For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ కు అనువైన 10 వేదిక‌లు

కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు వీటిలో ఇన్వెస్ట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌నిగా ఉండేది. కేవైసీ విధానాన్ని ఆయా వెబ్‌సైట్ల‌లోన‌మోదుచేయాలి. కానీ ఇప్పుడు అనేక ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్స్‌లో పెట్టేందుకు అనుమ‌తి

|

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రెండు ర‌కాలుగా ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు. ఒక‌టి మ‌ధ్య‌వ‌ర్తులు లేదా బ్యాంకుల ద్వారా మ‌రొక‌టి మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్ల ద్వారా నేరుగా డైరెక్ట్ ప్లాన్లనో పెట్ట‌వ‌చ్చు. అధిక రాబ‌డుల కోసం డైరెక్ట్ ప్లాన్ల‌ను ఎంచుకోవ‌డం మంచి విధానం. కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు వీటిలో ఇన్వెస్ట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌నిగా ఉండేది. కేవైసీ విధానాన్ని ఆయా వెబ్‌సైట్ల‌లోన‌మోదుచేయాలి. కానీ ఇప్పుడు అనేక ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్స్‌లో పెట్టేందుకు అనుమ‌తిస్తున్నాయి. ఈ క‌థ‌నంలో అలాంటి 10 ఉత్త‌మ‌మైన ప్లాట్‌ఫామ్‌ల‌ను తెలియ‌జేస్తున్నాం.

1. నేరుగా సంస్థ వెబ్‌సైట్ నుంచే...

1. నేరుగా సంస్థ వెబ్‌సైట్ నుంచే...

అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌లు సొంతంగా పోర్ట‌ళ్ల‌ను క‌లిగి ఉన్నాయి. ఎంపిక చేసుకున్న మ్యూచువ‌ల్ ఫండ్ ఆన్‌లైన్ పోర్ట‌ల్‌కు వెళ్లాలి. సొంతంగా పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవాలి. ఇందుకోసం ద‌ర‌ఖాస్తు ఫారంలో ఉన్న ప్రాథ‌మిక వివ‌రాల‌న్నీ నింపాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ మోడ్‌ను డైరెక్ట్‌గా ఎంచుకోవాలి. ఈ సంస్థ‌లు ఎలాంటి ఫీజును వ‌సూలుచేయ‌రు. ఖాతా తెరిచాక ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించేందుకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏ ఫండ్‌కు సంబంధించి విడిగా ఆ సంస్థ‌కు చెందిన వెబ్సైట్‌ను చూడాల్సి ఉంటుంది.

2. మ్యూచువ‌ల్ ఫండ్ యుటిలిటీ ద్వారా...

2. మ్యూచువ‌ల్ ఫండ్ యుటిలిటీ ద్వారా...

మ్యూచువ‌ల్ ఫండ్ యుటిలిటీ అనేది అన్ని ఫండ్ హౌజ్‌ల‌కు వేదిక‌గా ఉంటుంది. ఇవ‌న్నీ మౌలిక స‌దుపాయాల‌ను పంచుకుంటాయి. మ‌దుప‌రుల‌కు ఆన్‌లైన్‌లో నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌డంలో ఇది స‌హ‌క‌రిస్తుంది. వీటి నిర్వ‌హ‌ణ కోసం నిధుల‌ను ఆయా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లే అందిస్తుంటాయి. దీని వెబ్‌సైట్ www.mfuindia.com. కామ‌న్ అకౌంట్ నెంబ‌ర్‌(క్యాన్) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇది విశిష్ట సంఖ్య‌. అన్ని పెట్టుబ‌డుల‌ను ఈ సంఖ్య‌తో ట్రాక్ చేసుకునే వీలు క‌లుగుతుంది. ఇది కూడా ఎలాంటి ఫీజు వ‌సూలు చేయ‌దు.

3. కార్వీ ప్లాట్‌ఫామ్‌

3. కార్వీ ప్లాట్‌ఫామ్‌

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు మీకు మ‌ధ్య వార‌ధిలా కార్వీ నిలుస్తుంది. మ‌దుప‌రుల‌కు సంబంధించిన అన్ని రికార్డుల‌ను, ద‌ర‌ఖాస్తుల‌ ప్రాసెసింగ్ ను నిర్వ‌హిస్తుంటుంది. ఐతే కేవ‌లం కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీల‌కే కార్వీ సేవ‌లు ప‌రిమిత‌మయ్యాయి. కార్వీ ద్వారా నిర్మించుకున్న పోర్ట్‌ఫోలియోను ఒకే ద‌గ్గ‌ర చూసుకునే వెసులుబాటు ఉంది.

4. మై క్యామ్స్‌

4. మై క్యామ్స్‌

కంప్యూట‌ర్ ఏజ్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యామ్స్‌) ... ఇదీ ఆన్‌లైన్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా డైరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో నేరుగా పెట్ట‌వ‌చ్చు. ఐతే 15 కంపెనీల‌కు చెందిన సేవ‌ల‌నే క్యామ్స్ అందిస్తుంది. ఈ స‌దుపాయం ఉచితం. పైగా వీటికి సంబంధించిన క‌న్సాలిడేటెడ్ స్టేట్‌మెంట్ల‌ను పొందొచ్చు.

