English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఆ ఫండ్‌లో 15ఏళ్ల ముందు రూ.4 ల‌క్ష‌లు పెడితే ఇప్పుడు కోటి అయ్యేది

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

చాలా మందికి కోటీశ్వ‌రులు కావాల‌ని ఉంటుంది. కాని పెట్టుబ‌డుల ద‌గ్గ‌ర‌కొచ్చేసరికి రిస్క్ తీసుకోరు. అలా రిస్క్ తీసుకున్న కొంత మంది మాత్ర‌మే త‌క్కువ స‌మ‌యంలో మంచి రాబ‌డులు సాధించ‌గ‌ల‌రు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ లాంటి సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల్లో మీరు ఎంతైనా న‌ష్ట‌పోకుండా ముందుకెళ్ల‌గ‌ల‌రు. కానీ దీర్ఘ‌కాలంలో లాభాలు సాధించాలి, కోటీశ్వ‌రులు అవ్వాలంటే స్టాక్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆశ్ర‌యించాల్సిందే. అలాంటి ఒక మంచి రాబ‌డినిచ్చే మ్యూచువ‌ల్ ఫండ్ గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

1. ఫండ్ ఏది?

1. ఫండ్ ఏది?

రిల‌య‌న్స్ బ్యాంకింగ్ ఫండ్‌

దాని నిర్వ‌హ‌ణ ఆస్తుల విలువ‌: రూ.2816 కోట్లు

మార్కెట్లోకి ప్రవేశించింది ఎప్పుడు: 26 మే, 2003

2. ఫండ్ ఎలా పనిచేస్తోంది?

2. ఫండ్ ఎలా పనిచేస్తోంది?

దీని ఫండ్ ఎన్ఏవీ విలువ రూ.10 నుంచి ఆగ‌స్టు 4,2017 నాటికి రూ.263.24కు పెరిగింది.

అంటే వార్షిక ఉమ్మ‌డి వృద్ది రేటు 25.52 చొప్పున 14 ఏళ్ల‌కు ఉంది.

అంటే ప్ర‌తి 2.8 సంవ‌త్స‌రాల‌కు పెట్టుబ‌డిదారు సొమ్ము రెండింత‌ల‌యింది.

ఉదాహ‌ర‌ణ‌కు 2003లో రూ.4 ల‌క్ష‌లు పెడితే, ఇప్ప‌టికి అది రూ.1 కోటి అయ్యేది.

3. ఇంకా మిగిలిన ఫండ్ వివ‌రాలు

3. ఇంకా మిగిలిన ఫండ్ వివ‌రాలు

ఇది సెక్టార్ ఆధారిత ఫండ్‌. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవ‌ల‌కు సంబంధించింది.

ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ కావ‌డం వ‌ల్ల వ‌ల్ల ఎంట్రీ,ఎగ్జిట్ చార్జీలు ఉండ‌వు.

యాక్టివ్ ఫండ్ నిర్వ‌హ‌ణ ద్వారా అత్యుత్త‌మ రిట‌ర్నుల‌ను రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యం.

నిఫ్టీ 500 బ్యాంక్స్ ఇండెక్స్ కంటే ఇది చాలా బాగా ప‌నితీరును క‌న‌బ‌రించి రిట‌ర్నుల‌ను రాబ‌ట్టింది.

4. ఫండ్ ఉన్న‌ రంగం గురించి

4. ఫండ్ ఉన్న‌ రంగం గురించి

భార‌తదేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవ‌ల రంగం ఒక మంచి తీరును క‌న‌బ‌రుస్తున్న రంగం. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌లు, అంద‌రినీ ఆర్థిక సేవ‌ల్లోకి తీసుకువ‌స్తున్న తీరు కార‌ణంగా ఈ రంగం ఎంత‌గానో మెరుగుప‌డింది. అవ్య‌వస్థీకృత ఆర్థిక లావాదేవీల నుంచి వ్య‌వ‌స్థీకృత రంగంలోకి చాలా మంది వ‌స్తున్నారు. దీంతో బ్యాంకింగ్ మారుమూల‌ల‌కు చేరేందుకు వీల‌వుతోంది. త‌ద్వారా బ్యాంకింగ్ రంగం అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది.

5. ఇత‌ర వాటితో పోలిస్తే

5. ఇత‌ర వాటితో పోలిస్తే

ప్ర‌స్తుతం బంగారం, స్థిరాస్తి రాబ‌డులు త‌గ్గుతున్న క్ర‌మంలో ఇత‌ర ఆర్థిక పొదుపు మార్గాల్లోకి వెళుతున్నాయి. పెద్ద నోట్ల మార్పిడి త‌ర్వాత చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి ఫండ్ల వైపు మ‌ళ్లుతున్నారు. ఎక్కువ మంది అవ్య‌వస్థీకృత రంగాల నుంచి వ్య‌వ‌స్థీకృత పెట్టుబ‌డులు, పొదుపు వైపు మ‌ళ్లుతున్న కొద్దీ బ్యాంకింగ్, ఆర్థిక రంగానికి డిమాండ్ పెరుగుతున్న‌ది.

6. సిప్ గురించి కొద్దిగా

6. సిప్ గురించి కొద్దిగా

చాలా మంది మా సంపాద‌న‌తో కోట్లు ఎక్క‌డ సంపాదించేది అని ఆలోచిస్తుంటారు. రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్లో సిప్ మార్గం ఉంది. అయితే దీర్ఘ‌కాల సంప‌ద సృష్టికి మాత్ర‌మే మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ మంచిది. ఇప్పుడు రిలయ‌న్స్ బ్యాంకింగ్ ఫండ్లోనే సిప్ ద్వారా పెట్టుబడి పెట్టి ఉంటే ఏమ‌య్యేదో చూద్దాం. మే 28,2003 తో మొద‌లుకొని ప్ర‌తి నెలా సిప్ మార్గంలో రూ.1000 పెట్టి ఉంటే, మొత్తం పెట్టుబ‌డి విలువ రూ.1.71 ల‌క్ష‌ల‌యి, రాబ‌డి రూ.9.6 లల‌క్ష‌లు అయ్యేది అని వాల్యూరిసెర్చ్ వెబ్‌సైట్ తెలుపుతుంది. అంటే వార్షిక ఉమ్మ‌డి వృద్ది రేటు(సీఏజీఆర్‌) 22 శాతం అన్న‌ట్లు లెక్క‌.

మ్యూచువ‌ల్ పండ్

మ్యూచువ‌ల్ పండ్

మ్యూచువ‌ల్ ఫండ్ రిస్క్‌తో కూడుకున్న పెట్టుబ‌డులు. మార్కెట్ ప‌నితీరు ఆధారంగా రాబ‌డులు మారుతూ ఉంటాయి. స్కీమ్ సంబంధించిన డాక్యుమెంట్లు క్షుణ్ణంగా చ‌దివిన త‌ర్వాత మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా సూచించడ‌మైన‌ది. ఇది కేవ‌లం ఉన్న స‌మాచారం ఆధారంగా మాత్ర‌మే ఇచ్చిన క‌థ‌నం. దీని ఆధారంగా పెట్టుబ‌డులు పెట్టి న‌ష్ట‌పోతే గుడ్‌రిట‌ర్న్స్ యాజ‌మాన్యం, ఈ క‌థ‌నం రాసిన వారు ఎటువంటి బాధ్య‌త వ‌హించ‌రు.

Read more about: mutual fund, investments
English summary

Reliance Banking Fund Turns you crorepati in 15 years

A check on the Value Research website shows that is you would have started a monthly SIP of Rs. 1,000 in this fund on May 28, 2003, then your total investment of Rs. 1.71 lakh by July 28, 2017, would have grown to Rs. 9.6 lakh, a staggering 22 per cent CAGR.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns