For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు రూ.8 తో బీమా! జీవితానికి ధీమా

|

ఈ రోజుల్లో రూ.10కి ఏమి వస్తుంది. కప్పు టీ కూడా రాదు. కానీ రోజుకు ఇంతకన్నా తక్కువ మొత్తం చెల్లించి బీమా ప్రయోజనాన్ని పొందే ఒక బీమా పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు రకాల బీమా రక్షణలను కల్పిస్తుండటం విశేషం. ఆ పాలసీ వివరాలు తెలుసుకుందామా...
జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ హెచ్ డీ ఎఫ్ సి ఎర్గో... తాజాగా 3 ఇన్ 1 బీమా ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ కోసం రోజుకు రూ. 8 ప్రీమియం చెల్లింపుతో గృహ బీమాతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా, సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించే బీమాను పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసాడెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా

హోమ్ ఇన్సూరెన్సు

హోమ్ ఇన్సూరెన్సు

* హోమ్ ఇన్సూరెన్సు కింద ఇళ్ళతో పాటు ఇంటిలో ఉండే ఖరీదైన ఫర్నీచర్, ఫిక్చర్స్ తో పాటు టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్స్ కు కూడా బీమా రక్షణ లభిస్తుంది. అనేక రకాల విపత్తుల కారణంగా గృహాలకు ప్రమాదం జరుగుతోంది. అయినప్పటికీ ఇళ్లకు బీమా తీసుకుంటున్నవారి సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం మనదేశంలో కేవలం ఒక శాతం ఇళ్లకు మాత్రమే బీమా ఉన్నట్టు చెబుతున్నారు.

సైబర్ దాడులు

సైబర్ దాడులు

* సైబర్ దాడుల బీమా కింద అనధికారిక ఆన్ లైన్ లావాదేవీలు జరిగినప్పుడు లేదా ఫిషింగ్, ఈ - మెయిల్ స్కూపింగ్, ఐడెంటిఫికేషన్ థెఫ్ట్, ఈ - రెపుటేషన్ కు భంగం కల్పించడం, ఈ-ఎక్స్టార్షన్ వంటి వాటి తో పాటు వీటికి సంబంధించిన న్యాయపరమైన వ్యయాలకు కూడా బీమా కవరేజీ ఉంటుంది.

* సైబర్ నేరాలు విచ్చల విడిగా పెరిగిపోతున్నప్పటికీ వీటి నుంచి కాపాడే బీమాను మాత్రం తీసుకోవడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు చాలా మంది. గత ఏడాదిలో భారత కార్పొరేట్ కంపెనీలు కేవలం 350 సైబర్ బీమా పాలసీలను మాత్రమే తీసుకున్నట్టు డీ ఎస్ సి ఐ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

వ్యక్తిగత ప్రమాద బీమా

వ్యక్తిగత ప్రమాద బీమా

* ఈ రోజుల్లో వ్యక్తిగత బీమా ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఈ బీమా ను కూడా హెచ్ డీ ఎఫ్ సి ఎర్గో అందజేస్తుంది. ఇందులో భాగంగా శాశ్వత అంగవైకల్యం కలిగినా, ప్రమాదం వల్ల మెడికల్ వ్యయాలు చేయాల్సి వచ్చినా, రోజువారీగా హాస్పిటల్లో నగదు చెల్లింపులు వంటి వాటికీ ఈ బీమా కింద కవరేజీ లభిస్తుంది. మనదేశంలో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు జనాలు.

ఈ పాలసీ ఆన్ లైన్ లోనే కాకుండా, వెబ్ అగ్రిగేటర్లు, హెచ్ డీ ఎఫ్ సి ఎర్గో ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ చెబుతోంది.

English summary

రోజుకు రూ.8 తో బీమా! జీవితానికి ధీమా | Insurance your home and expensive gadgets with HDFC ERGO at just Rs.8 per day

HDFC ERGO general insurance company, India's third largest non life insurance provider in the private sector.
Story first published: Sunday, September 15, 2019, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X