For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫ్‌డీల‌కు బ‌దులు డెట్ ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చా?

స్థిర ఆదాయాన్ని అందించే సాధ‌నాల‌పైనే పెట్టుబ‌డులు పెట్ట‌డం డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల ప్ర‌త్యేక‌త‌. డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనూ ప‌లు ర‌కాలు ఉన్నాయి.

|

నోట్ల మార్పిడి(ర‌ద్దు) త‌ర్వాతి నుంచి సాధార‌ణ ఇన్వెస్ట‌ర్లు సైతం మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు మ‌ళ్లుతున్నారు. కొంత మంది అవ‌గాహ‌న ఉన్న‌వారు డెట్ ఫండ్ల‌ను సైతం ప‌రిశీలిస్తున్నారు. స్థిర ఆదాయాన్ని అందించే సాధ‌నాల‌పైనే పెట్టుబ‌డులు పెట్ట‌డం డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల ప్ర‌త్యేక‌త‌. డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనూ ప‌లు ర‌కాలు ఉన్నాయి. కాల వ్య‌వ‌ధి ప్ర‌కారం పెట్టుబ‌డిని లిక్విడ్‌, అల్ట్రా షార్ట్‌-ట‌ర్మ్, షార్ట్-ట‌ర్మ్, డైన‌మిక్ బాండ్‌, కార్పొరేట్ బాండ్‌, డెట్ హైబ్రిడ్‌, ఇన్‌కం ఫండ్‌ల‌తో పాటు ఇత‌ర ఫండ్ల‌లో ఇన్వెస్ట‌ర్లు త‌మ‌కు అనువైన వాటిని ఎంచుకోవ‌చ్చు.

 డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు

ఫండ్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా సాధ‌నాలు ఉండేలా ఫండ్ మేనేజ‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. అయితే డెట్ ఫండ్స్ సైతం ఎక్క‌డో ఇన్వెస్ట్ చేస్తాయి. అవి సైతం ట్రేడ్ అవుతుంటాయి. అందుకే వీటీ ఎన్ఏవీ రోజూ వారీ మారుతుంది. కాబ‌ట్టి నిర్ణీత మొత్తాన్ని రిట‌ర్నులుగా ఇవ్వ‌డంపై క‌చ్చిత‌మైన హామీ ఉండ‌దు. కొంత మంది ఇన్వెస్ట‌ర్లు ఇది తెలుసుకోకుండా త‌ర్వాత ఇబ్బంది ప‌డ‌తారు. అయితే డెట్ ఫండ్లు స‌హ‌జంగా మార్కెట్‌కు త‌గిన‌ట్లుగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ట కంటే కాస్త ఎక్కువ రాబ‌డుల‌ను అందిస్తాయి. ఫండ్ మేనేజ‌ర్ ఎంచుకునే ప్ర‌త్యేక షేర్లు, ఆయా ఉత్ప‌త్తుల మ‌ధ్య ఫండ్ మేనేజ‌ర్ నిర్వ‌హ‌ణ‌, మూల‌ధ‌న రాబ‌డి రూపంలో వ‌డ్డీ ద్వారా పొందే ల‌బ్ది, రిస్క్‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌గ‌డం ఇందుకు కార‌ణాలుగా చెప్పొచ్చు. అందుకే ఈ స్కీమ్‌ల‌ను ముందు సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే క‌నీసం 0.5% నుంచి 1.5% శాతం మ‌ధ్య అధిక రాబ‌డుల‌ను అందించేవిగా చెబుతారు.

Read more about: debt funds mutual funds
English summary

ఎఫ్‌డీల‌కు బ‌దులు డెట్ ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చా? | To get some higher returns can we go for Debt Funds

Debt funds invest most of their money into debt schemes including corporate debt, debt issued by banks, gilts and government securities. These types of funds are suitable for investors who are not willing to take risks. Returns are almost assured in these types of schemes
Story first published: Thursday, August 24, 2017, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X