ WALR 7 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఆర్బీఐ రెపో రేటును తాజాగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానిస్తుండటంతో రుణాలు చౌక అయ్యే అవకాశముంది. పండుగ సీజన్లో ఆయా బ్యాంకు కస్టమర్లకు ఇది శుభవార్తే.

బెంచ్ మార్క్ అనుసంధానం...

బెంచ్ మార్క్ అనుసంధానం...

రెపో రేటు తగ్గితే రుణగ్రహీతలకు ఈఎంఐ తగ్గే అవకాశముంటుంది. దీంతో హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ పైన నెలసరి వాయిదా కాస్త తగ్గవచ్చు. బ్యాంకులు తమ రుణాలను రెపో రేటు వంటి బాహ్య బెంచ్ మార్క్‌తో అనుసంధానించాలని ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే.

FD చేసేవారికి చేదు

FD చేసేవారికి చేదు

రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికి ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు శుభవార్త. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FD) చేసేవారికి మాత్రం ఇది చేదు వార్త. FDలలో ఇన్వెస్ట్ చేసేవారికి వచ్చే వడ్డీ రేటు తగ్గుతుంది. ప్రధానంగా వడ్డీ రేటుపై ఆధారపడే సీనియర్ సిటిజన్స్‌కు ఆదాయంలో తగ్గింపు (వడ్డీ తగ్గింపు) ఉంటుంది.

వరుసగా తగ్గుతున్న వడ్డీ రేటు

వరుసగా తగ్గుతున్న వడ్డీ రేటు

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా రెపో రేటు తగ్గుతోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 6.50 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గింది. గత నాలుగు పర్యాయాలు 110 బేసిస్ పాయింట్లు తగ్గితే, ఈ పర్యాయం తగ్గించిన 25 బేసిస్ పాయింట్లతో కలిపి 135 తగ్గింది. దీంతో గత కొన్ని నెలలుగా బ్యాంకులు కూడా FD వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఎస్బీఐ ఇప్పటికే FD వడ్డీ రేట్లను ఆగస్ట్ నుంచి 3సార్లు తగ్గించింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక సంవత్సరం FDపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది.

English summary

పండుగ టైంలో మరో శుభవార్త: రుణాలు తీసుకునేవారికి తీపి, వారికి చేదు | Loans to become cheaper after RBI cuts repo rate to a decade low

Home, auto and other loans are set to become cheaper after the RBI on Friday cut interest rates for a record fifth straight time to almost a decade low as it moved aggressively to revive economic growth languishing at six-year lows.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X