For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు తీసుకున్నారు.. తిరిగి క‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది?

మీరు ఇల్లు కట్టుకోవడానికో లేదా కారు కొనుక్కోవడానికి లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది? దీని గురించి మీరు ఎపుడైనా ఆలోచించారా? బ్యాంక్ ఏమి చేస్తుంది. రుణాలు తీసుకునే ముందు వాటి వివరాల గురించ

|

మీరు ఇల్లు కట్టుకోవడానికో లేదా కారు కొనుక్కోవడానికి లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది? దీని గురించి మీరు ఎపుడైనా ఆలోచించారా? బ్యాంక్ ఏమి చేస్తుంది. రుణాలు తీసుకునే ముందు వాటి వివరాల గురించి వాటి ఎంపికల గురించి ముందే తెలుసుకోండి.
సొంత ఇల్లు అనేది ప్రతి సామాన్యుడి కల, కోరిక. గతంతో పోలిస్తే, ఈమధ్య కాలంలో, రుణాలతో కలలను నిజం చేసుకోవడం అనేది కాస్త క‌ష్ట‌ప‌డితే సాధ్యమ‌వుతోంది. మొట్టమొదటిసారి మీరు స్వంతంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ముందు మీ విలాసాల‌కు గొళ్ళెం వేయండి. చాలామంది వారి సామర్ధ్యాన్ని బట్టి ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి లోన్ కోసం వెళతారు.
స్వంతంగా ఇల్లు కట్టుకున్న తరువాత, నెలసరి వాయిదా డబ్బు (EMI) ని మీరు చెల్లించ లేకపోతే ఏమవుతుంది? ఉదాహరణకు మీరు ఆసమయంలో ఉద్యోగం పోయినా లేదా మీరు జబ్బుపడి ఉంటే ఊహించుకోండి. మీ ఆర్ధిక పరిస్ధితి పడిపోతుంది. మీరు లోను కట్టలేక పోతారు. ఇలాంటి పరిస్ధితులలో ఏమి చేయాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

1. మీరు సమయానికి EMI చెల్లించక పోతే ఏమవుతుంది?

1. మీరు సమయానికి EMI చెల్లించక పోతే ఏమవుతుంది?

అప్పుల మీద ప్రభావం పడుతుంది

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ యాక్ట్ 2005 ప్రకారం, ఆర్ధిక సంస్ధలకు సంబంధించిన అన్ని రుణాలు, చెల్లించాలి చెల్లింపులు, CIBIL, కూడబెట్టిన యూనిట్ల ఇతర సమాచారం గుర్తించబడుతుంది. మీరు లోన్ తిరిగి చెల్లించక పోతే మీ రుణ విలువ తగ్గిపోతుంది.

2. ఎదుర్కోవడం ఎలా

2. ఎదుర్కోవడం ఎలా

సరైన సమయానికి ఇంటి లోన్ చెల్లించకపోతే, బ్యాంక్ లు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తారు. ఇలాంటి పరిస్ధితులలో బ్యాంక్ ఉన్నతాధికారులతో, తత్సంబంధమైన వారితో వాదించడం సరైనది కాదు. పరిస్ధితులను వివరించి, వారితో గౌరవంగా నడుచుకోవాలి. సాధ్యమైతే, సమస్యను స్నేహపూరిత పద్ధతిలో పరిష్కరించుకోవాలి.

3. లోన్ పునరుద్ధరించడం

3. లోన్ పునరుద్ధరించడం

కొన్ని కేసులలో ఇంటి రుణాలు పూర్తిగా తీరవు. ఒకవేళ అలాంటి పరిస్ధితి వచ్చినపుడు, వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని, ఉద్యోగం పోవడం లేదా జబ్బు పాడడం వంటివి. ఇవి తాత్కాలికమైన పరిస్ధితులు. కాబట్టి బ్యాంక్ ఉన్నతాధికారులను సంప్రదించి, వారికి పరిస్ధితిని వివరించాలి. మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఋణం తీరుస్తానని వారికి హామీ ఇవ్వాలి. మీరు ఇంతకు ముందు ఏదైనా లోను తీసుకుని సరైన సమయానికి చెల్లించి ఉంటె, వాటికి సంబంధించిన ఆధారాలను వారికి చూపించండి. బ్యాంక్ ఉన్నతాధికారులు వాటికి తృప్తిపడితే, వారు మీ లోన్ ని తిరిగి పునరుద్దరిస్తారు.

4. బ్యాంకు అందుకు ఒప్పుకోక‌పోతే...

4. బ్యాంకు అందుకు ఒప్పుకోక‌పోతే...

ఒకవేళ బ్యాంకు మీకు మరికొంత సమయాన్ని ఇవ్వడానికి లేదా లోన్ ని పునరుద్ధరించడానికి తిరస్కరిస్తే, మీరు మరో బ్యాంక్ ను సంప్రదించండి. మరో బ్యాంక్ తక్కువ వడ్డీకి లోన్ ఇస్తే, మీరు ఈ లోన్ ని చెల్లించ వచ్చు.

5. పెట్టుబడులు బదిలీ చేయడం

5. పెట్టుబడులు బదిలీ చేయడం

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీలు వంటి ఏవైనా ఇతర పెట్టుబడులు ఉంటే, మీరు లోన్ చెల్లించలేకపోతే, మీరు ఆ ఫండ్స్ ని వీటికి బదిలీ లేదా మార్చవచ్చు. అలాగే, మీ ఇల్లు చెక్కుచెదర కుండా ఉంటుంది.

6. ఇల్లు వదిలేయండి

6. ఇల్లు వదిలేయండి

మీ ఆస్థిని కాపాడుకునే అవకాశం లేకపోతే, మీరు దాన్ని అమ్మేయండి. బ్యాంకుల కోసం ఎదురు చూడకుండా మీకు మీరే ఈపని చేయవచ్చు. మీరు సరైన వారికి సరైన ధరలో మీ ఇంటికి అమ్మే అవకాశం ఉంది. మంచి ధరకు ఇల్లు అమ్మి, ఇంటి ఋణం చెల్లించి, మిగిలిన డబ్బుతో సిటీ కి దూరంగా ఉన్న కొత్త ఇంటిని కొనుక్కోండి.

7. రుణగ్రస్తులకు కొన్ని అధికారాలు

7. రుణగ్రస్తులకు కొన్ని అధికారాలు

మీరు బ్యాంక్ డబ్బును చెల్లించడానికి మీరు మీ అధికారాలను వదిలేయాల్సిన అవసరం లేదు. ఆస్ధిని అమ్మే ముందు, బ్యాంక్ లు రుణగ్రస్తులకు తగినంత సమయాన్ని ఇస్తుంది. లోన్ చెల్లించ కుండా కనీసం 90 రోజులు గడిస్తే, అది NPA గా భావిస్తారు. బ్యాంక్ లు 60 రోజుల తరువాత నోటీసు పంపిస్తారు. అంటే, మీరు చెల్లించడానికి రెండు నెలల గడువు ఉంటుంది. మీ కాలపరిమితి మరో 30 రోజులు పొడిగించిన తరువాత, ఆస్ధిని వేలం వేసే హెచ్చరికతో ఒక నోటీసు ఇస్తారు. ఒకవేళ ఆస్థిని అమ్మకానికి వచ్చినపుడు, బ్యాంక్ లు ఆస్ధిని విలువ కట్టడానికి వాల్యుఎటర్ ని పంపిస్తారు. అంతేకాకుండా, ఎప్పుడి, ఎక్కడ, ఆయిల్లు ఇంతకు వేలం వేయబడుతుంది అనే వివరాలను నోటీసులో పొందుపరుస్తారు. మీరు ఆ ధర సరైనది కాదు అని భావిస్తే, మీ అభ్యంతరాలను వారికి తెలియచేయవచ్చు. ఒక ఏడు రోజులలో బ్యాంక్ దీనికి స్పందిస్తుంది. మీరు వారికీ మంచి ధర చూపిస్తే, బ్యాంక్ మరలా దాని గురించి ఆలోచిస్తుంది.

