For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర ఆటుపోట్లు: ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే..

|

దేశీయ స్టాక్ మార్కెట్ల నాడీ పట్టుకోవడం ఎంత గొప్ప మార్కెట్ పండితునివల్ల కూడా కావడంలేదు. ఏ రోజు మార్కెట్లు పెరుగుతాయో, ఏ రోజు క్షీణిస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించకపోతే నష్టాలే మిగిలే అవకాశం ఉంది. మార్కెట్ల లాభనష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే లక్షల కోట్లు పెరుగుతోంది, తగ్గుతోంది. పెరిగినప్పుడు సంతోషమే కానీ తగ్గిన సందర్భంలో పరిస్థితి ఏమిటి. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మార్కెట్లో సంపద కరిగిపోకుండా చూసుకోవచ్చు.

సర్కారు చర్యలతో..

* పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను, రేరా వంటి సంస్కరణలు ప్రభుత్వం చేపట్టడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. వీటి వల్ల మంచి జరిగిన మాట వాస్తవమే అయినా వీటి ప్రతికూల ప్రభావం కూడా ఉందని మార్కెట్ పండితులు చెబుతున్నారు. వివిధరకాల ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గడం వల్ల డిమాండ్ ప్రభావితమై అది క్రమంగా ఆర్ధిక వ్యవస్థలో మందగమనానికి దారితీసిందని అంటున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ప్రభుత్వం పలు ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. దీంతో మార్కెట్లు కూడా కదం తొక్కాయి. అయితే తీవ్ర ఒడుదొడుకుల కారణంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే చితికిపోవడం మాత్రం జరగవచ్చు. అందుకే ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్ల ఏ రంగంపై ప్రభావం ఎలా ఉంటుందో చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే నష్టాలు తప్పవు.

Is it good to invest when market is down?

దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు...

* స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉండాలి. వీటి మూలంగానే మార్కెట్లు కదులుతుంటాయి.
* రాజకీయ పరిణామాలు, వాణిజ్యపరమైన అంశాలు, విదేశీ మార్కెట్ల గమనం, వివిధ దేశాలు తీసుకునే నిర్ణయాలు,అంతర్జాతీయ సమావేశాలు వంటి వాటి ప్రభావంపై ద్రుష్టి పెట్టాలి.
* డాలర్ మారకంలో రూపాయి విలువ హెచ్చుతగ్గులు, బంగారం ధరల తీరు, ముడి చమురు ధరలు వంటివాటిని పరిశీలించాలి.

రంగాల వారీగా...

* స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు అన్ని షేర్లు పెరగవు. తగ్గినప్పుడు అన్ని తగ్గవు. వివిధ రకాల అంశాలు ఆయా కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ముందు సరైన రంగాన్ని ఎంచుకోండి.
*ఆ రంగం పని తీరు, ఆ రంగంలోని కంపెనీల పనితీరు ఎలా ఉందొ చూసుకోండి.
* ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మి పెట్టుబడి పెడితే నష్టపోయేది మీరేనని గుర్తుంచుకోండి.

తొందరపాటు ఏలా?

* తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. కొంత మంది స్టాక్ మార్కెట్లో అయితే తొందరగా సంపాదించవచ్చని భావిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడతారు.
* ఎలాంటి పరిజ్ఞానం లేకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే దానివల్ల వారికే నష్టం జరుగుతుంది. అందుకే ఏదైనా షేరును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలి.
* అంతేకాకుండా దాని ఫండమెంటల్స్ పై ద్రుష్టి సారించాలి. కంపెనీ ఆర్ధిక ఫలితాలను పరిశీలించాలి. కంపెనీ ఉత్పత్తులు, దాని మార్కెట్, భవిష్యత్లో ఉన్నవృద్ధి అవకాశాలు., పెట్టుబడులు వంటి వాటిని పరిశీలించాలి.
* తొందరపాటుగా పెట్టుబడులు పెట్టి అదే విధంగా వ్యవహరించి చేదు అనుభవాన్ని చవిచూడవద్దు.

English summary

దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర ఆటుపోట్లు: ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే.. | Is it good to invest when market is down?

you should invest when the market is down—and when it’s up and when it’s sideways. Investing is about reaching your financial goals, and that requires keeping your eyes on the prize in all sorts of market conditions.
Story first published: Monday, September 30, 2019, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X