For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటర్న్స్ ఎలా, ఎంతకాలం ఆగాలి: బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండిలా...

|

సంపదను పెంచుకోవడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సాధనాల్లో బాండ్లు కూడా ఒకటిగా ఉన్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్దేశిత కాలంలో రాబడులను వృద్ధి పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి బాండ్లు లేదా డిబెంచర్లను ఎంచుకోవాలన్న విషయాలను తెలుసుకుంటే మంచి ప్రయోజనాలను పొందటానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందామా మరి...

చిన్న వ్యాపారులకు వాట్సాప్ బిజినెస్ దన్ను!చిన్న వ్యాపారులకు వాట్సాప్ బిజినెస్ దన్ను!

పెట్టుబడి పెట్టడం సులభం

పెట్టుబడి పెట్టడం సులభం

* స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే కొంత నేర్పరి తనం అవసరం. షేర్ల ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి తగిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది.

* ఈక్విటీలతో పోల్చితే బాండ్స్ లో పెట్టుబడి చాలా సులభమనే చెప్పవచ్చు

* బాండ్లు నిర్దేశిత కాలంలో మెచ్యూర్ అవుతాయి. బాండ్లను జారీ చేసిన సంస్థ నిర్దేశిత తేదీన పెట్టుబడి పెట్టిన సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తుంది.

* షేర్లలో ఇలాంటి మెచ్యూరిటీ ఏమీ ఉండదు. డబ్బు అవసరం అనుకుంటే వీటిని స్టాక్ మార్కెట్లో అమ్ముకోవాల్సిందే. ఎప్పుడు విక్రయించాలి, ఏ ధరకు విక్రయించాలన్నది ఇన్వెస్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. షేర్ల ధరలు మన చేతిలో ఉండవు. కాబట్టి ధరల్లో ఎలాంటి మార్పులైనా జరగవచ్చు.

ఇవి ముఖ్యం..

ఇవి ముఖ్యం..

* మెచ్యూరిటీ కన్నా ముందుగానే బాండ్లను సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. అయితే వాటికీ మంచి ధర రావాలంటీ వాటిని జారీ చేసిన సంస్థతోపాటు బాండ్లకు ఇచ్చిన రేటింగ్ ముఖ్యం.

* క్రెడిట్ రేటింగ్ సంస్థలు బాండ్లకు రేటింగ్ ను ఇస్తుంటాయి. ఏఏఏ, ఏఏ వంటి రేటింగ్స్ బాండ్లపై కనిపిస్తుంటాయి కదా. రేటింగ్స్ ను చూసి బాండ్లను ఎంచుకోవాలి.

* బాండ్లలో పెట్టుబడులు పెట్టే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు, ఫండ్ మేనేజర్లు బాండ్లను జారీ చేసే సంస్థ కు సంబందించిన పూర్వాపరాలు, వాటి చెల్లింపు సామర్థ్యాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతనే పెట్టుబడుల విషయంలో ముందడుగు వేస్తారు.

* బాండ్లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటికీ ప్రాధాన్యం ఇవ్వాలి.

రిటర్న్ ఎంతో చూసుకోవాలి...

రిటర్న్ ఎంతో చూసుకోవాలి...

* బాండ్లను జారీ చేసే సంస్థలు వాటిపై ఎంత రిటర్న్ వస్తుందో కూడా వెల్లడిస్తాయి. ప్రతి సంవత్సరం చెల్లించే వడ్డీ రేటు ఉంటుంది.

* బాండ్ ముఖవిలువపై వడ్డీ రేటును చెల్లిస్తారు. ఈ వడ్డీ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

* ప్రాథమిక మార్కెట్లో జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేస్తే మీకు వచ్చే రిటర్న్ అందులో పేర్కొన్న వడ్డీ రేటు ఎంత ఉందో అంత వస్తుంది.

* ఒకవేళ సెకండరీ మార్కెట్లో బాండ్లను కొనుగోలు చేస్తే దాన్ని బట్టి మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది.

ఎంతకాలం ఆగితే అంత మేలు...

ఎంతకాలం ఆగితే అంత మేలు...

* బాండు కాలపరిమితి వరకు వేచి ఉంటే నిర్దేశిత రిటర్న్ లభించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ లేదా కాలపరిమితి కన్నా ముందుగానే అమ్మితే అప్పుడున్న మార్కెట్ పరిస్థితులపై మీ రాబడి ఆధారపడి ఉంటుంది.

* మీరు కొనుగోలు చేసిన బాండు ధరకన్నా మీరు విక్రయించే ధర ఎక్కువగా ఉంటే మీకు మంచి రాబడి వచ్చినట్టుగానే భావించాలి. ఈక్విటీ మార్కెట్ తో పోల్చితే బాండు మార్కెట్లో లిక్విడిటీ కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి బాండు కాలపరిమితి కన్నా ముందుగా విక్రయించాలనుకుంటే మంచి ధర రాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

* ప్రైమరీ మార్కెట్లో బాండ్లను కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

English summary

రిటర్న్స్ ఎలా, ఎంతకాలం ఆగాలి: బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండిలా... | Which bonds are good for investment?

Bonds pay interest regularly, so they can help generate a steady, predictable stream of income from your savings.
Story first published: Monday, September 16, 2019, 11:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X