For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చు!

|

మీరు రూరల్ ఇండియాలో నివసించే హౌస్ వైఫ్ లేదా టీచర్ అయితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. సరికొత్త ఈ యాప్ ద్వారా మీరు డబ్బును పొందవచ్చు. టీచర్లు లేదా హౌస్ వైఫ్స్ తమ పని చేసుకుంటూనే మరోవైపు సమాంతర ఆదాయాన్ని ఆర్జించవచ్చు. విన్‌జో - ఇది ఇండియా లార్జెస్ట్ వెర్నాక్యులర్ ఈ-స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫారం. ఆగస్ట్ 1వ తేదీన ఇది 600 మందికి పైగా రూరల్ ఇండియా హౌస్‌వైఫ్స్, స్కూల్ టీచర్లతో జత కట్టినట్లు ప్రకటించింది.

ఎల్ఐసీ జీవన్ ఆధార్: రూ.341 చెల్లిస్తే రూ.లక్ష గ్యారంటీఎల్ఐసీ జీవన్ ఆధార్: రూ.341 చెల్లిస్తే రూ.లక్ష గ్యారంటీ

విన్‌జో

విన్‌జో

విన్‌జో తన యాప్ ప్లాట్‌ఫాం ద్వారా ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ, పంజాబి, బోజ్‌పురి... పది భాషల్లో 30+కు పైగా గేమ్స్‌ను కలిగి ఉంది. ఇక్కడ ఆసక్తికరం ఏమంటే ఈ యాప్‌కు సంబంధించిన అన్ని అనువాదాలను గ్రామీణ హౌస్‌వైఫ్స్, స్కూల్ టీచర్స్ చేస్తారు.

యూజర్ల కోసం...

యూజర్ల కోసం...

ఈ సంస్థ కో ఫౌండర్ పవన్ నందా మాట్లాడుతూ... ఎంటర్‍‌టైన్‌మెంట్ కేటగిరీకి చెందిన ఆన్‌లైన్ గేమింగ్ వేగంగా వృద్ధి చెందుతోందని, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పెరగడంతో ఆన్‌లైన్ గేమింగ్ వృద్ధి కూడా వేగమైందని చెప్పారు. గ్రామీణ భారతానికి ఇది ఎన్నో అవకాశాలు తెచ్చిందన్నారు. చాలామంది విన్‌జో యూజర్లు ఎంజాయ్ చేస్తున్నారని, తమ యూజర్లకు మరింత సానుకూల కంటెంట్ ద్వారా మరింత విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

గృహిణులు, స్కూల్ టీచర్లు నెలకు రూ.15 వేల వరకు..

గృహిణులు, స్కూల్ టీచర్లు నెలకు రూ.15 వేల వరకు..

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భాగంగా వాణిజ్య, సాంస్కృతిక విలువలు కలిగిన ఉత్పత్తి దిశగా అడుగులు వేశామని, ఇందులో భాగంగా రూరల్ ఇండియాలోని వారికి అవకాశాలు కల్పించడం కల్పిస్తూ, భారత మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు. యాప్, ట్రివిట కంటెంట్‌ను వివిధ భాషల్లోకి అనువదించడం ద్వారా గృహిణులు, స్కూల్ టీచర్లు నెలకు రూ.10,000 నుండి రూ.15,000 సంపాదించవచ్చునని చెప్పారు.

 స్థానిక భాషల్లోనే..

స్థానిక భాషల్లోనే..

ప్రస్తుతం విన్‌జో ట్రివిటలో 5 లక్షలకు పైగా డేటాబేస్ ఉందని, దీనిని గృహిణులు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎకోసిస్టం గేమింగ్‌ను ప్రోత్సహించేందుకు, మద్దతు ఇచ్చేందుకు విన్‌జో గేమ్‍‌ను తీసుకు వచ్చారు. ఇందులో 80 శాతానికి పైగా యూజర్లు ఇంగ్లీష్ కాకుండా అంటే వారి వారి భాషల్లోనే యాప్‌ను వినియోగిస్తున్నారు. యావరేజ్‌గా ఈ యాప్ పైన 55 నిమిషాలు ఉంటున్నారు. ఇందులో టాప్ సిటీల నుంచి పది శాతం మంది ఉన్నారు.

English summary

మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చు! | Earn Rs 15,000 plus!: You can generate a massive stream of income

WinZO on August 1 announced that it has partnered with more than 600 housewives and school teachers in rural India to empower them by providing a parallel stream of income.
Story first published: Sunday, August 4, 2019, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X