5. మ‌నీ ఫ్రంట్ ప్లాట్‌ఫామ్‌

5. మ‌నీ ఫ్రంట్ ప్లాట్‌ఫామ్‌

ఇది మ‌రో ఆన్‌లైన్ వేదిక‌. మ‌దుప‌ర్ల‌కు వివిధ ర‌కాల సేవ‌ల‌ను అందిస్తుంటుంది. ఆన్‌లైన్ సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. వివిధ ఫండ్ల మ‌ధ్య డైరెక్ట్ ప్లాన్‌ల‌కు రెగ్యుల‌ర్ ప్లాన్ కు రాబ‌డుల్లో ఉండే తేడాను విశ్లేషించి చూపిస్తుంది.

6. జెరోధా కాయిన్‌

6. జెరోధా కాయిన్‌

ఈ వేదిక ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. రూ.25వేల దాకా ఉచితంగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఆ త‌ర్వాత నెల‌కు కేవ‌లం రూ.50 ఛార్జీగా వ‌సూలుచేస్తారు.

7. భ‌రోసా అడ్వ‌యిజ‌ర్‌

7. భ‌రోసా అడ్వ‌యిజ‌ర్‌

ఇది సెబీ ద్వారా రిజిస్ట్రేష‌న్ పొందిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వ‌యిజ‌ర్‌. తుల‌నాత్మ‌క‌, నాణ్య‌మైన స‌ల‌హాల‌ను ఇచ్చే వేదిక ఇది. క‌మిష‌న్ ఏదీ చెల్లించ‌క్క‌ర్లేకుండా మ‌దుప‌రులు ఎక్కువ సంపద సృష్టించుకునే వీలు క‌లుగుతుంది.

8. క్లియ‌ర్ ఫండ్స్‌

8. క్లియ‌ర్ ఫండ్స్‌

స్టాటిస్టిక‌ల్ అల్గారిథ‌మ్‌ల‌ను విశ్లేషించి చూపించ‌డం వ‌ల్ల మ‌దుప‌రులకు డైరెక్ట్ ప్లాన్ల పైన మంచి అవ‌గాహ‌న క‌లుగుతుంది. క్లియ‌ర్ ఫండ్స్ వారు వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యం పొంది ప్ర‌తి ఫండ్‌ను క్షుణ్ణంగా, లోతుగా అధ్య‌యనం చేస్తుంది. ప్ర‌తి మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్ పైన ఫ్లాట్ రేటుగా రూ.200 వ‌సూలు చేస్తారు.

9. ఎక్స్‌పో వెల్త్

9. ఎక్స్‌పో వెల్త్

ఆన్‌లైన్ పెట్టుబ‌డుల‌కు మూడు విభాగాల‌ను ఎక్స్‌పో వెల్త్ అందిస్తుంది. మొద‌టిది బేసిక్ ప్లాన్‌. ఇది పూర్తిగా ఉచితం. దీంట్లో కొన్ని డైరెక్ట్ స్కీమ్‌లు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. రెండోది రూ.149 ప్లాన్‌. ప్ర‌తి లావాదేవికి రూ.149 ఛార్జ్ చేస్తారు. దీని ద్వారా 600 ర‌కాల డైరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌ల నుంచి ఎంచుకోవ‌చ్చు. మూడోది ప్రీమియం ప్లాన్‌. నెల‌కు రూ.149 వ‌సూలుచేస్తారు. ఆ నెల‌లో లెక్క‌లేనన్ని లంప్‌స‌మ్ సొమ్ము, సిప్‌ల‌ను ప్రారంభించుకోవ‌చ్చు.

10. కువేరా

10. కువేరా

పెట్టుబ‌డుల‌కు స‌ల‌హాదారు సంస్థ‌గా సెబీ వ‌ద్ద రిజిస్ట‌ర్ పొందింది. వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల నుంచి ఎన్నో ర‌కాల ఫండ్ల‌ను ఎంచుకునే వెసులుబాటును క‌ల్పిస్తుంది. ఇది అందించే సేవ‌ల‌కు ఎలాంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌దు.

 ముగింపు

ముగింపు

అన్ని తెలుసుకునే ముందుకు సాగండి

మ‌న‌దేశంలో మ‌దుపరులు నేరుగా డైరెక్ట్ ప్లాన్స్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు కొన్ని ప్లాట్‌ఫామ్‌లు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. వివిధ ప్లాట్‌ఫామ్‌లు విభిన్న‌మైన వ్యాపార స‌ర‌ళిని అనుస‌రిస్తున్నాయి. కొన్నేమో ఫ్లాట్ రేటును విధిస్తుండ‌గా మ‌రికొన్ని ప్ర‌తి లావాదేవీకి ఇంత చొప్పున చార్జీ చేస్తున్నాయి. మ‌రి అవేమిటో స్ఫ‌ష్టంగా తెలుసుకుని ముందుకు సాగండి

English summary

మ్యూచువ‌ల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ కు అనువైన 10 వేదిక‌లు | Top 10 Best Platforms to invest in Direct Mutual Funds Online

direct platforms to invest in mutual funds
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X