ప్రతి ఉద్యోగి కనీస వేతనంలో 12 శాతం డబ్బును భవిష్యత్తు కోసం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో జమ చేస్తారు. అందుకు సమానమైన మొత్తాన్ని మీ పేరిట పీఎఫ్ ఖాతాకు యాజమాన్యాలు కూడా జమ చేస్తాయి. ఉద్యోగ విరమణ అనంతరం జీవితం సాఫీగా సాగేందుకు పీఎఫ్ సదుపాయం ఎంతో ప్రయోజనకరం. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పీఎఫ్ అకౌంట్‌లో మీరు మీ సొమ్మును రెండింతలు జమ చేసుకోవచ్చుననే విషయం మీకు తెలుసా?

పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రెండింతలు చేసుకోవచ్చు
ఇప్పుడు దాదాపు అందరూ ప్రస్తుతం కంటే, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. పీఎఫ్ అకౌంట్ అందుకు ఎంతో ప్రయోజనకరం. ఎంతోమంది భవిష్యత్తు కోసం వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందులో పీఎఫ్ ఒకటి. మిగతా వాటిల్లో ఇన్వెస్ట్ మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. పీఎఫ్ మాత్రం కంపల్సరీ. ప్రతి ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్ శాలరీ) పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. అంతేమొత్తం యాజమాన్యం జమ చేస్తుంది. కానీ ఉద్యోగి తమ పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను రెండింతలు అంటే 24 శాతం కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. మీ వాటా రెండింతలు పెరగడం, మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం మీ చేతికి వచ్చే వేతనం మాత్రం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోండి.

యజమానికి వర్తించదు
ఉద్యోగి తమ పీఎఫ్‌ను రెండింతలు చేసుకోవచ్చునని, రెండింతలు అంటే అది వంద శాతం అవుతుందని, కానీ ఎంప్లాయర్ (యజమాని) మాత్రం అలా చేయాల్సిన నిబంధన లేదని నిపుణులు చెబుతున్నారు. 12 శాతం వరకు పీఎఫ్ విషయంలో యజమానికి నిబంధనలు ఉంటాయి. కానీ ఉద్యోగి దీనిని రెండింతలు చేసుకుంటే యజమానికి మాత్రం అది వర్తించదని చెబుతున్నారు.

రెండింతలుతో ప్రయోజనాలు
మీ పీఎఫ్ అకౌంట్‌ను రెండింతలు చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగకరం. అలాగే, ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80సి కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కాగా, ప్రస్తుతం ఈపీఎప్ అకౌంట్ డిపాజిట్ పైన 8.65 శాతం వడ్డీ రేటు ఉంది. మీ కాంట్రిబ్యూషన్ రెండింతలు అయితే మీ వడ్డి రేటు పెరుగుతుంది. అలాగే, రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ వచ్చినట్లుగా ఉంటుంది. ప్రస్తుతం మాత్రం చేతికి తక్కువగా వస్తుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications