For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ జీవన్ ఆధార్: రూ.341 చెల్లిస్తే రూ.లక్ష గ్యారంటీ, రూ.5.4 లక్షల వరకు గ్యారంటీ

|

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరసమైన పాలసీలు అందివ్వడమే కాకుండా మెచ్యూరిటీపై హామీ రాబడిని అందిస్తుంది. అలాంటి ఎల్ఐసీ పాలసీల్లో జీవన్ ఆధార్ ప్లాన్ ఒకటి. ఈ పాలసీ ప్లాన్ ముఖ్య అంశాలలో ప్రీమియం నెలకు రూ.341 నుండి ప్రారంభమవుతుంది. హామీ రాబడి రూ.1 లక్ష నుండి మొదలవుతుంది. మీ ప్రీమియం ఎంత ఎక్కువగా ఉంటే, రాబడి అంత ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రయోజనాలు...

ఈ ప్రయోజనాలు...

ఈ ప్లాన్ మెచ్యూరిటీ పైన ఉపసంహరణతో యాన్యుటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. కానీ, ఇది భారీ పన్ను ప్రయోజనాలు కలిగిస్తుంది. దీంతో జీవన్ ఆధార్ ప్లాన్ అందర్నీ మరింత ఆకట్టుకుంటుంది. పాలసీదారుల కేటగిరీని బట్టి ఈ ప్లాన్ కింద రూ.75,000 నుంచి రూ.1,25,000 వరకు పన్ను ప్రయోజనాలను ఉంటాయి.

ప్రీమియంలు ఇలా చెల్లించవచ్చు

ప్రీమియంలు ఇలా చెల్లించవచ్చు

LIC ప్రకారం... ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 డిడిఎలో పేర్కొన్న విధంగా వికలాంగుల బాధ్యతలు చూసుకునే వారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ జీవితకాలమంతా బీమా రక్షణను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలు వికలాంగుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్లాన్ కింద చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 డిడిఎ కింద ఆదాయపు పన్ను ఉపశమనం ఉంటుంది. ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీ ప్రీమియంలను ఎంచుకోవచ్చు.

ప్రతి ఏడాదికి రూ.1000కు రూ.100 యాడ్

ప్రతి ఏడాదికి రూ.1000కు రూ.100 యాడ్

పాలసీ వ్యవధి 10, 15, 20, 25, 30, 35 సంవత్సరాల లేదా మరణించే వరకు.. ఏ టర్మ్‌లు అయినా ప్రీమియంను ఆధారంగా ఎంచుకోవచ్చు. ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించవచ్చు. 22 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ పాలసీకు అర్హులు. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి ఏడాది రూ.1000కి రూ.100 యాడ్ అవుతుంది. 65 ఏళ్ల వరకు లేదా మృతి చెందే వరకు వర్తిస్తుంది. పాలసీని సరెండర్ చేయలేం. పాలసీపై రుణ సదుపాయం లేదు. హౌసింగ్ లోన్ మినహాయింపు ఉంది.

మినిమం... మ్యాగ్జిమం..

మినిమం... మ్యాగ్జిమం..

ఏడాదికి రూ.4,095 మినిమం ప్రీమియం చెల్లిస్తే రూ.1 లక్ష గ్యారంటీ రిటర్న్ ఉంది. అంటే నెలకు రూ.341 అవుతుంది. గరిష్టంగా రూ.61,425 ప్రీమియం చెల్లిస్తే గ్యారెంటీ రిటర్న్ రూ.2.40 లక్షల నుంచి రూ.5.40 లక్షల వరకు ఉంది. ప్రీమియం ఇన్‌స్టాల్‌మెంట్స్ నెలకు రూ.341.25 నుంచి రూ.5,118.75 వరకు చెల్లించాలి.

ముందే మరణిస్తే...

ముందే మరణిస్తే...

పాలసీ తీసుకున్న వ్యక్తి పదేళ్ల వరకు ప్రీమియం చెల్లించి చనిపోతే నామినీకి పాలసీ మొత్తంతో పాటు గ్యారెంటీ అడిషన్స్, టర్మినల్ బోనస్ ఇస్తారు. పాలసీ మొత్తంలో తొలిగా కేవలం 20% నామినీకి వస్తుంది. మిగతా 80 శాతాన్ని పదిహేనేళ్ల పాటు గ్యారంటీ యాన్యుటీ ప్లాన్‌‌ ద్వారా అందిస్తారు. ఒకవేళ వికలాంగులు పాలసీదారుడి కన్నా ముందే మరణిస్తే పాలసీ అంతటితో ఆగిపోతుంది. చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80డీడీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. మినహాయింపు రెండు రకాలుగా ఉంటుంది.

English summary

ఎల్ఐసీ జీవన్ ఆధార్: రూ.341 చెల్లిస్తే రూ.లక్ష గ్యారంటీ, రూ.5.4 లక్షల వరకు గ్యారంటీ | LIC policy: Get guaranteed return of Rs.1 lakh to Rs.5.4 lakh, pay just Rs.341 to Rs.5,118

The Life Insurance Corporation of India (LIC) has a host of policies that can be affordable to anyone and still provide guaranteed returns on maturity.
Story first published: Thursday, July 25, 2019, 14:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X