For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రీమియం చిన్న.. ప్రయోజనం మిన్న

|

ఖర్చు తక్కువ, ప్రయోజనం ఎక్కువగా ఉంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. ఇలాంటి వాటి కోసమే ఎక్కువ మంది చూస్తుంటారు. ఈ రోజుల్లో హోటల్లో టీ తాగాలన్న కనీసం రూ.10 చెల్లించాల్సి వస్తుంది. ఇలా రోజుకు రూ.10 లెక్కించినా నెల రోజుల్లో కనీసం రూ.300 అవుతుంది. ఇది మనకు తెలియకుండానే జరిగే ఖర్చు. దీని వల్ల ప్రయోజనము ఉంటుంది. అయితే ఇంత కన్నా తక్కువ మొత్తం వెచ్చిస్తే మనకు బీమా రక్షణ కూడా లభిస్తుందన్న విషయాన్నీ చాలా మంది అంతగా పట్టించుకోరు. అయితే బీమా కోసం చెల్లించే మొత్తం కూడా ఎక్కువగా ఉండటం కూడా బీమా వ్యాప్తికి కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తక్కువ ప్రీమియం ఉండే పాలసీలను బీమా కంపెనీలు అందుబాటులోకి తీసుకువెళ్తున్నాయి. చాలా బీమా కంపెనీలు, ఇంటర్మీడియేటరీలు ఇటీవలి కాలంలో జీవిత బీమా, సాధారణ బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. డిజిటల్ చానళ్ళు ఇందుకు వేదికగా మారాయి.

<strong>కాలిక్యులేషన్స్: HDFC నుంచి సులభంగా పర్సనల్ లోన్ పొందండి!</strong>కాలిక్యులేషన్స్: HDFC నుంచి సులభంగా పర్సనల్ లోన్ పొందండి!

పేమెంట్ ప్లాట్ ఫామ్స్ తో జట్టు

పేమెంట్ ప్లాట్ ఫామ్స్ తో జట్టు

* మోబిక్విక్ ద్వారా మాక్స్ బుపా, ఎడెల్ వీస్ టోకియో కంపెనీలు వెక్టార్ బోర్న్ వ్యాధులు, టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి.

* డెంగ్యూ బీమా, ఫిట్ నెస్ బీమా, మస్కిటో బీమా లను అపోలో మ్యూనిచ్, బజాజ్ అలేయంజ్ కంపెనీలు టోఫీ ఇన్సూరెన్సు ద్వారా అందుబాటులోకి తెచ్చాయి.

కొనుగోలు సులభం.. తక్కువ ప్రీమియం

కొనుగోలు సులభం.. తక్కువ ప్రీమియం

* ప్రస్తుతం లక్షలాది మంది యువత పలు రకాల డిజిటల్ యాప్స్ ను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా ఈ తక్కువ ప్రీమియం కలిగిన పాలసీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

* ఈ పాలసీలు ప్రపోసల్ ఫార్మ్ అవసరం ఉండదు. మెడికల్ పరీక్షల అవసరం కూడా ఉండదు.

* ఒక్క క్లిక్ లో ఈ బీమా పథకాలను కొనుగోలు చేయవచ్చు.

* సీజనల్ గా వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పాలసీలు తెస్తుండటం విశేషం. మాక్స్ బుపా

రూ.49 కె వెక్టార్న్ బోర్న్ కవరేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా వ్యాధిబారిన పడితే రూ. ఏకమొత్తంగా రూ.10,000 చెల్లిస్తుంది. అంతేకాకుండా ప్రమాదం వల్ల మరణిస్తే రూ. లక్ష చెల్లిస్తుంది.

* చోళ ఎం ఎస్ కంపెనీ రూ.20 చెల్లిస్తే రూ. లక్ష ప్రమాద కవరేజీని అందిస్తోంది.

ప్రమాదం వల్ల మరణిస్తే

ప్రమాదం వల్ల మరణిస్తే

* మాక్స్ బుపా హాస్పి క్యాష్ పేరుతో తెచ్చిన బీమా కింద రూ. 135 వార్షిక ప్రీమియం చెల్లిస్తే హాస్పిటల్లో చేరినప్పుడు రోజుకు రూ. 500 చొప్పున ఏడాదిలో 30 రోజులు చెల్లిస్తుంది. ప్రమాదం వల్ల మరణిస్తే రూ. లక్ష చెల్లిస్తుంది.

* అపోలో మ్యూనిచ్ ఫిట్నెస్ బీమా రూ. 430కి అందిస్తోంది. ఇందులో రూ. లక్ష ప్రమాద కవరేజీ ఉంది.

* ఏడెల్ వీస్ టోకియో గ్రూప్ టర్మ్ కవర్ పాలసీ ని మోబిక్విక్ ద్వారా అందిస్తుంది. రూ. 148కి రూ.ఒక లక్ష, రూ.443కు రూ. 3 లక్షలు, రూ. 738కి రూ. 5 లక్షల బీమా కవరేజీని అందిస్తున్నారు.

ఇలాంటి బీమా పాలసీలను ఎంచుకోవడం ద్వారా తక్కువ ప్రీమియం తోనే ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

English summary

ప్రీమియం చిన్న.. ప్రయోజనం మిన్న | Will a lower cover mean higher returns from insurance plans?

The new product regulation for life insurance policies has reduced the minimum sum assured requirement.
Story first published: Tuesday, August 27, 2019, 7:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X