For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక్కడ పెట్టుబడి పెట్టండి: వడ్డీగా నెలకు రూ.వేలు సంపాదించండి, ఇలా చేయాలి

|

సురక్షితమైన పెట్టుబడులు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం ఉత్తమమని చాలామంది భావిస్తారు. సురక్షిత మంత్లీ రిటర్స్‌కు ఈ రెండు స్కీంలు పాపులర్. సురక్షితమైన పెట్టుబడి, నెల నెలా స్థిర రాబడి ఇచ్చే పథకాలు ఇవి. నెలనెలా ఆదాయం కోరుకునే వారికి ఇవి అనుకూలం. విశ్రాంత ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ఇవి సరిపోతాయి. ఇందులోని పీవోఎంఐఎస్ ఖాతా గురించి తెలుసుకుందాం.

మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఇలా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చుమీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఇలా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం (పీవోఎంఐఎస్)

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం (పీవోఎంఐఎస్)

పీవోఎంఐఎస్ స్కీం కాల పరిమితి అయిదేళ్లు. దీనికి సంబంధించి వడ్డీ రేటు ఎప్పటికి అప్పుడు క్వార్టర్లీ బేసిస్ ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు ఏడాదికి 7.3 శాతంగా ఉంది. ఏక వ్యక్తి ఖాతా (సింగిల్ అకౌంట్) అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు, ఉమ్మడి ఖాతా (జాయింట్ ఖాతా) అయితే గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. వడ్డీ 7.3 శాతంగా ఉంది. ఈ సమయంలో ఎవరైనా రూ.5 లక్షలను ప్రిన్సిపుల్ అమౌంట్‌గా ఇన్వెస్ట్ చేస్తే వారికి వడ్డీగా రూ.1,82,500 వస్తుంది. అంటే నెలకు రూ.3,041 అవుతుంది. రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ మొత్తం 3,28,500 అవుతుంది. అంటే నెలకు రూ.5,475 అవుతుంది.

పీవోఎంఐఎస్‌ ఖాతాను ఇలా ప్రారంభించవచ్చు

పీవోఎంఐఎస్‌ ఖాతాను ఇలా ప్రారంభించవచ్చు

పీవోఎంఐఎస్‌లో ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత కూడా నామినీని ప్రతిపాదించవచ్చు. నామినీగా ఎవరినైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం ఉంది. ఖాతను ప్రారంభించడానికి ఇవి అవసరం.... పూర్తి వివరాలు నింపిన ఎంఐఎస్ ఫారంతో పాటు చిరునామా, గుర్తింపు పత్రాలు. రెండు ఫోటోలు పోస్టాఫీస్‌లో సమర్పించారు. ఖాతాను నగదు/చెక్కు ద్వారా చెల్లించవచ్చు. అయితే ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయ సంతకం అవసరం. ఓ ఖాతాదారు ఎన్ని ఎంఐఎస్ ఖాతాలు అయినా తెరవవచ్చు. అయితే అన్ని ఖాతాల మొత్తం 4.5 లక్షలకు మించరాదు. కనీస పెట్టుబడి రూ.1500తో ప్రారంభించవచ్చు. నెలవారీ ఆదాయ పథక ఖాతాకు పాస్‌బుక్ అందిస్తారు. ఈ ఖాతాను ఓ పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు బదలీ చేయవచ్చు.

పీవోఎంఐఎస్‌ ఖాతాను ముందుగా మూసివేస్తే

పీవోఎంఐఎస్‌ ఖాతాను ముందుగా మూసివేస్తే

డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్ మొత్తం సొమ్ము నుంచి రెండు శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి అయిదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్ పైన ఒక శాతం కోత ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుంచి ఖాతాదారుకు నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ పోస్టాఫీసు నుంచి నేరుగా తీసుకోవచ్చు లేదా మన పొదుపు ఖాతాలో లేదా బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. వడ్డీ సొమ్మును విత్ డ్రా చేసుకోకపోతే అదనంగా దానిపై వడ్డీ జమ అవదు. మెచ్యూరిటీ తీరాక మొత్తం డబ్బు చెల్లిస్తారు.

English summary

ఇక్కడ పెట్టుబడి పెట్టండి: వడ్డీగా నెలకు రూ.వేలు సంపాదించండి, ఇలా చేయాలి | Investment in Bank Post Office MIS: Here is how much monthly income you will get

Popular and safe investment products such as post office monthly income scheme come with the option of monthly returns.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X