For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్ బాగుందా, తక్కువ వడ్డీకే రుణాలు: ఇలా రూ.10 లక్షలు ఆదా!

|

ఇటీవలి కాలంలో రుణాలు సులభంగా మారాయి! ఇదివరకు బ్యాంకుల చుట్టు తిరిగినప్పటికీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం క్లీన్ అకౌంట్ షీట్ ఉంటే కనుక రుణాలు చాలా ఈజీ అయ్యాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్... ఏదైనా బ్యాంకుకు వెళ్లకుండానే తీసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీ అకౌంట్ షీట్ బాగుంటేనే రుణం ఈజీగా రావడంతో పాటు త్వరితగతిన వస్తుంది. తాజాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్ రుణాల విషయంలో మరో అడుగు ముందుకేశాయి. థర్డ్ పార్టీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా హోమ్‌లోన్ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు వేర్వేరుగా ఇస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (Cibil) ఆధారంగా రుణాలు మంజూరు చేయనుంది. మూడు రకాల క్రెడిట్ స్కోల్ స్లాబ్స్ ఉండనున్నాయి. 900కు గాను గరిష్టంగా 760 స్కోర్ ఉంటే, అలాంటి వారికి 675-724 స్కోర్ ఉన్న వారికంటే 1 శాతం తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తారు. 760 పాయింట్లకు ఎక్కువ స్కోర్ ఉంటే 8.1 శాతం వడ్డీ ఉంటుంది. థర్డ్ స్లాబ్‌లో ఉన్నవారు 9.1 శాతం వడ్డీ చెల్లించాలి. మిడిల్ స్లాబ్ అంటే 725 నుంచి 759 మధ్య స్కోర్ ఉంటే 8.35 శాతం వడ్డీ ఉంటుంది. 675 - 724 క్రెడిట్ స్కోర్ అతి తక్కువ స్లాబ్.

మూడు బ్యాంకులదీ అదే దారి...

మూడు బ్యాంకులదీ అదే దారి...

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫ్లోటింగ్ రేటు రుణాలు బాహ్య బెంచ్ మార్క్‌తో అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి వడ్డీ రేటు రుణాల పరిమాణం లేదా వ్యవధిపై ఆధారపడి ఉండదు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు కూడా సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణాలు ఇస్తున్నారు.

క్రెడిట్ స్కోర్ చాలా కీలకం

క్రెడిట్ స్కోర్ చాలా కీలకం

రుణాలు తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ చాలా కీలకం కానుంది. ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు రుణ రేట్లను బాహ్య బెంచ్ మార్క్‌లకు అనుసంధానం చేశాయి. రుణం తీసుకున్నప్పటికీ అది పూర్తయ్యే వరకు క్రెడిట్ స్కోర్ కీలకం అని చెబుతున్నారు. మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. రుణ చెల్లింపు కాలపరిమితిలో క్రెడిట్ స్కోర్ తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుందట.

అలా చేస్తే రూ.10 లక్షల వరకు ఆదా

అలా చేస్తే రూ.10 లక్షల వరకు ఆదా

ఉదాహరణకు 9.1 శాతం వడ్డీతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అదే 100 బేసిస్ పాయింట్లు తగ్గితే నెలసరి ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) 3,380 తగ్గుతుంది. అంటే మీ కాలపరిమితి 25 ఏళ్లు కనుక ఉంటే రూ.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్‌ను బట్టి రిస్క్..

క్రెడిట్ స్కోర్‌ను బట్టి రిస్క్..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రుణగ్రహీత లోన్ తీసుకున్న ఏడాది తర్వాత క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే రిస్క్ ప్రీమియం తగ్గుతుందని, అలాగే రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ పడిపోతే ప్రీమియం పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. సిబిల్ స్కోర్ 760కి తగ్గితే అప్పుడు వడ్డీ రేటు పెరుగుతుందని చెబుతున్నారు.

సిండికేట్ బ్యాంక్...

సిండికేట్ బ్యాంక్...

రుణగ్రహీత సిబిల్ స్కోర్ 50 పాయింట్లకు మించి పడిపోతే క్రెడిట్ రిస్క్ ప్రీమియాన్ని పెంచాలని సిండికేట్ బ్యాంక్ కూడా నిర్ణయించింది. క్రెడిట్ ప్రొఫైల్ క్షీణత ఆధారంగా వడ్డీ రేట్లు కూడా మారవచ్చు. అంటే రుణగ్రహీత సంవత్సరంలో మూడుసార్లకు మించి 30 రోజుల తర్వాత ఈఎంఐ చెల్లింపులు జరిపితే ఇది వర్తిస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

700 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 బేసిస్ పాయింట్ల ఛార్జ్ ఎక్కువగా వసూలు చేయనుంది. సిబిల్ స్కోర్‌తో పాటు ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ వంటి ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్‌లను కూడా పరిగణలోకి తీసుకోనుంది.

English summary

క్రెడిట్ స్కోర్ బాగుందా, తక్కువ వడ్డీకే రుణాలు: ఇలా రూ.10 లక్షలు ఆదా! | Banks to offer better interest rates on loans to customers with high credit score

Three public sector lenders Bank of Baroda, Union Bank of India and Syndicate Bank have taken the first steps in transparently segregating retail loans into their own versions of prime and subprime risk exposure, using third-party credit scores of potential borrowers to offer them different home-financing rates.
Story first published: Thursday, October 10, 2019, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X