English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

దేశంలో 7 సుర‌క్షితమైన‌ పెట్టుబ‌డులు

Written By:
Subscribe to GoodReturns Telugu

ఆర్థిక భ‌ద్ర‌త కోసం ప్ర‌తి ఒక్క‌రికీ పొదుపు అనేది అవ‌స‌రం. పెద్ద మొత్తంలో రాబ‌డులు సాధించేందుకు పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయి. సంపాదించిన డ‌బ్బే కాకుండా దాన్ని పెట్టుబ‌డి పెట్టి అధిక రాబ‌డులు సాధిస్తేనే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకోగ‌లుగుతారు. మీ సంప‌ద‌ను పెంచుకునేందుకు క్ర‌మ ప‌ద్ద‌తిలో పెట్టుబ‌డి పెడితే చాలు. అంతే కానీ నెల‌వారీ సంపాద‌నే ఎక్కువ‌గా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. మీరు సంపాదిస్తున్న దానిలో ఎంత పొదుపు చేస్తున్నార‌నే విష‌యాన్ని గ‌మ‌నించుకోవాలి. మీరు పెట్టుబ‌డి పెట్టేందుకు సిద్ద‌మైతే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని న‌ష్ట భ‌యం లేని పెట్టుబ‌డుల‌ను ఇక్క‌డ చూద్దాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పెద్ద‌గా న‌ష్ట‌భ‌యం లేకుండా ఎక్కువ మంది ఎంచుకునే ఆప్ష‌న్ ఫిక్స్‌డ్ డిపాజిట్. పొదుపు ఖాతాతో పోలిస్తే ఇందులో మంచి రాబ‌డులే ఉంటాయి. ఇప్పుడు చాలా బ్యాంకులు 7 నుంచి 8% రాబ‌డుల‌ను ఎఫ్‌డీల‌పై అందిస్తున్నాయి. ఎఫ్‌డీల విష‌యంలో ప‌న్ను ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు ఎక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటో ఎఫ్‌డీల ద్వారా వ‌చ్చే రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది.

రిక‌రింగ్ డిపాజిట్లు

రిక‌రింగ్ డిపాజిట్లు

నెల‌వారీ ఆదాయం సంపాదించే వారు కొంచెం కొంచెంగా పొదుపు చేయాల‌నుకుంటే ఇది ఒక మంచి ఆప్ష‌న్. అయితే ఇవి కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే ఏమంత ప్ర‌త్యేకం కాదు. ప్ర‌తి నెలా నిర్ణీత మొత్తాన్ని త‌ప్ప‌నిస‌రిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాలంతో పాటు ఒక స‌మ‌యానికి పెద్ద మొత్తం సులువుగా జ‌మ‌య్యేందుకు ఆర్‌డీ బాగా దోహ‌ద‌ప‌డుతుంది. అయితే ఇవి కూడా ఎఫ్‌డీల‌లాగానే ప‌న్ను కోత‌కు గుర‌వుతాయి.

 పోస్టాఫీసు డిపాజిట్లు

పోస్టాఫీసు డిపాజిట్లు

బ్యాంకు డిపాజిట్ల‌లో వ‌డ్డీ త‌క్కువ అనుకునే వారికి కాస్త ఎక్కువ రాబ‌డినిచ్చేవి పోస్టాఫీసు డిపాజిట్లు. వీటిల్లో క‌నీస కాల‌ప‌రిమితి మొద‌లుకొని గ‌రిష్టంగా 5 ఏళ్ల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టేలా వివిధ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు ఉన్నాయి. కాల‌ప‌రిమితి ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ప‌థ‌కాలు ఎక్కువ వ‌డ్డీని అందిస్తాయి. ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ఐదేళ్ల పోస్టాఫీసు డిపాజిట్ల‌లో 7.8% దాకా వ‌డ్డీని అందిస్తున్నారు.

ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ డిపాజిట్లు

ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ డిపాజిట్లు

ఒక నిర్ణీత కాలం పాటు పెట్టుబ‌డి పెట్టి ఉంచాల్సిన క్లోజ్ ఎండెడ్ స్కీమ్ ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌. ఇది ఒక నెల నుంచి మొద‌లుకొని 5 ఏళ్ల వ‌ర‌కూ పెట్టుబ‌డిని పెట్టి ఉంచేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లో పెట్టుబడి పెట్టిన డ‌బ్బును ఆయా సంస్థ‌లు షేర్లు, డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడ‌తాయి. ఈ ప్లాన్ల‌న్నింటికీ ఒక ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. అయితే పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు జాగ్ర‌త్తగా ఉండి AAA రేటింగ్ ఉన్న ప్లాన్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది.

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు

డెట్ మ్యూచువల్ ఫండ్లు ఆయా ఫండ్ల‌లోని సొమ్మును తిరిగి కార్పొరేట్ బాండ్లు, ప్ర‌భుత్వ షేర్ల‌లో పెట్టుబ‌డిగా పెడ‌తాయి. వాటికి ఒక నిర్ణీత కాల‌ప‌రిమితి అంటూ ఉండ‌దు. డెట్ ఫండ్ల‌లో మీ పెట్టుబ‌డిని మీకు కావాల్సిన‌ప్పుడు వెన‌క్కు తీసుకోవచ్చు. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న క్ర‌మంలో దీర్ఘ‌కాలిక ప్లాన్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

కంపెనీ డిపాజిట్లు

కంపెనీ డిపాజిట్లు

కంపెనీ డిపాజిట్లు బ్యాంకు డిపాజిట్ల‌తో పోలిస్తే కాస్త అధిక రిస్క్ క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఎక్కువ వ‌డ్డీని, ఎక్కువ రాబ‌డుల‌ను అందిస్తాయి. పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు మంచి రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోవాలి. దీర్ఘ‌కాలం పాటు పెట్టుబడి పెట్టే విధంగా ఉంటే కంపెనీ డిపాజిట్లు మేలు.

 ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్):

ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్):

ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం, ఇల్లు కొనుగోలు వంటి దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు ఉన్న వారికి పీపీఎఫ్ అనేది దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి సాధ‌నంగా ఉప‌యోగ‌పడుతుంది. ఇందులో రాబ‌డి రేట్లు 8 నుంచి 9 శాతం ఉంటాయి. పీపీఎఫ్‌లో ఏడాదికి క‌నీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 వేల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఇంకా పీపీఎఫ్ హామీగా రుణం పొంద‌వ‌చ్చు. పాక్షిక విత్‌డ్రాయ‌ల్స్‌కు అనుమ‌తిస్తారు.

Read more about: invest, investments, savings
English summary

These are the 7 Risk free investments in India

There are several risk-free investment options available in India. All of them have different features. Some can be more appealing to you than others. Here are a few that you need to know abou
Story first published: Monday, September 25, 2017, 12:05 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns