For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.200/డే ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.21 లక్షలు!!

|

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గం ఏది? ఈ ప్రశ్నకు ఒక్కో వ్యక్తి నుంచి ఒక్కో సమాధానం రావొచ్చు. కానీ సురక్షితం, ఉత్తమ ఎర్నింగ్స్‌కు మార్గం అంటే.. PPF ఒకటి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సురక్షితమైన ఎంపిక. మార్కెట్ రిస్క్‌లు లేని, ట్రిపుల్ ట్యాక్స్ ప్రయోజనాలతో సురక్షిత పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా కనిపిస్తుంది.

<strong>LPG డిస్ట్రిబ్యూటర్‌షిప్ ప్రమాణాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియ</strong>LPG డిస్ట్రిబ్యూటర్‌షిప్ ప్రమాణాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియ

ఇది ట్యాక్స్ ఫ్రీ..

ఇది ట్యాక్స్ ఫ్రీ..

పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల పాటు ఇలా పెట్టడం ద్వారా భారీ మొత్తాన్ని జమ చేసుకోవడంతో పాటు పెట్టుబడి మొత్తం, వచ్చిన వడ్డీ మొత్తం పైన, మెచ్యూరిటీ సమయంలో చేసే విత్ డ్రా పైన ట్యాక్స్ ఫ్రీ సౌకర్యం ఉంటుంది.

వడ్డీ రేటు 7.9 శాతం

వడ్డీ రేటు 7.9 శాతం

పీపీఎప్‌లో మీరు నెలకోసారి లేదా ఏడాదికి కూడా పెట్టుబడిగా పెట్టవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌లో వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఓసారి సమీక్షించవచ్చు. మీరు రోజు రోజు చిన్న మొత్తం లేదా నెలకు కొంత మొత్తం లేదా ఏడాదిలో ఒకసారి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి పెద్ద మొత్తం జమ చేయవచ్చు.

రోజుకు రూ.200

రోజుకు రూ.200

రోజుకు రూ.200 ఇన్వెస్ట్ సేవింగ్ చేయడం ద్వారా నెలకు రూ.6వేలు, ఏడాదికి రూ.72,000 సేవ్ చేస్తారు. ఈ మొత్తాన్ని అంటే ఏడాదికి రూ.72,000ను మీరు పీపీఎఫ్‌లో పదిహేనేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రేటుతో (ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేటు ప్రకారం) కలిపి రూ.21 లక్షలు పొందే అవకాశాలు ఉంటాయి.

రోజుకు రూ.333

రోజుకు రూ.333

రోజుకు రూ.33 ఇన్వెస్ట్ సేవింగ్ చేయడం ద్వారా నెలకు రూ.9,990వేలు, ఏడాదికి రూ.1,19,880 సేవ్ చేస్తారు. ఈ మొత్తాన్ని అంటే ఏడాదికి రూ.1,19,880ను మీరు పీపీఎఫ్‌లో పదిహేనేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రేటుతో (ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేటు ప్రకారం) కలిపి రూ.35 లక్షలు పొందే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకునే వారు మొదట అన్ని వివరాలు తెలుసుకొన్న అనంతరం ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

HDFC ఆన్‌లైన్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్

HDFC ఆన్‌లైన్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్

మీరు పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీస్ లేదా ప్రముఖ వాణిజ్య బ్యాంకుల వద్ద ఓపెన్ చేయవచ్చు. HDFC వంటి బ్యాంకులు ఆన్‌లైన్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి.

English summary

రూ.200/డే ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.21 లక్షలు!! | PPF investment: Turn Rs.333/day into Rs.35 lakh, Rs.200/day into Rs.21 Lakh!

You can make a monthly investment in PPF or once in a financial year. Currently, the interest rate offered on PPF is 7.9 percent and this is revised by the central government on a quarterly basis.
Story first published: Sunday, August 25, 2019, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X