For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొద్దిపాటి పెట్టుబడితో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఈ దారిని ఎంచుకోండి

|

డబ్బులు సంపాదించాలంటే మన చేతుల్లో మన వద్ద లక్షల రూపాయలు ఉండాలి. అయితే కొద్ది మొత్తాలతో కూడా ఈక్విటీ ఓరియెంటెడ్ వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా, సిస్టమెటిక్ ప్లాన్‌తో ముందుకు వెళ్ళినా లాంగ్ పీరియడ్‌లో మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఇందుకు సిస్టమెటిక్ ‌అచీవ్‌మెంట్ ప్లాన్ అవసరం. ఈక్విటీ మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలంటే కచ్చితమైన ప్లాన్ ఉండాలి. ఈక్విటీ ఫండ్స్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నేళ్లకు మీకు మంచి రిటర్న్స్ రావొచ్చు. స్టాక్ మార్కెట్‌తో లింక్ కారణంగా ఈక్విటీ షేర్లు ఫ్లక్చువేట్ అవుతాయి. షార్ట్ టర్మ్‌లో ఇది అటు ఇటుగా ఉన్నప్పటికీ.. లాంగ్ టర్మ్‌లో మాత్రం ఎక్కువ ఈక్విటీలు లాభంగా ఉంటాయి. సిస్టమెటిక్ ‌అచీవ్‌మెంట్ ప్లాన్ ద్వారా ఈక్విటీలో పెట్టుబడి రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి మార్గం.

<strong>ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి</strong>ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి

 సిస్టమెటిక్ ‌అచీవ్‌మెంట్ ప్లాన్

సిస్టమెటిక్ ‌అచీవ్‌మెంట్ ప్లాన్

రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సిస్టమెటిక్ ‌అచీవ్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యుచువల్ ఫండ్స్‌లలోను పెట్టుబడులు పెట్టవచ్చు. నెలకు కనీసం రూ.1000 ఇన్వెస్ట్ చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన స్కీంలలో నెలకు రూ.500 కూడా పెట్టవచ్చు. కాబట్టి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.అలాగే, మీరు నెల వాయిదా చెల్లించేందుకు ప్రత్యేకంగా తేదీని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మీ బ్యాంకు అకౌంట్ నుంచి ప్రతి నెల డబ్బులు డిడక్ట్ అవుతాయి. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మీకు సంపదను తెచ్చిపెడుతుంది.

 లాంగ్ టర్మ్‌లో లాభదాయకం

లాంగ్ టర్మ్‌లో లాభదాయకం

సిస్టమెటిక్ ‌అచీవ్‌మెంట్ ప్లాన్ ద్వారా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే.. కొన్ని మార్కెట్లు బాగా లాభపడవచ్చు. మరికొన్ని నష్టాల్లోకి వెళ్లవచ్చు... లేదా హెచ్చు తగ్గులు లేకుండా కొనసాగవచ్చు. కానీ యావరేజ్ ఔట్ కాస్ట్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా పెట్టుబడు పెట్టడానికి మీ వద్ద పెద్ద మొత్తం ఉండవలసిన అవసరం లేదు. అలాగే మీ వద్ద ఉన్న కొద్ది మొత్తంతో త్వరగా ఇన్వెస్ట్ ప్రారంభించవచ్చు. లాంగ్ టర్మ్‌లో దీంతో మంచి రిటర్న్స్ రావొచ్చు.

 చిన్న మొత్తంతో కోటీశ్వరులు కావొచ్చు!

చిన్న మొత్తంతో కోటీశ్వరులు కావొచ్చు!

ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. మీరు నెలకు రూ.5,000 చొప్పున 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. సీఏజీఆర్ (అస్యూమింగ్ ఏ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 15 శాతంగా ఉంటే ఇరవై అయిదేళ్లకు మీరు రూ.1 కోటికి పైగా జమ చేయవచ్చు. అంటే నెలకు రూ.5వేల కనీస మొత్తం పెట్టుబడిగా పెట్టడం ద్వారా కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ ఉంది.

English summary

కొద్దిపాటి పెట్టుబడితో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఈ దారిని ఎంచుకోండి | Want to become a crorepati through small investments? know its benefits

Like recurring deposits (RD), investment through a SIP is possible with small amounts. You can start investing in mutual funds through a SIP with amount as low as Rs 1,000 per month or in case of certain schemes, even with Rs 500 per month.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X