8. వ్యక్తిగత రుణాలు

8. వ్యక్తిగత రుణాలు

ఒకవేళ అది వ్యక్తిగత రుణమైతే, సమయానికి EMI చెల్లించక పోతే వత్తికి ఎక్కువగా ఉంటుంది. ప్రీతీ గార్గ్ అనే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి, సరైన తేదీకి EMI చెల్లించకపోతే, బ్యాంక్ నుండి అదేపనిగా ఫోన్లు వస్తూ ఉంటాయని వివరించాడు. వారు అతని కార్యాలయానికి కూడా వచ్చారు. వారిని మీరు ఇదొక ప్రమాణం చేసి పంపినా, సమస్య తీరదు. అది ఆరోజు వరకే ఉంటుంది. ఇదే పరిస్ధితి మర్నాడు ఎదురవుతుంది. మీరు 30రోజుల తర్వాత కూడా చెల్లించకపోతే, ఆ వత్తిడి పెరుగుతుంది. వారు మర్యాదపూర్వకంగా మిమ్మల్ని అడుగుతూ, మీపై వత్తిడి తెస్తారు.

తిరిగి చెల్లించని పరిస్ధితుల్లో 60 రోజులు దాటినా తరువాత పరిస్ధితులు అధ్వాన్నంగా ఉంటాయి. లోన్ కట్టమని ఎవరైనా అడగవచ్చు, కాల్ చేయవచ్చు. రాత్రి లేదా పగలు తేడా లేకుండా ఎటువంటి పరిస్దితులలోనైనా కాల్స్ రావొచ్చు. మీరు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ (NBFC) నుండి లోన్ తీసుకుంటే, పరిస్ధితి ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. డబ్బు వసూలు చేసే పనివారు మీ ఇంటికి, కార్యాలయానికి కూడా వస్తారు. వారు విషయాన్నీ వార్తపత్రికల లాగా సోషల్ మీడియాలో పెడతారు. 90 రోజుల గడువు పూర్తి అయితే, ఆస్ది NPA లోకి వెళితే, అది ప్రత్యేక ఏజెన్సీ కి అప్పగిస్తారు. ఈ ఏజెన్సీల వల్ల మనశికమైన, సంఘపరమైన వత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రమాదం కూడా. అప్పటికీ మీరు చెల్లించకపోతే, సెక్షన్ 58 కింద కోర్ట్ నోటీసు కూడా అందుకుంటారు, ఇది శిక్షార్హమైనది.

 గృహ రుణం తీసుకునేవారు చేయ‌కూడ‌ని త‌ప్పులు

గృహ రుణం తీసుకునేవారు చేయ‌కూడ‌ని త‌ప్పులు

 గృహ రుణం తీసుకునేవారు చేయ‌కూడ‌ని త‌ప్పులు గృహ రుణం తీసుకునేవారు చేయ‌కూడ‌ని త‌ప్పులు

మ్యూచువ‌ల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ కు అనువైన 10 వేదిక‌లు

మ్యూచువ‌ల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ కు అనువైన 10 వేదిక‌లు

మ్యూచువ‌ల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ కు అనువైన 10 వేదిక‌లుమ్యూచువ‌ల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ కు అనువైన 10 వేదిక‌లు

Read more about: loan repayment
English summary

అప్పు తీసుకున్నారు.. తిరిగి క‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది? | What happens when you don't repay loans

though loan makes one comfortable in buying a house, it also becomes a long term liability which needs to be managed properly. In today’s kind of uncertain scenario where jobs are not secured and sedentary lifestyle has exposed us to many health problems, managing a long term liability is a big task. Moreover when there are other responsible goals too, which one has to save for.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X