For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10 లక్షల లోన్ ఆఫర్ చేస్తున్న ముథూట్: అర్హతలు ఇవే!

|

ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ పరిధిలోని తమ కస్టమర్లకు ఇచ్చే పర్సనల్ లోన్ స్కీంను మరింత విస్తరిస్తున్నామని ముథూట్ ఫైనాన్స్ మంగళవారం నాడు వెల్లడించింది. శాలరైడ్ క్లాస్‌కు రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. రూ.1 నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చే ఈ లోన్ పైన వడ్డీ రేటు 13.5 నుంచి 23 శాతం వరకు ఉంటుంది. ప్రయివేటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు లక్ష్యంగా ఈ పర్సనల్ లోన్‌ను విస్తరించింది. 24-58 వయస్సు మధ్య ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటున్నారు.

క్రెడిట్ హిస్టరీ, కేవైసీ చెక్స్, సిబిల్ స్కోర్ ఆధారంగా కస్టమర్లకు పర్సనల్ లోన్ ఇస్తుంది. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్‌తో వేగవంతంగా, మరింత సులభ పద్ధతిలో లోన్ ఇవ్వనున్నారు.

Muthoot Finance offers loan of up to Rs 10 lakh to salaried class in Delhi, NCR

ఇది యూనిక్ ఆఫర్ అని, ఇది శాలరైడ్ క్లాస్‌కు మినిమం డాక్యుమెంట్స్‌తో ఇస్తున్నామని ముథూట్ ఫైనాన్స్ తెలిపింది. లోన్ అమౌంట్ కూడా 48 గంటల్లో ఇస్తున్నట్లు పేర్కొంది. మార్చి 2021 నాటికి అన్ని కేటగిరీల్లోని కస్టమర్లను పెంచుకోవాలని ముథూట్ చూస్తోంది. రూ.10 లక్షల లోన్ ఢిల్లీ, ఎన్సీఆర్ వేతనజీవులకు వర్తిస్తుందని, మరికొద్ది రోజుల్లో ఈ స్కీంను ఉత్తర భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు వర్తింప చేస్తామని తెలిపింది.

ముథూట్ కేరళ బేస్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా 282 బ్రాంచీలు ఉన్నాయి. మార్చి 2019 నాటికి 38,303 కోట్ల అసెట్స్ ఉన్నాయి. ముథూట్ ఫైనాన్స్‌కు కోట్లాది మందికి లోన్ ఇచ్చింది. ప్రతి రోజు రెండు లక్షల మంది కస్టమర్లు ముథూట్ ఫైనాన్స్‌కు వస్తారు. కనీసం రూ.20,000 వేతనం తీసుకునే శాలరైడ్ ఉద్యోగులకు పైన చెప్పిన లోన్ వర్తిస్తుంది.

English summary

రూ.10 లక్షల లోన్ ఆఫర్ చేస్తున్న ముథూట్: అర్హతలు ఇవే! | Muthoot Finance offers loan of up to Rs 10 lakh to salaried class in Delhi, NCR

Under this, Muthoot Finance will give unsecured loans of Rs 1-10 lakh at an interest rate of 13.5-23 per cent to salaried class only, the company said at an event here.
Story first published: Wednesday, May 22, 2019, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X