For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి బీమా ఏజెంట్ల వలలో పడకుండా ఇలా చేయండి..

|

బీమా తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీమాకు ఉన్న ప్రాధాన్యతే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఏజెంట్లు, బ్రోకర్లు జీవిత బీమా పాలసీలను విక్రయిస్తున్నారు. వీరిలో చాలా మంది మంచి ఉద్దేశంతో కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనం కలిగి పాలసీలను ఎంచుకోవడంలో సహకరిస్తున్నారు. కానీ కొంతమంది ఏజెంట్లు మాత్రం వాస్తవాలను పక్కనబెట్టి లేనిపోనివి కల్పించి చెప్పి పాలసీలను విక్రయిస్తున్నారు.

ఇలాంటి వారు తమకు ఎక్కువ కమీషన్ రావాలని కోరుకుంటున్నారు. అయితే బీమా పాలసీలను తీసుకునే ముందు ఏజెంటు చెప్పే వివరాలతో పాటు ఆ పాలసీకి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలుసుకొని పాలసీ తీసుకోవడం మంచిది. మాయమాటలెన్నో చెప్పి కొంతమంది ఏజెంట్లు బీమా పాలసీలను కొనే విధంగా చేస్తారు.వీటిలో వారు ముఖ్యంగా నాలుగైదు విషయాలు చెప్పి ఎక్కువ మందిని ఆకట్టుకుంటారు. అవేమిటంటే...

<strong>బ్యాంకుల నుంచి హోమ్, కారు లోన్ తీసుకుంటున్నారా.. గుడ్‌న్యూస్</strong>బ్యాంకుల నుంచి హోమ్, కారు లోన్ తీసుకుంటున్నారా.. గుడ్‌న్యూస్

అధిక రిటర్న్

అధిక రిటర్న్

* బీమా పాలసీల వల్ల బ్యాంకు డిపాజిట్లకన్నా ఎక్కువ రిటర్న్ వస్తుందని తమ కస్టమర్లకు కొంతమంది ఏజెంట్లు చెబుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. బీమా పాలసీ ద్వారా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్రతికి ఉన్న తమ కుటుంబానికి ఆర్ధిక రక్షణ లభిస్తుంది. అది కూడా సమ్ అస్యూరెన్సు ఎంత ఉంటుందో అంత మేరకు చెల్లిస్తారు. బీమా కోసం నిర్దేశిత మొత్తాన్ని నిర్దేశిత కాలం చెల్లించాల్సి ఉంటుంది. బీమా ద్వారా సొమ్మును పొదుపు చేసుకుంటూ రక్షణ పొందే అవకాశం ఉంటుంది. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చలేము. చాలా పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లకన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉండదు..

పూర్తి వివరాలు వెల్లడించకపోవడం

పూర్తి వివరాలు వెల్లడించకపోవడం

* బీమా పాలసీకి సంభందించిన పూర్తి వివరాలను చెప్పకుండా కొంతమంది దాటవేస్తుంటారు. రాబడులకు సంబంధించి ఎక్కువ చెబుతుంటారు. బీమా పాలసీ గడువు ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి మరచి పోతారని చాలామంది భావిస్తుంటారు. అందుకే కల్లబొల్లి కబుర్లు చెబుతారు. కానీ మీకు తీసుకునే పాలసీ కాలపరిమితి, ఎంత ప్రీమియం చెల్లించాలి, దానిపై వార్షికంగా వచ్చే రాబడి ఎంత అన్న వివరాలు తెలుసుకున్న తర్వానే పాలసీ తీసుకోవాలి.

క్లెయిమ్ విషయాల్లో దాపరికం

క్లెయిమ్ విషయాల్లో దాపరికం

* బీమా తీసుకున్న సమయంలోనే క్లెయిమ్ కు సంభందించిన వివరాలను ఏజెంటు తెలియజేయాలి. ఎలాంటి పరిస్థితిలో బీమా క్లెయిమ్ వస్తుంది. ఎప్పుడు రాదు అన్న వివరాలు వెల్లడించాలి. బీమా తీసుకునే సమయంలో కొంత మంది కొన్ని అలవాట్లు, అనారోగ్య సమస్యలు దాచిపెడుతుంటారు. ఒకవేళ క్లెయిమ్ తీసుకోవాల్సిన సమయంలో ఆ వివరాలుబయట పడితే బీమా కంపెనీలు క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లెయిమ్ లో ఇబ్బందులు లేకుండా ముందుజాగ్రత్త వహించాలి.

ప్రీమియం

ప్రీమియం

* బీమా తీసుకున్న వారు నిర్దేశిత కాలంలో బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎంతకాలం చెల్లించాల్సి ఉంటుందో కాలం తప్పని సరిగా చెల్లించాల్సిందే. ఇది పాలసీదారు భాద్యత. ప్రీమియం చెల్లించకపోతే బీమా ప్రయోజనం లభించదు. పూర్తి కాలం చెల్లించనట్టయితే ఆ మేరకు చార్జీలు లేదా తగ్గింపులు ఉంటాయి. కాబట్టి ప్రీమియం విషయంలో ఉన్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేసుకోవాలి.

బీమా పాలసీ తీసుకునే ముందే సంబంధిత పాలసీలో ఉన్న నిబంధనలపై అవగాహనా పెంచుకోవాలి. అవసరమైతే పాలసీలపై అవగాహనా ఉన్న వారిని సంప్రదించడం మేలు.

English summary

అలాంటి బీమా ఏజెంట్ల వలలో పడకుండా ఇలా చేయండి.. | Don't Fall for Insurance Mis selling Trap

Getting calls from insurance companies/agents is a common feature these days. No matter how hard you try, it's almost impossible to avoid.
Story first published: Saturday, August 24, 2019, 9:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X